పెళ్ళికొడుకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళికొడుకు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం శ్రీ రమణ
రచన ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం నరేష్,
దివ్యవాణి,
ఏ,వి,యస్,
సంగీత,
కోట శ్రీనివాసరావు,
బ్రహ్మానందం,
బాబూమోహన్,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
రాళ్ళపల్లి
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నేపథ్య గానం యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శైలజ, ఎం. ఎం. కీరవాణి
నృత్యాలు శ్రీనివాస్
గీతరచన ఆరుద్ర, సి.నారాయణరెడ్డి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు
కళ బాస్కర్ రాజు
కూర్పు కె.ఎన్.రాజు
నిర్మాణ సంస్థ శ్రీ సీతారామ ఫిల్మ్స్
దేశం భారతదేశము
భాష తెలుగు

ఈ చిత్రము పాతరోజులలో చంద్రమోహన్ నాయకునిగా, బాపునే దర్శకునిగా వచ్చిన బంగారు పిచ్చుక సినిమకు నకలు.

రాణీ రాజరాజేశ్వరీదేవి (సంగీత) పెద్ద కోటీశ్వరురాలు, ఆమెభర్త సన్యాసిరాజు (ఏ.వీ.యస్) ఆమె చెప్పుచేతల్లో కాగితం పులిలా మారిపోతాడు. వారి ఒక్కగానొక్క కొడుకు వరహాలరాజు (నరేష్). ఆ సంస్థానానికి యువరాజు అయిన వరహాలరాజు కూడా తల్లి అదుపాజ్ఞలలోనే పెరుగుతాడు. సన్యాసి రాజు తనకొడుకు జీవితం తనకులా మారకూడదని సొంతకాళ్ళపై నిలబడి, నీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉండమని ఇంటినుండి భార్యకు తెలియకుండా పంపించేస్తాడు.

రాజరాజేశ్వరీదేవి వద్ద మేనేజరుగా పనిచేసే రామోజీ (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) ఒక ముఠా నాయకుడు. ధనవంతుల పిల్లలతో ప్రేమ, పెళ్ళి వ్యవహారాలు నడిపించి డబ్బు సంపాదించేందుకు అందమైన అమ్మాయికు,అబ్బాయిలకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటాడు. వరహాలరాజును వలలో వెసుకొనేందుకు కూడా వాణి (దివ్యవాణి) అనే అమ్మాయిని పంపిస్తాడు. వరహాలరాజుకు ఆమె పరిచయం అయ్యేలా ఏర్పాట్లు చేసి నాటకం నడిపిస్తుంటాడు. వరహాలరాజుతో వాణి తనకు బలవంతపు పెళ్ళి చేయబోతే పారిపోయివచ్చినట్టుగా చెప్పి అతనితో కలసి వెళ్తుంది.

వరహలరాజు కోసం రాజేశ్వరీదేవి పని వాళ్లతో వెతికిస్తుంటుంది. సన్యాసిరాజు కూడా వెతికే నెపంతో వచ్చి కొడుకును వెనుకగా అనుసరిస్తుంటాడు. వాణి వరహాలరాజుతో ప్రేమ నటిస్తూ అతని మంచితనం, అమాయకత్వం చూసి నిజంగానే ప్రేమిస్తుంది. వరహాలరాజూ అమెను ప్రేమిస్తాడు. వరహాలరాజును అనుసరిస్తున్న సన్యాసిరాజు ఇది గమనించి ఒక సంధర్భంలో చిన్ననాటకమాడి తన కొడుకుని నిజంగా ప్రేమిస్తుందా! లేదా! అని వాణిని పరిక్షీస్తాడు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ చేరుకొనే సమయంలో రామోజీ వాణీని హెచ్చరిస్తాడు, త్వరగా పెళ్ళి చేసుకోమని. ఆమె వరహాలరాజుని మోసం చేయలేనని పెళ్ళికి వప్పుకోనని చెపుతుంది. అలాగయితే తన దగ్గర బందీగా ఉన్న అమె తమ్ముని చంపేస్తానని బెదిరిస్తాడు.

తరువాత రామోజీ మారుపేరుతో రాజేశ్వరీదేవికి ఫోన్ చేసి వరహాలరాజు పెళ్ళి చేసుకోబోతున్నాడనే విషయం చెప్పి, పెళ్ళి తప్పించి నీకొడుకుని నీకప్పగించాలంటే పది లక్షలు కావాలని చెపుతాడు. ఇస్తానని వప్పుకొంటుంది రాజేశ్వరీదేవి. నీ పని పూర్తి అయింది, వరహాలరాజుని వది వచ్చేయమని చెపుతాడు వాణితో రామోజీ. వాణి తను ప్రేమించినట్టు నాటకమాడాననీ తను మోసగత్తెనని వరహాలరాజుకు చెప్పి వెళిపోతుంది.

అతడిని ఇంటికి తీసుకొచ్చి ఒక గొప్ప సంబంధం చూసి పెళ్ళి చేయాలనుకొంటుంది. ఒక అమ్మాయి విషయంలో మోసపోయిన వరహాలరాజు పెళ్ళికి వప్పుకొంటాడు.

వాణి వరహాలరాజుని వదిలి వెళ్ళిన తరువాత, ఇందులో ఏదో తిరకాసు ఉందని అనుమానించిన సన్యాసిరాజు వాణిని అనుసరిస్తాడు తన పనివారితో. ఆమె రామోజీ ఇంటికి వెళ్ళడం, అతడితో వాదించడం అన్నీ వింటారు. రాజేశ్వరీదేవి నుండి డబ్బుతీసుకొన్నడని తెలిసిన వాణి ఆ డబ్బు వెనుకకు ఇచ్చేయమని చెపుతుంది. ఇవ్వనని అన్న అతడి నుండి డబ్బు లాక్కుని పరిగెడుతూ దారిలో కనిపించిన సన్యాసిరాజుకు విషయం చెప్పి డబ్బు అందజేస్తుంది. ఆమె వెనుకగా తరుముతూ వచ్చిన రామోజె ఆమె తలపై కర్రతో గట్టిగా కొడతాడు. సన్యాసిరాజు, అతని పనివారు రామోజీని, అతడి అనుచరులను తన్ని పోలీసులకు అప్పచెపుతారు. డబ్బుతీసుకు వచ్చిన సన్యాసిరాజు కొడుకుకు వాణి మోసగత్తె కాదు అని అసలు విషయం చెప్పి వెంట తీసుకొని హాస్పిటలుకు వెళతాడు. విషయం పనివారి ద్వారా తెలిసిన రాజేశ్వరీదేవి కూడా అక్కడికి వచ్చి ఇద్దరి పెళ్ళికి సమ్మతించి వాణితో తన కొడుకు పెళ్ళి చేస్తుంది.

సినిమాలో కొన్ని సన్నివేశాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]