Jump to content

ఏ మంత్రం వేసావె

వికీపీడియా నుండి
ఏ మంత్రం వేసావెసినిమా పోస్టరు

ఏ మంత్రం వేసావె 2018 మార్చి 9 న విడుదలైన తెలుగు చిత్రం. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో గోలీసోడా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శివాని నటించారు..[1][2]

నిఖిల్ ‌ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన యువ‌కుడు. ఇంటి నుండి బ‌య‌ట‌కు రాకుండా ఆన్‌లైన్ గేమ్స్‌లోనే కాలం గ‌డుపుతుంటాడు. ఓ రోజు అతడికి రాగ్స్ అలియాస్ రాగ‌మాలిక (శివానీ సింగ్‌) ప‌రిచ‌యం అవుతుంది. నిఖిల్ ‌కి పేరు చెప్పకుండా అత‌న్ని ఆట ప‌ట్టిస్తుంటుంది. రాగ్స్‌తో స్నేహం చేయాల‌నుకుంటాడు నిఖిల్ ‌. అయితే త‌న‌ని క‌ల‌వాలంటే నిజ జీవితంలో ఓ ఆట ఆడి గెల‌వాల‌నే షరతు పెడుతుంది రాగ్స్‌. త‌న నిబంధ‌న‌లకు ఒప్పుకున్న నిఖిల్ ‌.. ఆమెను క‌లుసుకునే ప్ర‌య‌త్నంలో రాగ్స్‌కు ఓ ప్ర‌మాదం ఉంద‌ని తెలుసుకుంటాడు. రాగ్స్‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో నిఖిల్ ‌చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాడు. ఆ స‌మ‌స్య‌లేంటి? చివ‌రికి నిఖిల్ ‌, రాగ్స్ ఒక‌ట‌య్యారా? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఏవేళ చూశానో కానీ, యాజీన్ నిజార్
  • గో లేడీ గాగా, లీప్సిక , సాహితి , రమ్య బెహరా, స్వీకార్ అగస్తి
  • నువ్వంటులేని లోకం , దినకర్
  • సుదూరాల తీరాల పాట , ప్రణవి

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాణ సంస్థ‌లు: గోలిసోడా ఫిలింస్‌, సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
  • సంగీతం: అబ్బ‌త్ స‌మ‌త్‌
  • కెమెరా: శివారెడ్డి
  • నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్ మ‌ర్రి

మూలాలు

[మార్చు]
  1. "Vijay Deverakonda's Ye Mantram Vesave First Look Poster". Chitramala (in Indian English). 2017-10-20. Archived from the original on 2018-07-05. Retrieved 2017-10-30.
  2. Telugu Filmnagar (2017-10-19), Ye Mantram Vesave First Look Teaser | Vijay Deverakonda | Shivani | #YeMantramVesave, retrieved 2017-10-30

బయటి లంకెలు

[మార్చు]