తులసి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తులసి
జననం (1968-09-28) 1968 సెప్టెంబరు 28 (వయస్సు: 51  సంవత్సరాలు)
భార్య/భర్త శివమణి
ప్రముఖ పాత్రలు మంత్రిగారి వియ్యంకుడు
ప్రేమించు పెళ్ళాడు
శంకరాభరణం

తులసి తెలుగు సినిమా నటి. తులసి తల్లి సినీ నటీమణులు అంజలీదేవికి మరియు సావిత్రికి మంచి స్నేహితురాలు. వీరు తులసి వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండేవారు. అప్పట్లో తులసి చురుకైన పిల్ల అని గమనించి సినీరంగములో బాగా రాణించగలదని అనుకున్నారు. భార్య సినిమా నిర్మాత ఒక బాల్యనటి కోసం వెతుకుతుండగా, వాళ్ళు తులసిని ఆ పాత్రకై సిఫారుసు చేశారు. అప్పటి నుండి అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ సినిమా షూటింగు సందర్భములో దాసరి నారాయణరావు తులసి యొక్క నటన నచ్చి, ఇతర నిర్మాతలకు కూడా రికమెండ్ చేశాడు.

బాల్యనటిగా తులసి ఒకటిన్నర యేళ్ళ వయసులోనే భార్య చిత్రములో రాజబాబు కొడుకుగా చలనచిత్ర రంగములో ప్రవేశించింది.[1] 1977లో విడుదలైన చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలో చిన్నప్పటి జయచిత్రగా నటించి మంచి పేరు తెచ్చుకున్నది. అయితే సీతామహాలక్షి చిత్రముతో నలుగురి దృష్టిలో పడింది. ఈ చిత్రంలో తులసి పాత్రపై మూడుపాటలు చిత్రీకరించడంతో ఈమె పోషించిన పాత్ర ప్రధానపాత్ర అయ్యింది. సీతామహాలక్షి సినిమాలో కొన్ని చిన్న నృత్య సన్నివేశాలలో తన నృత్యాన్ని తానే రూపొందించుకొని ప్రదర్శించింది.

శంకారాభరణం సినిమాతో తులసి తెలుగునాట ఇంటింటా ఆమె పోషించిన పాత్ర పేరు తులసీరామ్గా పేరుతెచ్చుకొన్నది. ఆ సినిమాలో జే.వీ.సోమయాజులు, మంజుభార్గవిల పాత్రల తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర తులసిదే,

కథానాయకిగా తులసి తొలిచిత్రం జంధ్యాల దర్శకత్వం వహించిన ముద్ద మందారం. ఈ సినిమాలో ప్రదీపు మరదలుగా తులసి నటించింది. ఆ తర్వాత వచ్చిన నాలుగు స్థంబాలాట (1982), శుభలేఖ (1982) మరియు మంత్రిగారి వియ్యంకుడు (1984), ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ద్వితీయ కథానాయకిగా నటించింది. శుఖలేఖ చిత్రం మంచి విజయం సాధించి శుభలేఖ సుధాకర్ - తులసిల జంటకు మంచి పేరు రావటంతో ఆ తరువాత అదే తరహా పాత్రలలో ఆమెకు అవకాశాలు వచ్చాయి. మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలు కూడా విజయం సాధించటంతో తులసి ఒకటి అరా పాటలున్న చెల్లెలి పాత్రలకు బాగా సరిపోతుందనే ముద్ర పడింది. ఈ మూస చట్రంలోనుండి బయటపడటానికి పూజకు పనికిరాని పువ్వు వంటి స్త్రీ ప్రధాన సినిమాలలోనూ, శ్రీ కట్నలీలలు వంటి సినిమాలో గ్లామర్ పాత్రలు పోషించినా అవి విజయం సాధించలేదు.

తులసికి ఒక ప్రముఖ సినీ సంగీతదర్శకుడితో పెళ్ళి నిశ్చయమైంది కానీ చివరి క్షణంలో పారిపోయి వేరేవ్యక్తిని పెళ్ళి చేసుకున్నదని సినీరంగంలో వందతులున్నాయి. అయితే తెలుగుసినిమా.కాంకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ సంగతిని ఆమె ఖండించలేదు. ఆ వ్యక్తి పేరును బయటపెట్టడానికి మాత్రం నిరాకరించింది. తులసి ఒక ప్రముఖ కన్నడ దర్శక నిర్మాతను కలిసిన మొదటి రోజే పెళ్ళి చేసుకున్నది.

తెలుగులో హీరోయిన్‌గా తులసి చివరిచిత్రం 1999లో విడుదలైన కన్నయ్య కిట్టయ్య. వివాహం తర్వాత తెలుగు చిత్రరంగంతో సంబంధాలన్నీ తెంచేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది.

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php
  2. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". మూలం నుండి 18 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 21 July 2019. Cite news requires |newspaper= (help)

బయటి లింకులు[మార్చు]