మహానటి (2018 సినిమా)
ఇది 2018లో సినీనటి సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా.
మహానటి | |
---|---|
![]() | |
దర్శకత్వం | నాగ్ అశ్విన్ |
కథా రచయిత | బుర్రా సాయిమాధవ్ (మాటలు) |
కథ | నాగ్ అశ్విన్ |
నిర్మాత | అశ్వినీ దత్, ప్రియాంకా దత్, స్వప్నా దత్ |
తారాగణం | దుల్కర్ సల్మాన్ కీర్తీ సురేష్ విజయ్ దేవరకొండ సమంత |
ఛాయాగ్రహణం | డానీ సంచెజ్- లోపెజ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2018 మే 9 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీనటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు - సి. అశ్వినీదత్, స్వప్నా దత్, ప్రియాంకా దత్. ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినెమా బ్యానర్స్ కింద విడుదలయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మిక్కి జె మెయెర్ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది.
నేపధ్యము[మార్చు]
ఈ చిత్రం మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమా 2017 మేలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. 2018 మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.[1]
తెలుగులో మహానటి గా ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు 2017 మేలో హైదరాబాదు లోని రామకృష్ణ స్టుడియోస్ లో ప్రారంభమయ్యాయి.[2][3]
కథ[మార్చు]
బెంగుళూరులో ఒకనాటి ప్రముఖ సినీ నటియైన సావిత్రి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనిస్తాడు ఆమె కొడుకు. ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోతుంది. చాలా వార్తా పత్రికలు ఇది ఒక చిన్న సంఘటనగా వార్త ప్రచురిస్తారు. కానీ ఆ ఘటన వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలియరావు. ప్రజావాణి పత్రికలో పనిచేసే పాత్రికేయురాలు మధురవాణి మొదట్లో అయిష్టంగానే ఈ వార్త స్వీకరించి ఆసక్తి కొద్దీ ఆమె జీవితం గురించి తెలుసుకోవడం మొదలు పెడుతుంది.
తారాగణం[మార్చు]
- సావిత్రి గా కీర్తి సురేష్
- జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్
- ఎస్. వి. రంగారావు గా మోహన్ బాబు
- విజయ్ యాంథోనిగా విజయ్ దేవరకొండ
- మధురవాణిగా సమంత , ప్రజావాణి పత్రిక విలేఖరి
- కె. వి. చౌదరిగా రాజేంద్ర ప్రసాద్, సావిత్రి పెదనాన్న
- అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య
- కె.వి.రెడ్డిగా జాగర్లమూడి రాధాకృష్ణ
- సుశీల గా షాలీని పాండె
- దుర్గమాంబగా భానుప్రియ, సావిత్రి పెద్దమ్మ
- సుభద్రమ్మగా దివ్యవాణి, సావిత్రి తల్లి
- మధురవాణి తల్లిగా తులసి
- ప్రజావాణి పత్రిక సంపాదకుడిగా తనికెళ్ల భరణి
- స్టిల్ ఫోటోగ్రాఫరు గా నరేష్
- ఎల్. వి. ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్
- చక్రపాణిగా ప్రకాష్ రాజ్
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం- నాగ్ అశ్విన్
- సంగీతం - మిక్కీ జె. మేయర్
మూలాలు[మార్చు]
- ↑ "Samantha Akkineni wraps up Mahanati, all set to holiday with hubby Naga Chaitanya". India Today (in ఇంగ్లీష్). 20 March 2018. Retrieved 22 March 2018.
- ↑ "Mahanati, biopic on iconic actress Savitri, officially launched – Pinkvilla South". Pinkvilla South (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 September 2017.
- ↑ "Mahanati starts rolling in Hyderabad today – Times of India". The Times of India. Retrieved 14 September 2017.