శుభలేఖ (సినిమా)

వికీపీడియా నుండి
(శుభలేఖ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శుభలేఖ
దర్శకత్వంకె.విశ్వనాథ్
రచనగొల్లపూడి మారుతీరావు (మాటలు)
స్క్రీన్ ప్లేకె.విశ్వనాథ్
కథకె.విశ్వనాథ్
తారాగణంచిరంజీవి,
సుమలత
ఛాయాగ్రహణంలోక్ సింగ్
కూర్పుజి.జి.కృష్ణారావు
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1982
భాషతెలుగు

శుభలేఖ 1982 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సాంఘిక చిత్రం. ఇందులో చిరంజీవి, సుమలత ముఖ్యపాత్రలు పోషించారు.

కథ[మార్చు]

శాస్త్రీయ నృత్య భంగిమలో

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరసింహ మూర్తి (చిరంజీవి) డిగ్రీలో తప్పటంతో ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంకెల ఆదిశేషయ్య (కైకాల సత్యనారాయణ) నడుపుతున్న కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సుజాత (సుమలత) అతనికి పరిచయం అవుతుంది. ఆదిశేషయ్య తన కుమారుడు మోహన్ (గిరీశ్)తో సహా పెళ్ళిచూపులకి సుజాత ఇంటికి వస్తారు. ఆదిశేషయ్య అడిగిన వరకట్నం సుజాత కుటుంబం స్తోమతకి మించగా, సుజాత అతనితో వాదనకి దిగుతుంది. తమతోనే ఉంటే తమ కుమార్తె వివాహం చెయ్యలేమని, సంఘంలో తలెత్తుకు తిరగలేమని భయపడిన తల్లిదండ్రులు ఆమెను ఇంటినుండి పంపించేస్తారు. ఆదిశేషయ్య కూడా తనని పనిలోంచి తీసేయగా నిరాశ్రయురాలైన తనకి తన ఇంటిలోనే చోటిస్తాడు మూర్తి. అయితే సంఘం వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒక సన్మాన సభలో ఆదిశేషయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టి మూర్తి అతనిని అవమానించగా, రౌడీలతో అతనిని కొట్టించి, అతని ఉద్యోగం కూడా తీయించేస్తాడు ఆదిశేషయ్య. సుజాతతో బాటు హైదరాబాదు చేరి, తనకి పరిచయం ఉన్న ఆల్విన్ లో ఉన్నతోద్యోగి అయిన రావు (అరుణ్) తో మాటాడి సుజాతకి ఉద్యోగం ఇప్పిస్తాడు మూర్తి. సుజాత చెల్లెలు లక్ష్మి (తులసి) ని మోహన్ తమ్ముడు మురళి (శుభలేఖ సుధాకర్) ప్రేమిస్తాడు. లక్ష్మితో పెళ్ళి జరిపించకపోతే ఆత్మహత్య చేస్కొంటానన్న మురళి బెదిరింపుకు భయపడి, తక్కువ కట్నంతోనే మురళి, తులసి ల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు ఆదిశేషయ్య.

మూర్తి, సుజాతల పెళ్ళికి మురళి, లక్ష్మిలు ఏం చేశారు, అన్నది చిత్రానికి ముగింపు.

తారాగణం[మార్చు]

విశేషాలు[మార్చు]

కథకళి వేషధారణలో

పాటలు[మార్చు]

  • రాగాల పల్లకిలో కోయిలమ్మా, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • అయితే అది నిజమైతే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • విన్నపాలు వినవలె వింతవింతలు, రచన: అన్నమయ , గానం .ఎస్ జానకి
  • నెయ్యములల్లో , రచన: అన్నమయ్య , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నీజడ కుచ్చులు నామెడకుచ్ఛులు , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
  • ఓహో తద్దిమి తజజను , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ జానకి , పూర్ణచంద్రరావు
  • మరుగేలరా ఓ రాఘవ , రచన: త్యాగరాజ కీర్తన , గానం.ఎస్ . జానకి.

ఇవి కూడా చూడండి[మార్చు]