Jump to content

గోల్డెన్ త్రెషోల్డ్

వికీపీడియా నుండి
గోల్డెన్ త్రెషోల్డ్

గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం శ్రీమతి సరోజినీ నాయుడు నివాస గృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ చటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి (ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఈ బంగళాని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం, జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, హైదరాబాదులో ఈ గృహం, కేంద్ర బిందువుగా ఉండేది. ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు, సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి, నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. గాంధీజీ గారు పునాది వేసిన ఆసుపత్రిని గోపాల్ క్లినిక్ అని ఇప్పటికీ సంభోదిస్తారు. పునాది వేసిన తేది ఈ బంగాళా శిలాఫలకంపై కనిపిస్తాయి.

ప్రస్తుత చరిత్ర

[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది. 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధి గారు... పద్మజా నాయుడు గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాదు విశ్వవిద్యాలయము ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్ ను గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించారు.[2] ఆగస్టు 2012 నుండి థియేటర్ ఔట్రీచ్ యూనిట్‌ని నడుపుతున్నారు.

చిత్రమాలిక

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Sharma, Kaushal Kishore (2003). "Sarojini Naidu: A Preface to Her Poetry". Feminism, Censorship and Other Essays. Sarup & Sons. pp. 56–57. ISBN 978-81-7625-373-4.
  2. "Sarojini Naidu School of Arts & Communication". Retrieved 12 February 2014.

ఇతర లంకెలు

[మార్చు]