మదన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదన్
జననం
రామిగాని మదన్ మోహన్ రెడ్డి

వృత్తిదర్శకుడు, రచయిత, నిర్మాత

మదన్ ఒక తెలుగు సినీ దర్శకుడు.[1] పలు పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న ఆ నలుగురు సినిమాకు రచయితగా పనిచేశాడు.[2]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మదన్ చిత్తూరు జిల్లా, మదనపల్లి లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని డిగ్రీ వరకు చదువు అక్కడే సాగింది. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసి, దర్శకత్వ వహించేవాడు.[1]

కెరీర్[మార్చు]

సినిమా రంగం మీద ఆసక్తితో హైదరాబాదుకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. మొదట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ తరపున కొన్ని టీవీ కార్యక్రమాలు రూపొందించాడు. డాక్యుమెంటరీలు తీశాడు. తరువాత మనసంతా నువ్వే, సంతోషం సినిమాల కోసం కెమెరామెన్ ఎస్. గోపాలరెడ్డి దగ్గర సహాయకుడిగా చేరాడు. కెమెరా గురించి తెలుసుకోవడం వల్ల రచనలను దృశ్యరూపంలోకి మార్చేటపుడు ఉపయోగపడుతుందని అలా కొద్ది రోజులు పనిచేశాడు. తరువాత కళ్యాణ రాముడు, ఖుషీ ఖుషీగా సినిమాల్లో రచనా విభాగంలో పనిచేశాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కథా చర్చల్లో పాల్గొన్నాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 జీవి. "దర్శకుడు మదన్ తో ఇంటర్వ్యూ". idlebrain.com. జీవి. Retrieved 14 October 2016.
  2. "ఆ నలుగురు సినిమా పురస్కారాలు". telugumoviepedia.com. చిత్ర్. Retrieved 17 October 2016.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=మదన్&oldid=2824890" నుండి వెలికితీశారు