సందీప్ రెడ్డి వంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సందీప్ రెడ్డి వంగా
SandeepReddy Vanga.jpg
సందీప్ రెడ్డి వంగా
జననం (1988-12-25) 1988 డిసెంబరు 25 (వయస్సు: 31  సంవత్సరాలు)
వరంగల్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2016–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమనీషా
పిల్లలుఅర్జున్ రెడ్డి (జ.2016)

సందీప్ రెడ్డి వంగా తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. అర్జున్ రెడ్డి తో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

సందీప్ 1988, డిసెంబర్ 25న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లులో జన్మించాడు. 8వ తరగతి వరకు వరంగల్లులోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్, అఘాఖాన్ ఎడ్యుకేషనల్ సోసైటీ స్కూల్లో చదివిన సందీప్, 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు హైదరాబాదులో చదివాడు. దార్వాడలోని ఎస్.డి.ఎం. వైద్య కళాశాలలో ఫిజియోథెరఫీ పూర్తిచేసి, కొన్నాళ్లు వైజాగ్ లో ఉద్యోగం చేసాడు.

సినిమారంగంపై ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ అఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ ఫై శిక్షణ తీసుకున్నాడు.

సినిమారంగం[మార్చు]

2010 నుండి సినిమారంగంలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సందీప్, 2010లో కేడి సినిమాకు సహాయ దర్శకుడిగా.. 2015లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు సహా దర్శకుడిగా పనిచేసాడు.

అర్జున్ రెడ్డి: అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో పాత్రకోసం శర్వానంద్ ను సంప్రదించాడు. కానీ, అతను వేరే సినిమా చేస్తుండడంతో విజయ్ దేవరకొండను తీసుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు.

2017, ఆగష్టు 26న విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సందీప్ కి, చిత్ర యూనిట్ కి మంచి పేరు వచ్చింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది.

దర్శకత్వం వహించినవి[మార్చు]

  1. 2017 - అర్జున్ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. 10టీవీ (25 August 2017). "'అర్జున్ రెడ్డి' ప్రివ్యూ..." Archived from the original on 26 అక్టోబర్ 2017. Retrieved 29 December 2017. Check date values in: |archive-date= (help)
  2. ఈనాడు. "బాక్సాఫీసు వద్ద 'అర్జున్‌ రెడ్డి' పరుగులు". Archived from the original on 26 డిసెంబర్ 2017. Retrieved 29 December 2017. Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలు[మార్చు]