శబరి (సినిమా)
శబరి | |
---|---|
దర్శకత్వం | అనిల్‌కాట్జ్ |
రచన | అనిల్‌కాట్జ్ |
నిర్మాత | మహేంద్రనాథ్ కూండ్ల |
తారాగణం | వరలక్ష్మి శరత్ కుమార్ శశాంక్ మైమ్ గోపి |
ఛాయాగ్రహణం | నాని చమిడిశెట్టి రాహుల్ శ్రీవాత్సవ్ |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | మహా మూవీస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శబరి 2024 లో ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం.[1] మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ బ్యానర్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌కాట్జ్ రచన,దర్శకత్వం వహించాడు.[2] వరలక్ష్మి శరత్ కుమార్, మైమ్ గోపి, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియో గ్లింప్స్ 2023 జనవరి 10న విడుదల చేశారు.[3]
చిత్ర నిర్మాణం
[మార్చు]శబరి సినిమా 4 ఏప్రిల్ 2022న హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘నాంది’ సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. [4] సినిమా టీం మొదటి షెడ్యూల్‌ని హైదరాబాద్ లో విజయవంతంగా పూర్తి చేసి తదుపరి షూటింగ్ షెడ్యూల్స్ కొడైకెనాల్, విశాఖపట్నం లో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలు, క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో షూటింగ్ పూర్తయ్యింది.[5]
కథ
[మార్చు]సంజన (వరలక్ష్మి శరత్ కుమార్) తన భర్త (గణేష్ వెంకట్రామన్) ను విడిచిపెట్టి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో తన ఐదేళ్ల కుమార్తె (బేబీ నివేక్ష) తో వైజాగ్ వస్తుంది. కానీ ఆమె తన గతపు నీడల నుండి తప్పించుకోలేకపోతుంది. కంటికి కనిపించని శత్రువు ప్రాణప్రదంగా చూసుకుంటున్న కూతుర్ని అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ దుష్ట పన్నాగం వెనుక ఎవరున్నారు? వారు ఆమెను తన బిడ్డ నుండి ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? అనే మానసిక సంఘర్షణను అధిగమించి కూతుర్ని కాపాడుకునే అమ్మ కథ.[6]
నటీనటులు
[మార్చు]- వరలక్ష్మి శరత్ కుమార్
- శశాంక్
- మైమ్ గోపి
- గణేష్ వెంకట్రామన్
- మధునందన్
- సునైనా బాదం
- కేశవ్ దీపక్
- బేబీ నివేక్ష
- బేబీ కృతిక
- భద్రం
- రాజశ్రీ నాయర్
- ఆశ్రిత వేముగంటి
- జెమినీ సురేష్
- రాజశేఖర్ అనింగి
- అర్చన అనంత్
- రషికా బాలి
- కృష్ణతేజ
- ప్రభు
- వివా రాఘవ
- హర్షిణి కోడూరు
- ప్రమోదిని
- బిందు పగిడిమర్రి
- మీనా కుమారి
- మూలవిరాట్ అశోక్ రెడ్డి
- జబర్దస్త్ ఫణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మహా మూవీస్
- నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌కాట్జ్
- సంగీతం: గోపీ సుందర్
- సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి, రాహుల్ శ్రీవాత్సవ్
- ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పులాలా
- ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
- సౌండ్ డిజైన్: దేవి కృష్ణ కడియాల
- సౌండ్ ఎఫెక్ట్స్ : యతిరాజ్
- విజువల్ ఎఫెక్ట్స్: రాజేష్ పాల
- ఫైట్స్: నందు, నూర్
- పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్
- నేపథ్య గానం : కె. ఎస్. చిత్ర, అమృత సురేష్, రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి
- కోరియోగ్రఫీ: సుచిత్రా చంద్రబోస్, రాజ్ కృష్ణ
- కాస్ట్యూమ్ డిజైనర్: మానస నున్న
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు (5 April 2022). "సైకలాజికల్ థ్రిల్లర్‌తో...వరలక్ష్మి శరత్‌కుమార్..'శబరి' ప్రారంభం". Eenadu. Archived from the original on 26 July 2023. Retrieved 3 may 2024.
{{cite news}}
: Check date values in:|accessdate=
(help) - ↑ Abplive (15 December 2022). "వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'శబరి'. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డబ్బింగ్ స్టార్ట్ చేశారు". Abplive. Archived from the original on 26 July 2023. Retrieved 26 July 2023.
- ↑ సాక్షి (10 January 2023). "ఉత్కంఠ రేపుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ 'శబరి' టీజర్". Sakshi. Archived from the original on 26 July 2023. Retrieved 26 July 2023.
- ↑ 10tv (4 April 2022). "లేడీ లీడ్‌గా జయమ్మ.. పాన్ ఇండియా సినిమాగా 'శబరి'". 10tv. Archived from the original on 26 July 2023. Retrieved 27 July 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Timesofindia (26 September 2022). "Varalaxmi shoots climax of Sabari in kodaikanal" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2023. Retrieved 26 July 2023.
- ↑ ప్రజాశక్తి (10 January 2023). "'శబరి' టీజర్ విడుదల". Prajasakti. Archived from the original on 27 July 2023. Retrieved 27 July 2023.