ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ధర్మవరపు సుబ్రహ్మణ్యం | |
|---|---|
| జననం | 1954 సెప్టెంబరు 20 |
| మరణం | 2013 డిసెంబరు 7 (వయసు: 59) హైదరాబాదు |
| వృత్తి | నటుడు, వ్యాఖ్యాత, దర్శకుడు |
| భాగస్వామి | కృష్ణజ |
| పిల్లలు | సందీప్, రవిబ్రహ్మతేజ |
ధర్మవరపు సుబ్రహ్మణ్యం (1954 సెప్టెంబరు 20 - 2013 డిసెంబరు 7) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం. వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు.[1] దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర వేశాడు. తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగాడు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో మరణించాడు.
బాల్యం
[మార్చు]ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబరు 20 న ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే నలుగురు పిల్లలను ఆయన తల్లే పెంచి పెద్ద చేసింది. ఉన్నత పాఠశాల విద్య అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలోనూ చదివాడు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్యమండలితో పరిచయం ఏర్పడింది. నాటకాల మీదే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో ఉత్తీర్ణుడవలేదు. అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు.
తరువాత బీకాంలో చేరినా ఆయన మనసు సినిమాల వైపే ఉండేది. ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ సొంత ఊరుకు తిరిగి వచ్చాడు.
ఉద్యోగం
[మార్చు]మద్రాసు నుండి తిరిగి వచ్చి కొన్నాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉండగా కొందరు మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాడు. అందులో ఉత్తీర్ణుడవడంతో హైదరాబాద్ లోని పంచాయితీ రాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్ళీ నాటకాల వైపు మళ్ళింది. తరువాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశాడు. తరువాత దూరదర్శన్ లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభను ప్రారంభించారు. ఆ తరువాత మనసు గుర్రం లేదు కళ్ళెం, పరమానందయ్య శిష్యుల కథ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆనందో బ్రహ్మతో ఆయన తెలుగువారందరికీ చిరపరిచితుడయ్యాడు.
సినిమాలు
[మార్చు]దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు.
నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించ పరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యాడు.[2] ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా ప్రేమాగీమా జాంతానై విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరైనాడు.
రాజకీయ జీవితం
[మార్చు]1989 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సాంస్కృతిక మండలి అధ్యక్షడిగా పనిచేశాడు.
కుటుంబం
[మార్చు]ఆయనకు భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ ఉన్నారు. దిల్‌షుక్ నగర్ లోని శారదానగర్ లో ఆయన 1979 నుండి స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నటుడిగా
[మార్చు]తెలుగు సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 1989 | బావా బావా పన్నీరు | ||
| జయమ్ము నిశ్చయమ్మురా | |||
| 1990 | ఇరుగిల్లు పోరుగిల్లు | ||
| ప్రేమా జిందాబాద్ | |||
| 1991 | స్తువర్త్‌పురం దొంగలు | ||
| జీవన చాదరంగం | |||
| తోకలేని పిట్ట | |||
| ప్రార్థన | |||
| విచిత్ర ప్రేమ | |||
| తారక ప్రభుని దీక్ష మహిమలు | |||
| ఇంద్ర భవనం | |||
| పెళ్ళి పుస్తకం | |||
| 1992 | బాబాయ్ హోటల్ | ||
| స్వాతికిరణం | |||
| 1993 | ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం | ||
| కాలచక్రం | |||
| వన్ బై టూ | |||
| అన్నా చెల్లెలు | |||
| జీవితమే ఒక సినిమా | |||
| మిస్టర్ పెళ్ళాం | |||
| మాతృ దేవో భవ | |||
| కొంగుచాటు కృష్ణుడు | |||
| మహిళల ప్రత్యేకం | |||
| ఇష్ గప్ చుప్ | |||
| 1994 | పెళ్ళికొడుకు | ||
| అదృష్ట అవకాశం | |||
| పరుగు పరుగు | |||
| అంగారాక్షసుడు | |||
| నేరస్థుడు | |||
| నేరం | |||
| కిష్కింధ కాండ | |||
| బ్రహ్మచారి మొగుడు | |||
| 1995 | సిసింద్రి | ||
| చిన్నబ్బులు | |||
| సంకల్పం | |||
| నాయకుడు | |||
| ఘరానా బుల్లోడు | |||
| 1996 | కుతురు | ||
| హలో నీకూ నాకూ పెళ్ళంట | |||
| సాహసవీరుడు - సాగరకన్య | |||
| ఓహో నా పెళ్లంట | |||
| మళ్ళీ ఒకసారి | |||
| 1997 | కలియుగంలో గందర్‌గోలం | ||
| ప్రియమైన శ్రీవారు | |||
| సూపర్ హీరోలు | |||
| మాస్టర్ | |||
| 1998 | గమ్యం | ఫఖీరయ్య | |
| అల్లరి పెళ్ళాం | |||
| పడుత తీయగా | |||
| 1999 | విచిత్రం | అన్నవరం | |
| స్వయంవరం | డాక్టర్ ధైర్యం | ||
| 2000 | నువ్వే కావాలి | ||
| 2001 | నువ్వు నేను | ||
| ఫ్యామిలీ సర్కస్ | |||
| ఆనందం | |||
| ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం | |||
| డార్లింగ్ డార్లింగ్ | డాక్టర్ | ||
| 9 నెలలు | |||
| కుటుంబ సర్కస్ | |||
| 2002 | నీ స్నేహం | ||
| లగ్న పత్రిక | |||
| సీమ సింహం | |||
| సోంథం | సుబ్బు | ||
| ఒకటో నంబర్ కుర్రాడు | |||
| నువ్వే నువ్వే | |||
| తప్పు చేసి పప్పుకూడు | |||
| శ్రీరామ్ | |||
| ఇంద్ర | |||
| జయం | |||
| ఆడుతు పాడుతు | |||
| పిలిస్తే పలుకుత | |||
| ధనలక్ష్మి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. | |||
| మన్మధుడు | |||
| 2003 | ఒక్కడు | ||
| మూర్ఖులు | |||
| ఆడంతే అడో రకం | |||
| వీడే | |||
| పిలిస్తే పలుకుతా | |||
| ఠాగూర్ | |||
| పల్నాటి బ్రహ్మనాయుడు | |||
| గోవా | |||
| నేను పెళ్ళికి రెడీ | |||
| ధనుష్ | |||
| అమ్ములు | |||
| ఒకారికి ఒకారు | |||
| అమ్మాయిలు అబ్బాయిలు | |||
| అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | |||
| విజయం | |||
| సింహాద్రి | |||
| దొంగోడు | |||
| వసంతం | |||
| ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! | |||
| విష్ణు | |||
| అవున | |||
| 2004 | శ్వేత నాగు | ||
| నాని | |||
| యజ్ఞం | |||
| వర్షం | |||
| మాస్ | |||
| గురి | |||
| దొంగ దొంగడి | |||
| వర్షం | |||
| శ్రీ & శ్రీమతి శైలజా కృష్ణమూర్తి | |||
| లీలా మహల్ సెంటర్ | |||
| మల్లీశ్వరి | |||
| ఉదయం రాగం | |||
| వెంకీ | |||
| 143 | |||
| ద్రవ్యరాశి | |||
| నేనున్నాను | |||
| పుట్టింటికి రా చెల్లి | |||
| అమలాపురం నుండి 123 | |||
| 2005 | బాలు | ||
| ధన 51 | |||
| అల్లరి బుల్లోడు | |||
| నువ్వొస్తానంటే నేనొద్దంటానా | |||
| అవునన్నా కాదన్నా | |||
| అతనొక్కడు | |||
| అందరివాడు | |||
| ఆంధ్రుడు | |||
| మంచి అబ్బాయి | |||
| ఆంధ్రుడు | |||
| వీరి వీరి గుమ్మడి పండు | |||
| జై చిరంజీవ | |||
| గౌతమ్ SSC | |||
| 2006 | స్టైల్ | ||
| శ్రీ రామదాసు | |||
| బంగారం | |||
| ఏవండోయ్ శ్రీవారు | |||
| బొమ్మరిల్లు | |||
| అందాల రాముడు | |||
| వీరభద్రుడు | |||
| మాయాబజార్ | |||
| ఖతర్నాక్ | |||
| అన్నవరం | |||
| 2007 | పాగలే వెన్నెల | ||
| ఆపరేషన్ దుర్యోధన | |||
| శంకర్ దాదా జిందాబాద్ | |||
| ఆదివారం ఆడవాళ్లకు సెలవు | |||
| అత్తిలి సత్తిబాబు | |||
| దుబాయ్ శీను | |||
| లక్ష్యం | |||
| చిరుత | |||
| 2008 | బ్లేడ్ బాబ్జీ | ||
| జల్సా | |||
| పాండురంగడు | |||
| సోంబేరి | |||
| అధ్యక్షా | |||
| రెయిన్‌బో | |||
| రెడీ | |||
| బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ | |||
| భలే దొంగలు | |||
| ఉల్లాసంగ ఉత్సహంగ | |||
| ఆదివిష్ణువు | |||
| మిస్టర్ మేధావి | |||
| సికాకుళం నుండి సిద్ధూ | |||
| కేక | |||
| రాజు | |||
| 2009 | కిక్ | ||
| పిస్థ | |||
| రైడ్ | |||
| ఆ ఒక్కడు | |||
| బెండు అప్పారావు RMP | |||
| బంగారు బాబు | |||
| 2010 | నమో వేంకటేశా | ||
| డార్లింగ్ | |||
| మహేష్ ఖలేజా | |||
| నాగవల్లి | |||
| ఆలస్యం అమృతం | |||
| కలెక్టర్ గారి భార్య | |||
| కత్తి కాంత రావు | |||
| సింహ | |||
| 2011 | 100% ప్రేమ | ||
| ఆకాశమే హద్దు | |||
| దూకుడు | |||
| మడత కాజా | |||
| 2012 | రచా | ||
| వ్యాపారవేత్త | |||
| బాడీగార్డ్ | |||
| తునీగా తునీగా | |||
| సుడిగాడు | |||
| నిప్పు | |||
| దరువు | |||
| కెమెరామెన్ గంగతో రాంబాబు | |||
| జులాయి | |||
| 2013 | షాడో | ||
| గ్రీకు వీరుడు | |||
| జబర్దస్త్ | |||
| చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి | |||
| హమ్ తుమ్ | |||
| 2014 | అమృతం చందమామలో | మరణానంతరం విడుదల | |
| దిల్లున్నోడు | |||
| 2015 | రుద్రమదేవి |
తమిళ సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 2004 | కొత్తది | ||
| 2005 | మన్నిన్ మైంధాన్ | ||
| 2006 | చెన్నై కాదల్ |
ఇతర భాషా చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 1995 | నేరస్థుడు | హిందీ | |
| 2004 | ప్రేమ | కన్నడ |
టెలివిజన్
[మార్చు]- పానకాలరావుగా పోపుల పెట్టె (1997).
దర్శకుడిగా
[మార్చు]- తొకలేని పిట్ట (1997)
మరణం
[మార్చు]ఆరు నెలల పాటు కాలేయ కేన్సర్‌తో బాధపడి ధర్మవరపు సుబ్రహ్మణ్యం, 2013 డిసెంబరు 7 శనివారం రాత్రి 10.30 గంటలకు చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.[3]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-11. Retrieved 2013-12-07.
- ↑ ఈనాడు వార్త, డిసెంబరు 8, 2013
- ↑ http://www.sakshi.com/news/andhra-pradesh/film-actor-dharmavarapu-subramanyam-passed-away-86609?pfrom=home-top-story
