గుండె ఝల్లుమంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండె ఝల్లుమంది
దర్శకత్వంమదన్
నిర్మాతపరుచూరి శివరామప్రసాద్
తారాగణంఉదయ్ కిరణ్, అదితి శర్మ, అజయ్, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2008 సెప్టెంబరు 12 (2008-09-12)
భాషతెలుగు

గుండె ఝల్లుమంది 2008 లో మదన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఉదయ్ కిరణ్, అదితి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ సినిమాను పరుచూరి శివరామప్రసాద్ యునైటెడ్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

నీలిమ అనే కళాశాల విద్యార్థిని అబ్బాయిలు జోలికి అసలు వెళ్ళకూడదనీ బలంగా నిర్ణయం తీసుకుంటుంది. రాజేష్ అనే పేరును ఎంచుకుని అతను తన బాయ్ ఫ్రెండ్ అనీ, వేరే అబ్బాయిలెవరూ తన దగ్గరకు వచ్చి ప్రేమించానని చెప్పకుండా చూసుకుంటూ ఉంటుంది. ఆమె అలాంటి బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆమె అక్క భ్రమరాంబను మున్నా అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి ఉంటాడు. అందుకని ఆమెకు తల్లిదండ్రులు తొందరగా పెళ్ళి చేయడం వల్ల కష్టాలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె జీవితం లాగా తన జీవితం కూడా కాకూడదని ఆమె కోరిక.

బాలరాజు డిగ్రీ చదువుకోవడం కోసం పల్లెటూరు నుంచి హైదరాబాదులో ఉన్న అక్క వాళ్ళింటికి వస్తాడు. డిగ్రీ పూర్తి చేసి తన ఊరిలో సర్పంచి అవ్వాలని అతని కోరిక. సహజంగా పిరికిగా ఉన్న అతన్ని చూసి నీలిమ ధైర్యం చెబుతూ ఉంటుంది. అతనితో దగ్గరగా ఉన్నా ఎక్కువ చనువు ప్రదర్శించకుండా చూసుకుంటూ ఉంటుంది. నెమ్మదిగా అతనిమీద అభిమానం పెంచుకుంటుంది. ఈ లోపు రాజేష్ అనే వ్యక్తి వచ్చి తానే ఆమె ప్రేమించిన రాజేష్ అని చెబుతాడు. నీలిమకు అతన్ని ఎలా తిరస్కరించాలో తెలియదు. అతను ఎవరు, తన దగ్గరకు ఎందుకు వచ్చాడు? చివరికి బాలరాజు, నీలిమ ఎలా ఒక్కటయ్యారన్నది మిగతా కథ.

తారాగణం[మార్చు]

ఉదయ్ కిరణ్

మూలాలు[మార్చు]

  1. జీవి. "గుండె ఝల్లుమంది సినిమా సమీక్ష". idlebrain.com. Archived from the original on 19 అక్టోబరు 2016. Retrieved 14 October 2016.