సంగీత (నటి)
స్వరూపం
| సంగీత(Sangeetha) | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
|---|---|---|---|
| జీవిత భాగస్వామి | సుందర్‌రాజన్ | ||
| నివాసం | హైదరాబాద్[1] | ||
సంగీత తెలుగు సినిమా నటీమణి. వరంగల్[2] వాసి అయిన సంగీత ఈమె 1975లో తీర్పు, ముత్యాల ముగ్గు సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈమె అసలు పేరు లత కాగా నిర్మాత యు.విశ్వేశ్వర రావు ఈమె పేరును 'సంగీత'గా మార్చాడు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో 500కు పైగా చిత్రాలలో నటించింది.[3] వాటిలో తాయారమ్మ బంగారయ్య, చిలకమ్మ చెప్పింది, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 2008లో సినిమా నిర్మాణరంగంలో ప్రవేశించి భాగస్వామిగా తన మేనల్లుడు పి.సునీల్‌తో పసుపులేటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ వయసులో మొదలైన చిత్రాలను నిర్మించింది[4].
నటించిన సినిమాలు
[మార్చు]- తీర్పు (1975)
- ముత్యాల ముగ్గు (1975)
- అందరూ బాగుండాలి (1976)
- పెద్దన్నయ్య(1976)
- చిలకమ్మ చెప్పింది (1977)
- మనుషులు చేసిన దొంగలు (1977)
- శ్రీరామ పట్టాభిషేకం (1978)
- మనిషిలో మనిషి (1978)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
- నకిలీ మనిషి (1980)
- బంగారులక్ష్మి (1980)
- భలే కృష్ణుడు (1980)
- సన్నాయి అప్పన్న (1980)
- ప్రేమ నాటకం (1981)
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
- పెళ్లీడు పిల్లలు (1982)
- ఖైదీ (1983)
- మహానగరంలో మాయగాడు (1984)
- శ్రీవారికి ప్రేమలేఖ (1984)
- జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
- మా ఇంటి కృష్ణుడు (1990)
- ఆమె (1994)
- ఘరానా అల్లుడు (1994)
- పెళ్ళికొడుకు (1994)
- భైరవ ద్వీపం (1994)
- శుభమస్తు (1995)
- కోనసీమ మొనగాడు (1996)
- సోగ్గాడి పెళ్ళాం(1996)
- గోకులంలో సీత (1997)
- తొలిప్రేమ (1998)
- రత్నగిరి అమ్మోరు (1999)
- బద్రి (2000)
- అడవిచుక్క (2000)
- చిన్నా (2001)
- ప్రేమసందడి (2001)
- నువ్వు నేను (2001)
- స్నేహమంటే ఇదేరా (2001)
- నీ స్నేహం (2002)
- అనగనగా ఓ కుర్రాడు (2003)
- శివమణి (2003)
- అయిందా లేదా (2005)
- అవునన్నా కాదన్నా (2005)
- నువ్వంటే నాకిష్టం (2005)
- సీతాకోకచిలుక (2006)
- అతడెవరు (2007)
- సుందరకాండ (2008)
- ఏక్ నిరంజన్ (2009)
- సేవకుడు (2013)
- తోలుబొమ్మలాట (2019)
- ప్రెషర్ కుక్కర్ (2020)
మూలాలు
[మార్చు]- ↑ "Yesteryear actress Sangeeta moves to Hyderabad | Yesteryear actress Sangeeta moves to Hyderabad" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 29 September 2016. Retrieved 8 December 2025.
- ↑ నేటిఏపి.కాం. "టిఆర్ఎస్ లో చేరనున్న అలనాటి హీరోయిన్.. ఎవరో తెలుసా ..?". www.netiap.com. Archived from the original on 25 సెప్టెంబరు 2016. Retrieved 24 September 2016.
- ↑ సంగీత (1 December 2014). "ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతగా నటించా". సాక్షి దినపత్రిక. Retrieved 18 January 2016.
- ↑ web master. "Sangeethas new role!". indiaglitz. indiaglitz. Archived from the original on 21 జనవరి 2025. Retrieved 18 January 2016.