Jump to content

అర్జున్ రెడ్డి

వికీపీడియా నుండి
అర్జున్ రెడ్డి
(2017 తెలుగు సినిమా)

థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వం సందీప్ రెడ్డి వంగా
నిర్మాణం ప్రణయ్ రెడ్డి వంగా
రచన సందీప్ రెడ్డి వంగా
తారాగణం విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు, కాంచన, జియా శర్మ, గోపినాథ్ భట్
సంగీతం రధన్ (పాటలు), హర్షవర్ధన్ రామేశ్వర్ (నేపథ్య సంగీతం)
ఛాయాగ్రహణం రాజ్ తోట
కూర్పు శశాంక్‌
నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌
నిడివి 3 గంటల 6 నిముషాలు[1]
భాష తెలుగు

అర్జున్ రెడ్డి 2017లో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో నటించారు. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ , సంజయ్ స్వరూప్ , గోపినాథ్ భట్ , కమల్ కామరాజు,, కాంచన సహాయక పాత్రలు వహించారు. ఈ చిత్రం అర్జున్ రెడ్డి దేష్ముఖ్ అనే కోపాన్ని అదుపులో ఉంచుకోలేని తాగుబోతు వైద్యుడు గురుంచి. తన ప్రేయసిని కోలిపోయిన తరువాత అర్జున్ తీసుకునే ఆత్మవిధ్వంసక చర్యలు, వాటి మూలంగా జరిగే ఘటనలు ఈ కథ.

మంగుళూరులో వైద్య విద్యనభ్యసిస్తున్న అర్జున్ రెడ్డి ఓ ప్రతిభావంతుడైన విద్యార్థి. కానీ కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోలేడు. ఈ గుణం మూలంగా ఒక రోజు జరుగుతున్న విద్యాలయ కాలిగుండు పోటీలో అర్జున్ ఆగ్రహించి ఎదురు జట్టులోని ఒక క్రీడాకారుడితో గొడవపడతాడు. దీని గురించి తెలుసుకున్న కళాశాలాధిపతికి అర్జున్పై చాలా కోపం వస్తది. తను అర్జున్కి రెండు వికల్పములు ఇస్తాడు: క్షమాపణ కోరిడం లేక విద్యాలయ బహిష్కరణ. అహంకారంతో అర్జున్ రెండోది ఎంపిక చేస్తాడు. కానీ తను వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న వేళలో అదే విద్యాలయంలో కొత్తగా చేరడానికి వచ్చిన ప్రీతి అనే అమ్మాయి అర్జున్కి కనపడతది.

తనని చుసిన వెంటనే అర్జున్, తన స్నేహితుడు శివ కలిసి మొదటి సంవత్సర వైద్య శాస్త్ర విద్యార్థులు దగ్గరికి వెళ్తారు. అక్కడ అర్జున్ ప్రీతీ తన సొంతమేనని ప్రకటించి, వేరెవ్వరు తనని ఇష్టపడకూడదని హెచ్చరిస్తాడు. మొదట్లో ప్రీతి అర్జున్ ప్రవర్తన చూసి బెదిరిపోతది కానీ నానాటికి తనకి కూడా అర్జున్ అంటే మక్కువ ఏర్పడతది. ఇద్దరు లవ్ చేసుకుంటారు.. ఆలా సాగే..స్టోరీ లవ్ ఫెయిల్యూర్ దాకా వెళుతుంది..ప్రీతికి పెళ్లై పోతుంది..హీరో మందుకి ఎడిక్ట్ ఐపోతాడు..

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • దూరం , రచన: అనంత్ శ్రీరామ్, గానం.నిఖిత గాంధీ
  • తెలిసేనే నా నువ్వే , రచన: రాంబాబు గోసల , గానం.ఎల్.వి.రేవంత్
  • ఏమి టెమిటి, రచన: అనంత శ్రీరామ్, గానం. అల్ఫాన్స్ జోసెఫ్
  • మధురం, రచన: శ్రేష్ఠ , గానం.సమీరాభరద్వాజ్
  • మరిమరి , రచన: మందెల పెదస్వామి , గానం: గౌతమి
  • ఊపిరి ఆగుతున్నదే , రచన: రాంబాబు గోసల , గానం.ఎల్.వి.రేవంత్
  • గుండెలోన, రచన:శ్రేష్ట , గానం. సౌజన్య

నిర్మాణం

[మార్చు]

అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో పాత్రకోసం శర్వానంద్ను సంప్రదించాడు. కానీ, అతను వేరే సినిమా చేస్తుండడంతో విజయ్ దేవరకొండను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది

విడుదల - స్పందన

[మార్చు]

2017, ఆగస్టు 26న విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సందీప్ కి, చిత్ర యూనిట్ కి మంచి పేరు వచ్చింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది.

సాంకేతిక వర్గం

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2017 సైమా అవార్డులు

  1. ఉత్తమ హాస్యనటుడు (రాహుల్ రామకృష్ణ)

మూలాలు

[మార్చు]
  1. Eenadu (28 November 2024). "అఫీషియల్‌.. 'పుష్ప2' రన్‌టైమ్‌ ఇదే.. అత్యధిక నిడివి గల తెలుగు చిత్రాలివే". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  2. Andhrajyothy (28 October 2023). "ఒళ్లు దాచుకోకుండా క‌ష్టప‌డుతున్నా.. అవ‌కాశాల్లేవ్‌". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Arjun Reddy