సిరివెన్నెల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సిరివెన్నెల
(1986 తెలుగు సినిమా)
Sirivennela Movie.jpg
దర్శకత్వం కె . విశ్వనాథ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
రచన కె.విశ్వనాథ్
తారాగణం సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్ మున్ సేన్, మీనా, సంయుక్త
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియెషన్స్
విడుదల తేదీ 1986
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సిరివెన్నెల 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ (సర్వదమన్ బెనర్జీ) మరియు మూగదైన చిత్రకారిణి (సుహాసిని) చుట్టూ తిరుగుతుంది.

నటవర్గం[మార్చు]

విశేషాలు[మార్చు]

తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. సీతారామశాస్త్రి ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. కె.వి.మహదేవన్ సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న విధాత తలపున ప్రభవించినది... ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో చందమామ రావే జాబిల్లి రావే ..., ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, మెరిసే తారలదే రూపం తదితర గీతాలు విశేషంగా అలరించాయి.

చిత్రీకరణ[మార్చు]

ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లో జైపూర్ లో చిత్రీకరించారు. మొదట్లో చిత్రీకరణ కోసం అక్కడకు వెళ్ళిన వారికి జైపూర్ పర్యాటక శాఖ అధికారులు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారు. అనుమతి కోసం అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్ళగా ఆయన శంకరాభరణం సినిమాకు అభిమాని కావడంతో విశ్వనాథ్ ని గుర్తుపట్టి సులభంగా అనుమతి ఇప్పించాడు. [1]

సంగీతం[మార్చు]

సిరివెన్నెల శాస్త్రీయ సంగీతం కె.వి.మహదేవన్ గారిచే కూర్చబడింది, వేణువు సహకారం హరిప్రసాద్ చౌరాసియా గారిచే ఇవ్వబడింది.

అన్ని పాటలు రచించినవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: కె.వి.మహదేవన్.

పాటలు
సంఖ్య. పాట గానం నిడివి
1. "ఆది భిక్షువు వాడినేమి కోరేదీ"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
2. "ఈ గాలి ఈ నేల"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
3. "చినుకు చినుకు"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
4. "చందమామ రావే జాబిల్లి రావే"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
5. "పాటల్లో"   ప్రకాశ రావు, పి.సుశీల  
6. "పొలిమేరు దాటిపోతున్న"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత  
7. "ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
8. "మెరిసే తారలదే రూపం"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  
9. "విధాత తలపున ప్రభవించినది"   ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  

పురస్కారాలు[మార్చు]

Year Nominated work Award Result
1986 సిరివెన్నెల సీతారామశాస్త్రి
("విధాత తలపునకు ప్రభవించినది" రచనకు)
నంది ఉత్తమ గీత రచయితలు విజేత
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
("విధాత తలపునకు ప్రభవించినది" గానమునకు)
నంది ఉత్తమ గాయకుడు విజేత
మూన్ మూన్ సేన్ నంది ఉత్తమ సహాయనటీమణులు విజేత
ఎం వి రఘు[2] నంది ఉత్తమ ఛాయాగ్రహకులు విజేత

వనరులు[మార్చు]

  1. బి, మధులత. "ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 May 2017. Retrieved 10 May 2017. 
  2. "The saga of a lensman". The Hindu. Chennai, India. 9 June 2003. 

బయటి లింకులు[మార్చు]