మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి | |
---|---|
దర్శకత్వం | పి. మహేష్ కుమార్ |
రచన | పి. మహేష్ కుమార్ |
నిర్మాత | వంశీ, ప్రమోద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నీరవ్ షా |
సంగీతం | రధన్ |
నిర్మాణ సంస్థ | యూవీ క్రియేషన్స్ |
విడుదల తేదీs | 7 September 2023(థియేటర్) 5 October 2023 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 2023లో విడుదలైన భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ కామెడీ చిత్రం, మహేష్ బాబు పచ్చిగొల్ల రచన మరియు దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వంశీ కృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి నటించారు.
ఈ చిత్రం 2021 మార్చిలో అధికారికంగా ప్రకటించబడింది, తరువాత ఈ చిత్రం పేరు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని వెల్లడైంది. ఈ చిత్రానికి సంగీతం రథన్ (పాటలు) మరియు గోపీ సుందర్ (స్క్రోల్) స్వరపరిచారు, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్‌ను వరుసగా నీరవ్ షా మరియు కోటగిరి.వి నిర్వహించారు.
ఇది 2023 సెప్టెంబరు 7న విడుదలైంది మరియు విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.
తారాగణం
[మార్చు]- అనుష్క[1]
- నవీన్ పొలిశెట్టి
- జయసుధ
- మురళీ శర్మ
- నాజర్
- తులసి
- హర్ష వర్ధన్
- అభినవ్ గోమఠం
- సోనియా దీప్తి .
- రోహిణి
- రాకేష్ వర్రె
- భద్రం
- మహేష్ ఆచంట
పాటల జాబితా
[మార్చు]లేడీ లక్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్
నో నో నో, రచన: అనంత్ శ్రీరామ్, గానం.ఎం ఎం మనసి, లేడీ కష్
హతవిధీ, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . ధనుష్
ఏ వైపుకు సాగుతుంది, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శంకర్ మహదేవన్.
దూకే చినుకా, రచన: అనంత్ శ్రీరామ్, గానం.అబ్బీ వి .
కథ
[మార్చు]స్వతంత్ర భావాలున్న అన్విత (అనుష్కా శెట్టి) తన తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలవుతుంది. తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని అనుకుంటుంది.పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలని అనుకుంటుంది. బిడ్డను కనేందుకు తగిన యువకుడి కోసం వెతుకుతుండగా ఈ క్రమంలో స్టాండప్ కామెడీ చేసే సిద్దూ పొలిశెట్టి ( నవీన్ పొలిశెట్టి) పరిచయమవుతాడు. సిద్దూ అన్విత పెమలో పడుతాడు, కానీ అన్విత నిర్ణయంతో సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వారిద్దరి ప్రయాణం ఎలా సాగింది? మరి చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
విడుదల
[మార్చు]మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 2023 సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్టోబరు 5 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: యూవీ క్రియేషన్స్
- నిర్మాత: వంశీ, ప్రమోద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. మహేష్ కుమార్
- సంగీతం: రధన్
- సినిమాటోగ్రఫీ:నీరవ్ షా
- కొరియోగ్రాఫర్: రాజు సుందరం
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (7 September 2023). "రివ్యూ: మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.. అనుష్క, నవీన్‌ల మూవీ అలరించిందా?". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
- ↑ TV9 Telugu (5 October 2023). "ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)