ప్రెషర్ కుక్కర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రెషర్ కుక్కర్
Pressure Cooker Movie Poster.jpg
ప్రెషర్ కుక్కర్ సినిమా పోస్టర్
దర్శకత్వంసుజోయ్ కారంపూరి
సుశీల్ కారంపూరి
కథా రచయితసుజోయ్ కారంపూరి
సుశీల్ కారంపూరి
దృశ్య రచయితసుజోయ్ కారంపూరి
సుశీల్ కారంపూరి
నిర్మాతసుజోయ్ కారంపూరి
సుశీల్ కారంపూరి
అప్పిరెడ్డి
తారాగణంసాయి రొనాక్
ప్రీతి అస్రాని
ఛాయాగ్రహణంనగేష్ బానెల్ – అనిత్ మాదాడి
ఎడిటర్నరేష్ రెడ్డి జొన్న
సంగీతంసునీల్ కశ్యప్
రాహుల్ సిప్లిగంజ్
స్మరణ్
హర్షవర్ధన్ రామేశ్వర్
ప్రొడక్షన్
కంపెనీలు
కారంపూరి క్రియేషన్స్
మైక్ మూవీస్
డిస్ట్రిబ్యూటర్అభిషేక్ పిక్చర్స్
విడుదల తేదీ
2020 ఫిబ్రవరి 21 (2020-02-21)
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రెషర్ కుక్కర్[1] (ట్యాగ్ లైన్: ప్రతి ఇంట్ల ఇదే లోల్లి) 2020, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం.[2] సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి రొనాక్,[3] ప్రీతి అస్రాని[4] జంటగా నటించగా... సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

కథా నేపథ్యం[మార్చు]

సిద్దిపేటకు చెందిన నారాయణ (సీవీఎల్‌ నరసింహారావు) బంధువులు అందరూ అమెరికాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. దీంతో తన కొడుకు కిశోర్‌ (సాయి రోనక్‌)ను కూడా అమెరికాను పంపించాలని ఆరాటపడతాడు. అందుకు అనుగుణంగా కిశోర్‌కు చిన్నప్పట్నుంచే అమెరికా గొప్పతనాలను వివరిస్తూ పెంచుతాడు. అలా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కిశోర్‌ అమెరికా కోసం వీసా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు బయల్దేరతాడు. ఈ క్రమంలోనే స్వతంత్ర భావాలు కలిగిన అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది.

ఇక వీసా ప్రయత్నాల్లో భాగంగా కిశోర్‌కు చందు (రాహుల్‌ రామకృష్ణ) సహాయం చేస్తుంటాడు. అయితే వరుసగా మూడు నాలుగు ప్రయత్నాల్లో వీసా రిజెక్ట్‌ కావడంతో వివిధ ప్రయత్నాలు చేస్తుంటాడు కిశోర్‌. ఈ సందర్భంలోనే అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. అయితే ఆ ఆపద నుంచి రావు (తనికెళ్ల భరణి) రక్షిస్తాడు. ఇంతకి రావుకు, కిశోర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కిశోర్‌ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? కిశోర్‌, అనితల ప్రేమ చివరికి ఏమైంది? ఈ సినిమాతో దర్శకులు ఏం చెప్ప దల్చుకున్నారో తెలుసుకోవాలంటే ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమా చూడాల్సిందే.

కిషోర్‌ (సాయిరోనక్‌) ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తాడు. కొడుకును అమెరికా పంపించాలన్నది అతడి తండ్రి నారాయణ (నరసింహారావు) కల. చిన్ననాటి నుంచి అమెరికా కలలతోనే కొడుకు పెంచుతాడు. తండ్రి సంతోషం కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు కిషోర్‌. కానీ అమెరికా వీసా మాత్రం అతడికి రాదు. తల్లిదండ్రులతో పాటు ఊళ్లోని జనాల సూటిపోటి మాటలతో విసుగు చెందిన కిరణ్‌ వీసా వచ్చేవరకు హైదరాబాద్‌లోని స్నేహితులు (రాహుల్‌రామకృష్ణ, రజయ్‌) దగ్గర ఉండాలని నిర్ణయించుకుంటాడు. హైదరాబాద్‌లో అనిత (ప్రీతి అస్రాని) ఆనందరావు (తనికెళ్లభరణి)ల పరిచయం కిషోర్‌ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? అమెరికా వెళ్లాలనే కిషోర్‌ కల నెరవేరిందా? అసలైన ఆనందం డాలర్లలో ఉండదనే సత్యాన్ని కిషోర్‌ ఎలా తెలుసుకున్నాడు?అనిత ప్రేమను సొంతం చేసుకున్నాడా?లేదా అన్నదే ఈ చిత్ర కథాంశం.[5][6]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజోయ్ కారంపూరి, సుశీల్ కారంపూరి
 • నిర్మాత: సుజోయ్ కారంపూరి, సుశీల్ కారంపూరి, అప్పిరెడ్డి
 • సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్, హర్షవర్ధన్ రామేశ్వర్
 • ఛాయాగ్రహణం: నగేష్ బానెల్, అనిత్ మాదాడి
 • కూర్పు: నరేష్ రెడ్డి జొన్న
 • నిర్మాణ సంస్థ: కారంపూరి క్రియేషన్స్,మైక్ మూవీస్
 • పంపిణీదారు: అభిషేక్ పిక్చర్స్

పాటలు[మార్చు]

Untitled

ఈ సినిమాకు సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. అదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "గమనించండి (రచన: అనంత శ్రీరాం)"  సింధు 3:17
2. "రా రా కొడక (రచన: సత్య)"  అనురాగ్ కులకర్ణి 4:58
3. "నీ హృదయం (రచన: శ్రేష్ఠ)"  అదితి భావరాజు 4:46
4. "చెలి చెలి (రచన: సిరాశ్రీ)"  కైలాష్ ఖేర్ 3:06
5. "ఒగ్గుకథ (రచన: ఒగ్గు ఎల్లయ్య, ఒగ్గు శివయ్య)"  ఒగ్గు ఎల్లయ్య, ఒగ్గు శివయ్య 2:01
6. "ఓరివారి (రచన: నిఖిలేష్ సుంకోజి)"  సురేష్ బొబ్బిలి 2:58
7. "నువ్వు బగ్గ పండుకుంటే (రచన: రాహుల్ సిప్లిగంజ్)"  రాహుల్ సిప్లిగంజ్ 3:03
8. "అమెరికా పోయి నువ్వైతావ్రా లంగ (రచన: రాహుల్ సిప్లిగంజ్)"  రాహుల్ సిప్లిగంజ్ 3:51
మొత్తం నిడివి:
28:00

మూలాలు[మార్చు]

 1. Pecheti, AuthorPrakash. "'Pressure Cooker' an honest story of our generation". Telangana Today. Retrieved 2 March 2020.
 2. "Pressure Cooker has a release date". The Times of India. 24 January 2020. Retrieved 2 March 2020.
 3. Chowdhary, Y. Sunita (18 February 2020). "Dancer Sai Ronak makes his debut with Telugu film 'Pressure Cooker'". Retrieved 2 March 2020 – via www.thehindu.com.
 4. Chowdhary, Y. Sunita (18 February 2020). "Preethi Asrani to debut in Telugu cinema with 'Pressure Cooker'". Retrieved 2 March 2020 – via www.thehindu.com.
 5. నమస్తే తెలంగాణ, సినిమా (21 February 2020). "'ప్రెషర్‌ కుక్కర్‌' రివ్యూ." Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 2 March 2020.
 6. సాక్షి, సినిమా (21 February 2020). "'ప్రెజర్‌ కుక్కర్‌' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 2 మార్చి 2020. Retrieved 2 March 2020.
 7. ప్రజాశక్తి, మూవీ (14 February 2020). "గమ్మత్తుగా అనిపించింది". www.prajasakti.com. Retrieved 26 April 2020.
 8. సాక్షి, సినిమా (15 February 2020). "నాకు ఆ అవకాశం ఇవ్వలేదు". Sakshi. Archived from the original on 26 ఏప్రిల్ 2020. Retrieved 26 April 2020.

ఇతర లంకెలు[మార్చు]