భద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రం
జననం
భద్రం

అక్టోబర్ 8
వృత్తినటుడు, వైద్యుడు
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం
బంధువులుసోము వీర్రాజు

భద్రం తెలుగు సినిమా హాస్య నటుడు మరియు వైద్యుడు. ఆయన 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

భద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జన్మించాడు. ఆయన తండ్రి గిరి యుగంధర్‌ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. ఆయన బెంగుళూర్‌లో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

భద్రం హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్‌ ((ఫిజియోథెరపిస్ట్‌) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పని చేస్తూ , దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్‌ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు.[2]

సినీ ప్రస్థానం[మార్చు]

భద్రం డాక్టర్‌గా పని చేస్తూ సినిమాలపై ఇష్టంతో ‘లవ్‌ పెయిన్‌’ పేరుతో మొదట చిన్న వీడియో చేశాడు. ఆయన అనంతరం ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ తీసి అందులో నటించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ ను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఆయన దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో అవకాశం ఇచ్చాడు. [3]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 October 2017). "డాక్టర్‌ టు యాక్టర్‌". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  2. Sakshi (18 July 2020). "డాక్టర్‌ అయ్యాకే యాక్టర్‌ అయ్యాడు 'భద్రమ్‌"". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  3. Sakshi (18 September 2014). "భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=భద్రం&oldid=3376498" నుండి వెలికితీశారు