శుభలేఖ+లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభలేఖ+లు
దర్శకత్వంశరత్‌ నర్వాడే
నిర్మాతవిద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌
తారాగణంశ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని , దిక్ష శర్మ, తిరువీర్
ఛాయాగ్రహణంఎస్.మురళి మోహన్ రెడ్డి
కూర్పుమధు
సంగీతంకె. ఎం. రాధాకృష్ణన్
నిర్మాణ
సంస్థ
హ‌నుమ తెలుగు మూవీస్
విడుదల తేదీ
7 డిసెంబర్ 2018
దేశం భారతదేశం
భాషతెలుగు

శుభలేఖ+లు 2018లో విడుదలైన తెలుగు సినిమా.[1] హ‌నుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ నిర్మించిన ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకత్వం వహించాడు. శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 డిసెంబర్ 2018న విడుదలైంది.[2]

కథ[మార్చు]

చందు (సాయి శ్రీనివాస్ ) తన మరదలైన శిరీష్ ( దీక్షా శర్మ ) ని ప్రేమిస్తుంటాడు . చందు తన టాలెంట్ ని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఇంట్లో వాళ్ళకేమో వీడు పని పాట లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని అనిపిస్తుంటుంది . తన సవతి తల్లి కూతురైన నిత్యా ( ప్రియా వడ్లమాని ) కు మోహన్ అనే ఎన్నారైతో పెళ్లి కుదురుతుంది . దాంతో చెల్లి పెళ్లిని బాగా చేయాలనీ అనుకుంటాడు చందు కానీ నిత్యా మరొకరిని ప్రేమిస్తోందని ,అతడితో లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిసుకొని షాక్ అవుతాడు చందు. చెల్లి లేచిపోయి పెళ్లి చేసుకుంటే అది కుటుంబ పరువుకు సంబందించిన సమస్య కాబట్టి చందు ఆమెతో ఆ ప్రయత్నం విరమించుకున్నేలా ఏమి చేశాడు ? చందు, శిరీషల ప్రేమ ఫలించిందా? అనేదే మిగత సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హ‌నుమ తెలుగు మూవీస్
  • నిర్మాతలు: విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శరత్‌ నర్వాడే
  • సంగీతం: కె. ఎం. రాధాకృష్ణన్
  • సినిమాటోగ్రఫీ:ఎస్.మురళి మోహన్ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. The Hans India (25 September 2018). "Subhalekha + Lu, a saga of two love stories" (in ఇంగ్లీష్). Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. The Times of India (7 December 2018). "Subhalekha+lu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.