లోహిత్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోహిత్ కుమార్
లోహిత్ కుమార్
జననం
లోహిత్ కుమార్ ఆకవరం

మార్చి 31
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు, వ్యాఖ్యాత, మిమిక్రి కళాకారుడు, సామాజిక కార్యకర్త
తల్లిదండ్రులు
  • సోమశేఖర్ రెడ్డి (తండ్రి)
  • ఉమాదేవి (తల్లి)

లోహిత్ కుమార్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నటుడు, వ్యాఖ్యాత, మిమిక్రి కళాకారుడు, సామాజిక కార్యకర్త. ప్రధాన పాత్రలతో, క్యారెక్టర్ రోల్స్ తో అనేక టివి సీరియల్స్, సినిమాలలో నటించాడు. "ఫాస్టెస్ట్ మిమిక్రీ" విభాగంలో 1994 మార్చి 15న కేవలం 15 నిముషాల్లో 150 శబ్దాలను సృష్టించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

లోహిత్ మార్చి 31న ఆకవరం సోమశేఖర్ రెడ్డి - ఉమాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, హన్మకొండలో జన్మించాడు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో బిఏ పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కొంతకాలం ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్‌లో పనిచేశాడు. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తిస్థాయిగా కళారంగంలోకి వచ్చాడు.

మిమిక్రీరంగం

[మార్చు]

ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ నుండి స్ఫూర్తిని పొందిన లోహిత్, 1982లో తన 13 సంవత్సరాల వయస్సు నుండే వేదికపై మిమిక్రీ చేయడం ప్రారంభించాడు. 1000కంటే ఎక్కువ విభిన్న స్వరాలను అనుకరించగల లోహిత్ మిమిక్రీలో అనేక అవార్డులను పొందడంతోపాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లలోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా, షార్జా, దుబాయ్ మొదలైన వివిధ ప్రదేశాలలో అనేక ప్రదర్శనలు చేసాడు.[4]

టివీరంగం

[మార్చు]

లోహిత్ వ్యాఖ్యాతగా టివిరంగంలోకి ప్రవేశించాడు. ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్, యూత్ ఫెస్టివల్స్ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బి.వి. పట్టాభిరామ్ ద్వారా ప్రముఖ దర్శకుడు బాపుకి పరిచయమయ్యాడు. బుడుగు (టివి సీరియల్) లో హీరోగా తొలిసారిగా నటించాడు. దాదాపుగా అన్ని ప్రముఖ ఛానళ్ళలో ప్రసారమైన 20కిపైగా సీరియళ్ళలో, కామెడీ, ఇతర కార్యక్రమాలలో నటించాడు.[5] థడాకా కామెడీ షో, రెడీ, థడకా, భలే ఛాన్స్ లే, కో అంటే కోటి మొదలైన కార్యకమాలలో పాల్గొన్నాడు.

  • ఈటివి: బుడుగు (1999), ఫన్నీస్ (2000), ఇది పెళ్ళంటారా, ఆత్మయాత్ర (2002), ప్రియాంక (2003), నాతిచరామి (2004), మనసు చూడతరమా (2007), ఆకాశ గంగ (2010), కుంకుమరేఖ (2011), పుత్తడిబొమ్మ (2012), మేఘమాల (2014), తఢాకా (2016), తేనెమనసులు (2018), నా పేరు మీనాక్షి (2018), ఆడవాళ్లు మీకు జోహార్లు (2019)
  • స్టార్ మా: లోగిలి (2008), తాళికట్టు శుభవేళ (2013), ప్రేమించుకుందాం రా, నీవల్లే నీవల్లే (2020), రాఖీపూర్ణిమ (2022)
  • జెమిని టివి: సుబాష్ బేబీ (1996), కుషీ (2002), పెద్దరికం (2003), రుద్రవీణ (2005), బొమ్మరిల్లు (2007), గోరింటాకు (2009), హంసగీతం (2022), ఉప్పెన (2022), ఫ్రెండ్స్
  • జీ తెలుగు: కిటికి (2009), కళ్యాణ తిలకం (2010), ఎగిరే పావురమా (2011), రాధా కల్యాణం (2013), ముత్యాలముగ్గు (2016)

సినిమారంగం

[మార్చు]

ఆశలపల్లకీ (2004), ఎవడిగోల వాడిది (2005), స్టైల్ (2006), యమదొంగ (2007), చేజ్ (2012), స్నేహగీతం (2012), యముడికి మొగుడు (2012), తెలుగబ్బాయి (2013), కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015), అగ్నిసాక్షిగా (2015), లేడీస్ అండ్ జెంటిల్మెన్ (2015), వియ్యాలవారి కయ్యాలు (2013), ఎగిసే తారాజువ్వలు (2017), పోటుగాడు (2017), మిస్టర్ ఎక్స్ (2017), ప్రెజర్ కుక్కర్ (2018), శుభలేఖలు (2018), దేశంలో దొంగలు పడ్డారు (2018), మనసంతా (2018), స్వయంవధ (2018), ఏజీఎఫ్ (2018), మహర్షి (2019), అక్షరం (2019), కొత్తగ రెక్కలొచ్చేనా, మనసకు నచ్చింది (2018), లైఫ్ ఆఫ్ 3, 14 క్రైమ్ (2021), కర్త కర్మ క్రియ, యద్భావం తద్భవతి (2022), గాడ్సే (2022), కేసీఆర్ (2024) వంటి దాదాపు 60 సినిమాలలో నటించాడు. నిర్మాతగా 5 సినిమాలు నిర్మించాడు.

నిర్వర్తించిన పదవులు

[మార్చు]
  • ఉపాధ్యక్షుడు, ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్
  • ఉపాధ్యక్షుడు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్
  • ఉపాధ్యక్షుడు, హైదరాబాద్ - తల్వార్లు
  • సలహాదారు, మిమిక్రి కళాకారుల సంక్షేమ సంఘం
  • సభ్యుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
  • సభ్యుడు, తెలుగు నిర్మాతల మండలి
  • సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి

మూలాలు

[మార్చు]
  1. ఒక్క గొంతులో వేయి ధ్వనులు, వార్త హైదరాబాదు మెయిన్, 2002 జూన్ 9, పేజీ 4, టి. దేవాంతసూరి.
  2. కళకు భాష అతీతం, ఈనాడు వరంగల్, 2005 డిసెంబరు 1.
  3. Team, CelPox (2021-02-19). "Lohith Kumar: Biography". CelPox (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-22. Retrieved 2022-07-22.
  4. "Tollywood Movie Actor Lohith Kumar Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-24. Retrieved 2022-07-22.
  5. నాది నాలుగు పడవల ప్రయాణం, ఇంటితెర, ఆంధ్రభూమి, 2007 నవంబరు 20, ఎం.డి. అబ్దుల్.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లోహిత్ కుమార్ పేజీ