Jump to content

సూత్రధారులు

వికీపీడియా నుండి
సూత్రధారులు
దర్శకత్వంకె.విశ్వనాథ్
రచనకె.విశ్వనాథ్ (కథ, చిత్రానువాదం)
ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు)
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు
మాగంటి మురళీమోహన్
కైకాల సత్యనారాయణ
కె. ఆర్. విజయ
భానుచందర్
సుజాత
రమ్యకృష్ణ
సాక్షి రంగారావు
ఛాయాగ్రహణంమధు అంబట్
సంగీతంకె.వి. మహదేవన్
విడుదల తేదీ
4 మే 1989 (1989-05-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

సూత్రధారులు 1989 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. సుదర్శన్ సినీ ఎంటర్‌ప్రైజెస్ బేనర్ పై సుధాకర్, కరుణాకర్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, కైకాల సత్యనారాయణ, కె. ఆర్. విజయ, సుజాత, భానుచందర్, రమ్యకృష్ణ ప్రధాన నటులు. కె. వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాకు కె.వి. సత్యనారాయణ నృత్య దర్శకత్వం చేశాడు.

హనుమద్దాసు (అక్కినేని నాగేశ్వరరావు), అతని బావమరిది రంగదాసు (మురళీ మోహన్) హరిదాసుల కుటుంబానికి చెందిన వారు. హనుమద్దాసు, దేవమ్మ ల కుమారుడు తిరుమల దాసు (భానుచందర్). రంగదాసు కూతురు సీతాలు (రమ్యకృష్ణ). నీలకంఠం (కైకాల సత్యనారాయణ) ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి. అదే ఊర్లో హరికథలు చెప్పే యశోదమ్మ (కె. ఆర్. విజయ)ను నీలకంఠం మానభంగం చేస్తాడు. ఎంతో మంచివాడైన సనాతన ధర్మములని ఆచరించే  తన భర్త భాగవతాచార్యులు (అశోక్ కుమార్)కి మానం పోయిన తాను సరిపోనని తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. యశోదమ్మ తిరుమల దాసును తనతోబాటు తీసుకుని అతనికి మంచి చదువు చెప్పించడం కోసం పట్నం వచ్చేస్తుంది.

ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. హనుమద్దాసు పన్నిన వ్యూహం ప్రకారం తిరుమలదాసు గ్రామ ప్రజాలందరిలో ఐక్యత రేకెత్తించటానికి నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే ఉంటాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు. ఈ కారణంగా సీతాలు, తిరుమలదాసుల ప్రేమలో విభేదాలు తలెత్తుతాయి. కానీ తరువాత ఆమె అసలు విషయం తెలుసుకుని తిరుమలదాసుకి దగ్గరవుతుంది. చివరికి, నీలకంఠం ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోటానికి ప్రయత్నిస్తాడు. ఆ భూములు తమకే చెందాలని కొందరు భూస్వాములు తిరుమలదాసుకి లంచం ఇస్తారు. ఆ లంచం డబ్బుతో ఆ భూములని గ్రామస్తులకి చెందేటట్లు చేస్తాడు తిరుమలదాసు. దానితో నీలకంఠం గ్రామాన్ని నాశనం చేయటానికి మనుషులని పంపుతాడు. తిరుమలదాసు పోలీసుల సాయంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. గ్రామస్తులంతా ఒక్కటై నీలకంఠాన్ని చంపటానికి బయలుదేరతారు. ఇంతలో హనుమత్ దాసు వారికి అడ్డుపడి సమస్యను పరిష్కరించడానికి హింస సరైన మార్గం కాదని వారిని శాంతింపజేస్తాడు. ఈ మధ్య, యశోదమ్మ తన భర్తతో కలిసిపోతుంది. చివరికి, నీలకంఠం కూడా తన తప్పును గ్రహించి, తన ఆయుధాలన్నింటినీ విడిచి మంచి వాడిగా మారిపోతాడు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • ఆయతనవాన్ భవతీ ఏ యేవం వేదా
గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ, రచన:సాంప్రదాయం
  • కలలెందుకు కథలెందుకు, తలపెందుకు తపమెందుకు
గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, రచన: చెంబోలు సీతారామశాస్త్రి
  • కొలిచీనందుకు నిన్ను కోదండరామా
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • జోలజోలమ్మ జోలా జేజేల జోలా, నీలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
గానం - ఎస్. పి. శైలజ, రచన: సి నారాయణ రెడ్డి
  • మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • లాలేలో ఏలేలో రామాలాలోయిలాల అమ్మలాల, మూడు బురుజుల కోట ముత్యాల తోట
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ, రచన:సి.నారాయణ రెడ్డి
  • యదుకుల వాడలకు కృష్ణమూర్తి
గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం. రచన. సి నారాయణ రెడ్డి
  • శ్రీరస్తు శుభమస్తు
గానం - పి. సుశీల, కళ్యాణి , రచన: మాడుగుల నాగ ఫణి శర్మ

పురస్కారాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]