తిరువీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువీర్
Thiruveer1.jpg
జననంతిరువీర్
జూలై 23
మామిడిపల్లి, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తినటుడు
ఎత్తు6 అడుగుల 1 అంగుళం
తల్లిదండ్రులుపి. వెంకట్ రెడ్డి, వీరమ్మ

తిరువీర్ (జననం. జూలై 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు మరియు చలనచిత్ర నటుడు.

జననం[మార్చు]

తిరువీర్ 1988, జూలై 23న వెంకట్ రెడ్డి, వీరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఎ. పూర్తిచేశాడు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

నటించినవి[మార్చు]

టాక్స్ ఫ్రీ, జూ స్టొరీ, లా ఒక్కింతయు లేదు, కిషోర్ శాంతభాయ్ కాలే, న్యూ భారత్ కేఫ్, బర్బరీకుడు[1], ఎకనామిక్ హిట్ మాన్, ఆంటిగని, కాయితం పులి[2], కళ్యాణి, వర్ణ నిర్మూలన సిద్ధాతం, దావత్ మొదలైనవి

దర్శకత్వం చేసినవి[మార్చు]

అమ్మ చెప్పిన కథ[3], నా వల్ల కాదు, దావత్[4][5], ఏ మాన్ విత్ ఏ లంప్[6], పుష్పలత నవ్వింది[7] మొదలైనవి.

నాటకోత్సవాలు - శిక్షణ శిబిరాలు[మార్చు]

 1. దక్షిణ కొరియాలో 23 రోజులపాటు జరిగిన నాటక ఏసియన్ రెసిడెన్సి ప్రాజెక్టు (2014, జూన్ 29 నుండి జూలై 21 వరకు) లో పాల్గొని నాటక ప్రదర్శనలో మెలకువలు తెలసుకొని... నాలుగు దేశాల (బంగ్లాదేశ్, జపాన్, ద. కొరియా, భారతదేశం) నాటకరంగ కళాకారులతో కలిసి నాటికను ప్రదర్శించాడు.
 2. 2014, ఫిబ్రవరి 17-23 వరకు న్యూఢిల్లీలో జరిగిన టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవంలో పాల్గొని దాదాపు 20 దేశాల నాటకరంగ కళాకారులతో కలిసి శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు.
 3. గౌహతి, తిరువనంతపురం, పాలక్కాడు, పాట్నా మొదలైన ప్రాంతాలలో జరిగిన చిన్నారుల నాటకోత్సవాలలో పాల్గొన్నాడు.

పాప్‌కార్న్ థియేటర్ స్థాపన[మార్చు]

తిరువీర్, తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది మిత్రులతో కలిసి 2014, మార్చి 20న హైదరాబాద్ అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్లో అమ్మ చెప్పిన కథ అనే నాటిక ప్రదర్శనతో పాప్‌కార్న్ థియేటర్ను ప్రారంభించారు. పాప్‌కార్న్ థియేటర్ ద్వారా చిన్నారులను, యువతను నాటకరంగంవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

టీవీరంగం[మార్చు]

మొదట్లో టీవీల్లో వచ్చే అనువాద చిత్రాలకు, ధారావాహికలకు అనువాద కళాకారుడిగా పనిచేశాడు. ప్రస్తుతం జీ తెలుగు ఛానల్ లో శనివారం రాత్రి వచ్చే పిల్లల నాటకాల ప్రోగ్రాం డ్రామా జూనియర్స్ కు పనిచేస్తున్నాడు.

సినిమా రంగం[మార్చు]

రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినిమా దర్శకుడైన ఖాజా పాషా దర్శకత్వంలో వెన్నెల కిషోర్ హీరోగా వచ్చిన D/O వర్మ చిత్రంలోని పిల్లాడికి నటనలో శిక్షణ ఇస్తూ, అదే చిత్రానికి సహాయ దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.

నటించినవి[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2016 బొమ్మలరామారం[8] మల్లేష్ తెలుగు తొలి చిత్రం
2017 ఘాజీ[9] డెప్త్ కంట్రోలర్ హిందీ, తెలుగు తొలి హిందీ చిత్రం
2017 ఏ మంత్రం వేసావే హరి తెలుగు
2018 శుభలేఖ+లు పరిమళ్ తెలుగు
2019 మల్లేశం వీరప్రతాప్ తెలుగు
2019 పలాస 1978 తెలుగు నిర్మాణంలో ఉంది
2019 జార్జిరెడ్డి[10] తెలుగు నిర్మాణంలో ఉంది

లఘు చిత్రాలు[మార్చు]

అతల కుతల పాతాళం, కలర్స్, కుమార సంభవం, సోడాబుడ్డి భాస్కర్, ఆయుధం మొదలైన లఘు చిత్రాలలో నటించాడు.

రేడియో[మార్చు]

హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్.ఎం (101.9) లో ఆరు నెలలపాటు ఆర్జేగా పనిచేశాడు. రేడియో నాటకాలలో కూడా పాల్గొన్నాడు.

పురస్కారాలు[మార్చు]

 1. తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల యువ పురస్కారం 2017[11][12]

మూలాలు[మార్చు]

 1. http://mytheatrecafe.com/. "Review: "Barbareekudu": Tracing the Caste Conflict in the Epic War – Telugu Play". Retrieved 25 August 2016. Cite web requires |website= (help)
 2. The Hindu, FRIDAY REVIEW (29 July 2011). "Tale about the downtrodden". Retrieved 25 August 2016. Cite news requires |newspaper= (help)
 3. LIFESTYLE, BOOKS AND ART, Deccan Chronicle (24 March 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 23 August 2016. Cite news requires |newspaper= (help)
 4. తెలుగు వన్ ఇండియా. "గోల్డెన్ త్రెషోల్డ్ లో "దావత్"". telugu.oneindia.com. Retrieved 25 March 2017.
 5. తెలుగు ఫిల్మీబీట్. "రవీంధ్ర భారతిని నవ్వులలో ముంచెత్తిన "దావత్" : ఆకట్టుకున్న పాప్ కార్న్ థియేటర్ టీమ్". telugu.filmibeat.com. Retrieved 25 March 2017.
 6. Youtube. "A Man with a Lump". Retrieved 25 August 2016. Cite web requires |website= (help)
 7. నవతెలంగాణ, జాతర-స్టోరి (16 July 2019). "ప్రయోగాత్మక నాటికలు". మూలం నుండి 16 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 September 2019. Cite news requires |newspaper= (help)
 8. Bommalaramaram. "Bommalaramaram Team". Bommalaramaram. Retrieved 23 August 2016.
 9. ఇండియన్ ఎక్స్ ప్రెస్. "Ghazi: Indian submarine's depth controller shares what all went behind making the courageous film". Retrieved 25 March 2017. Cite news requires |newspaper= (help)
 10. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (1 August 2019). "విప్లవమే జీవితం". www.ntnews.com. మూలం నుండి 2 August 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 2 August 2019.
 11. వెబ్ ఆర్కైవ్, సాక్షి (09.05.2017). "రంగస్థలానికి ఉజ్వల భవిష్యత్తు". Retrieved 10 May 2017. Cite web requires |website= (help)
 12. ప్రజాశక్తి, తెలంగాణ (18 March 2017). "20 నుంచి జాతీయ నృత్యోత్సవం". మూలం నుండి 27 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 27 March 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తిరువీర్ పేజీ
 2. యూట్యూబ్ లో ఉస్కో సినిమా ట్రైలర్
 3. యూట్యూబ్ లో బొమ్మలరామారం సినిమా ట్రైలర్
"https://te.wikipedia.org/w/index.php?title=తిరువీర్&oldid=2722742" నుండి వెలికితీశారు