సుజాత (నటి)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సుజాత (నటి) | |
---|---|
జననం | శ్రీలంక | 1952 డిసెంబరు 10
మరణం | 2011 ఏప్రిల్ 6 | (వయసు 58)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1968–2006 |
జీవిత భాగస్వామి | జయకర్ |
పిల్లలు | సాజిత్, దివ్య |
సుజాత (డిసెంబర్ 10, 1952 – ఏప్రిల్ 6, 2011). ఒక మలయాళ నటి. ఈమె శ్రీలంకలో పుట్టి పెరిగింది. జన్మస్థలం కేరళ లోని మరదు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
సినిమాలు
[మార్చు]సుజాతను దాసరి నారాయణరావు గారు తెలుగులో గోరింటాకు (1979 సినిమా) చిత్రంద్వారా పరిచయం చేసారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. తపస్య హిందీ సినిమా ఆధారంగా తయారయిన సంధ్య (కోదండరామిరెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీలో రాఖీ నటించిన పాత్రలో ఈమె రాణించారు. అంతులేని కథ తమిళ వెర్షన్ లో సుజాత నటించారు.
గోరింటాకు, సూత్రధారులు, శ్రీరామదాసు ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన పెళ్ళి (సినిమా) చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డు అందుకున్నారు.
సినిమాలు
[మార్చు]- ఏడంతస్తుల మేడ
- సుజాత
- పసుపు పారాణి
- సంధ్య
- రౌడీలకు సవాల్ (1984)
- సర్కస్ రాముడు
- సూరిగాడు
- ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు
- అహంకారి
- ఘరానా కూలి (1993)
- జస్టిస్ చక్రవర్తి
- సీతాదేవి
- బహుదూరపు బాటసారి
- వంశ గౌరవం
- రంగూన్ రాజా
- చంటి
- పెళ్ళి
- తప్పుచేసి పప్పుకూడు
- విలన్ (2003)
కుటుంబం
[మార్చు]ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే తబస్విని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన అవళ్ ఒరు తొడర్ కథై (తెలుగులో అంతులేని కథ )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్ళిచేసుకొంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.[1]