విజయ్ దేవరకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవరకొండ విజయ్ సాయి
జననం
విజయ్ దేవరకొండ సాయి

(1989-05-09) 1989 మే 9 (వయసు 34)
వృత్తినటుడు
తల్లిదండ్రులు
 • గోవర్ధన రావు (తండ్రి)
 • మాధవి (తల్లి)

విజయ్ దేవరకొండ (జననం 9 మే 1989), తెలుగు సినిమా నటుడు.[1] నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన.[2] 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.2017 మొదట్లో ద్వారక అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపం తో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు. 2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేశావో తో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు.మళ్ళీ అదే సంవత్సరం లో వచ్చిన గీత గోవిందం తో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.మళ్ళీ వెంటనే 2018 లో నోటా తో మరొక పరాజయాన్ని చూసాడు.ఆ తర్వాత నవంబర్ 17-2018న టాక్సీవాలా తో మరొక్క చక్కని విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్.యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.[3]

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం[మార్చు]

ఈయన మే 9, 1989 న హైదరాబాద్ లో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధనరావు, మాధవిలు తెలంగాణాలోని నాగర్ కర్నూలు జిల్లా, [తుమాన్పెట్]] గ్రామానికి చెందినవారు. తండ్రికి సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టక మునుపే హైదరాబాదుకు వచ్చారు. సినిమాల్లో నటుడు అవ్వాలనుకున్నాడు కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ శాఖలో ప్రవేశించాడు. దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ చానళ్ళలో ఆయన దర్శకత్వం వహించిన సీరియళ్ళు ప్రదర్శింప బడ్డాయి. విజయ్, ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.[4]పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారు.[5]

టీవీలు, ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పాఠశాల ఉండేదనీ, అక్కడే తాను కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నానని వివరించారు విజయ్. ఈ రోజు తన ప్రవర్తన, వ్యక్తిత్వం మొత్తం ఆ పాఠశాలలో పెంపొందించుకున్నవే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్కూలు చదువు పూర్తయ్యాకా, హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశలలో ఇంటర్, బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.[6] .[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

విజయ్ తమ్ముడు ఆనంద్ అమెరికాలోని డెలాయిట్ లో పని చేస్తున్నారు. తల్లి మాధవి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. ఆమె హైదరాబాదులో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. విజయ్ తండ్రి టివి సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తుంటారు. నిజానికి ఆయనకు తన తండ్రే స్ఫూర్తి. సినిమాల్లో నటించేందుకు మహబూబ్ నగర్ లోని బల్మూర్, నుంచి హైదరాబాద్ వచ్చారు విజయ్ తండ్రి.[8]

విజయ్ అన్ని రకాల క్రీడలు, ఆటలు ఆడేందుకు ఇష్టపడతారు.[9]

కెరీర్[మార్చు]

సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్ షాప్ లో పాల్గొన్న విజయ్, హైదరబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాలు చేశారు. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు విజయ్.[7]

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా చిత్రం, శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పాత్రల్లో కనిపించారు విజయ్. ఆ సమయంలోనే సహాయ దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలసి నటించారు ఆయన.[10] ఈ సినిమాలో విజయ్ నటన చూసిన నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు తమ సంస్థలో రెండు చిత్రాలు చేసేందుకు విజయ్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. [11][12][13]

2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతు వర్మ సరసన పెళ్ళి  చూపులు సినిమాలో  నటించారు విజయ్. ఈ సినమా ఆయన కెరీర్  లోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది.[14]

2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ చిత్రం ద్వార విజయ్ భారత దేశ వ్యాప్తం గా పేరు సంపాదించుకున్నారు. ఇక తర్వాత సంవత్సరంలో వచ్చిన గీత గోవిందం చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాదించింది. ఈ చిత్రం తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పొయ్యింది. విజయ్ దేవరకొండ చిత్రాలకి సంబదించిన బాక్స్ ఆఫీస్ స్టేట్స్ ఇక్కడ పొందు పరిచాము.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష నోట్స్
2011 నువ్విలా విష్ణు తెలుగు డెబ్యూ
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అజయ్ తెలుగు
2014 మేడం మీరేనా ఇంగ్లీష్ దర్శకుడు(షార్ట్ ఫిలిం)
2015 ఎవడే సుబ్రహ్మణ్యం రిషి తెలుగు సహాయ నటుడు
2016 పెళ్ళిచూపులు ప్రశాంత్ తెలుగు కథనాయకుడిగా తొలి చిత్రం
2017 ద్వారక ఎర్ర శీను/ శ్రి కృష్ణానంద స్వామి తెలుగు కథానాయకుడు
2017 అర్జున్ రెడ్డి అర్జున్ తెలుగు కథానాయకుడు
2018 ఏ మంత్రం వేసావె నిక్కి తెలుగు
మహానటి / నటిగైర్ తిలగం విజయ్ ఆంటొని తెలుగు/తమిళం గెస్ట్ రోల్
గీత గోవిందం (సినిమా) గోవిందం తెలుగు కథానాయకుడు
నోటా 2018 శీను .బి.ఏ.ఎల్.ఎల్.బి తెలుగు/తమిళం కథానాయకుడు
ఈ నగరానికి ఏమైంది తెలుగు అతిథి పాత్ర
టాక్సీవాలా శివ తెలుగు కథానాయకుడు
2019 డియర్ కామ్రేడ్ Comrade Chaitanya Krishnan (Bobby) Dubbed into Kannada, Malayalam and Tamil కథానాయకుడు
మీకు మాత్రమే చెప్తా వినయ్ కుమార్ తెలుగు అతిథి పాత్ర
2020 వరల్డ్ ఫేమస్ లవర్[15] సీనయ్య(శ్రీను)/ గౌతమ్ తెలుగు అతిథి పాత్ర
హీరో Filming
Thalaivi Shobhan Babu Filming
ఫైటర్ Filming

మూలాలు[మార్చు]

 1. యార్లగడ్డ, మధులత. "నాన్న కలని నేను నిజం చేశా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 21 సెప్టెంబరు 2017. Retrieved 21 సెప్టెంబరు 2017.
 2. https://www.youtube.com/watch?v=_pqngUO_pP4
 3. Boy, Zupp (2020-08-22). "Vijay Devarakonda ranks third in The Most Desirable Men 2019 after Shahid Kapoor, Ranveer Singh". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
 4. "Vijay Devarakonda Biodata, Family & Movies".
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-19. Retrieved 2016-11-05.
 6. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/this-film-came-at-the-right-time/article6902995.ece
 7. 7.0 7.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-23. Retrieved 2021-01-18.
 8. http://www.idlebrain.com/celeb/interview/lib-vijaydevarakonda.html
 9. http://www.idlebrain.com/news/today/yevadesubramanyam-vijaydeverakondaasrishi.html
 10. http://www.thehindu.com/features/metroplus/an-eye-for-story/article6874716.ece
 11. https://www.youtube.com/watch?v=oSstKbH8NQg
 12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-30. Retrieved 2016-11-05.
 13. http://www.greatandhra.com/movies/reviews/yevade-subramanyam-review-yes-he-is-worth-the-find-64844.html
 14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-27. Retrieved 2016-11-05.
 15. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.