రణరంగం (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణరంగం
రణరంగం సినిమా పోస్టర్
దర్శకత్వంసుధీర్ వర్మ
రచనసుధీర్ వర్మ
స్క్రీన్ ప్లేసుధీర్ వర్మ
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
తారాగణంశర్వానంద్
కాజల్ అగర్వాల్
కళ్యాణి ప్రియదర్శన్
ఛాయాగ్రహణందివాకర్ మణి
కూర్పునవీన్ నూలి
సంగీతంప్రశాంత్ పిళ్ళై
నిర్మాణ
సంస్థ
సితార ఎంటర్టైన్మెంట్స్
పంపిణీదార్లుహారిక అండ్ హసిన్ క్రియేషన్స్
విడుదల తేదీ
15 ఆగస్టు 2019 (2019-08-15)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రణరంగం[1] 2019, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] సుధీర్ వర్మ[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించాడు.

దేవా (శర్వానంద్‌) విశాఖపట్నంలో తన స్నేహితులతో కలిసి బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముకుంటూనే లిక్కర్‌ మాఫియాకు కింగ్‌లా మారుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదం అయిన సమయంలో దేవా లిక్కర్‌ స్మగ్లింగ్‌ చేస్తాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ)-దేవాల మధ్య శత్రుత్వం పెరుగతుంది. గీత (కళ్యాణీ ప్రియదర్శిణ్)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా, ఓ పాప పుట్టిన తరువాత గొడవలన్నింటిని వదిలేసి స్పెయిన్‌కు వెళ్తాడు. దేవా స్పెయిన్‌కు ఎందుకు ఎళ్ళాడు, గీత పరిస్థితి ఏంటి, డాన్‌గా మారిన దేవాకు అసలు శత్రువు ఎవరు అనేది మిగతా కథ.[4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
  • సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
  • ఛాయాగ్రహణం: దివాకర్ మణి
  • కూర్పు: నవీన్ నూలి
  • నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్
  • పంపిణీదారు: హారిక అండ్ హసిన్ క్రియేషన్స్

మార్కెటింగ్

[మార్చు]

ఈ చిత్రానికి సంబంధించి శర్వానంద్ ఫోటో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ 2019, మే నెలలో విడుదల అయింది.[5] మే 25వ తేదీన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబడింది.[6] హారిక అండ్ హసిన్ క్రియేషన్స్ వారిచేత ఆగస్టు 4వ తేదీన చిత్ర ట్రైలర్ యూట్యూబ్ వేదికగా విడుదల అయింది.[7]

పాటలు

[మార్చు]

ప్రశాంత్ పిళ్ళై, కార్తీక్ రొడ్రిగుజ్, సన్నీ ఎంఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బాలాజీ రాసిన "సీతా కళ్యాణం" పాట మినహా మిగతా అన్ని పాటలను కృష్ణచైతన్య రాశాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2019, జూలై 4న బాలాజీ రాయగా శ్రీహరి పాడిన "సీతా కళ్యాణం" అనే మొదటి పాట విడుదలైంది. 2019, జూలై 20న కార్తీక్ రోడ్రిగుజ్ స్వరపరచి, పాడిన పాట "కన్ను కొట్టి" రెండవ పాటగా విడుదలైంది. 2019, జూలై 29న సన్నీ ఎంఆర్ స్వరపరిచిన "పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్" మూడవ పాటగా విడుదలైంది. 2019, ఆగస్టు 10న మొత్తం పాటలు విడుదలయ్యాయి.

రణరంగం
పాటలు by
ప్రశాంత్ పిళ్ళై, కార్తీక్ రొడ్రిగుజ్, సన్నీ ఎంఆర్
Released10 ఆగస్టు 2019 (2019-08-10)
Recorded2018-2019
Studioమై స్టూడియో, కొచ్చి
Genreసినిమా పాటలు
Labelఆదిత్యా మ్యూజిక్
External audio
Audio song యూట్యూబ్లో
మూస:Singles
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సీతా కళ్యాణం (రచన: శ్రీహరి కె)"  శ్రీహరి కె 3:31
2. "పిల్లా పిక్చర్ ఫర్ఫెక్ట్ (రచన: కృష్ఱచైతన్య)"  నికితా గాంధీ 3:35
3. "కన్ను కొట్టి (రచన: కృష్ఱచైతన్య)"  కార్తీక్ రొడ్రిగుజ్ 2:39
4. "ఎవరో ఎవరో (రచన: కృష్ఱచైతన్య)"  ప్రీతి పిళ్ళై 4:16
5. "కుమ్మెయ్ రా (రచన: కృష్ఱచైతన్య)"  కార్తీక్ రొడ్రిగుజ్ 3:33

విడుదల - రేటింగ్

[మార్చు]

2019, ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల చేయబడింది.[8] టైమ్స్ ఆఫ్ ఇండియా 3/5 రేటింగ్ ఇచ్చింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Ranarangam review: A stylish battlefield". The Hindu. The Hindu. 15 August 2019.
  2. "Sharwanand's look in Ranarangam unveiled". Indian Express. 25 May 2019. Retrieved 22 December 2019.
  3. "Sudheer varma special set for his next movie". Times of India. Times of India. 19 March 2018.
  4. సాక్షి, సినిమా (15 August 2019). "'రణరంగం' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 15 ఆగస్టు 2019. Retrieved 6 January 2020.
  5. Neeshita Nyayapati (25 May 2019). "Sharwanand's 'Ranarangam' first look is badass!". Times of India. Retrieved 22 December 2019.
  6. "Ranarangam First Look | Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan | Sudheer Varma". YouTube. Aditya Music. 25 May 2019.
  7. "Ranarangam Theatrical Trailer - Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan - Sudheer Varma". YouTube. Haarika & Hassine Creations. 4 August 2019.
  8. "Ranarangam to arrive on August 15". 17 July 2019.
  9. "RANARANGAM MOVIE REVIEW". TimesofIndia.

ఇతర లంకెలు

[మార్చు]