మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
స్వరూపం
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు | |
---|---|
దర్శకత్వం | కె. క్రాంతి మాధవ్ |
రచన | కె. క్రాంతి మాధవ్ (స్క్రీన్ ప్లే , కథ) సాయిమాధవ్ బుర్రా (సంభాషణలు) |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జ్ఞానశేఖర్ వి.ఎస్. |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | గోపి సుందర్ |
పంపిణీదార్లు | సిసి మీడియా అండ్ ఎంటర్టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 6 ఫిబ్రవరి 2015 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 2015 ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు ప్రేమ కథా చిత్రం.
కథ
[మార్చు]రాజారామ్ (శర్వానంద్) ఒక పరుగు పందెం క్రీడాకారుడు . తనతోనే చదువుతోన్న నజీరాని (నిత్యా మీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరయినా కానీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. ఏళ్లు గడిచిపోతాయి. అయినా కానీ ఇద్దరూ తాము ప్రేమించిన వాళ్లని మర్చిపోకుండా ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ ఒక్కటవుతారా లేదా? అన్నది మిగిలిన కథ.[1]
తారాగణం
[మార్చు]- శర్వానంద్
- నిత్యా మీనన్
- పవిత్ర లోకేష్
- సూర్య
- చిన్నా
- నాజర్
- తేజస్వి మదివాడ
- పునర్నవి
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు: సాయిమాధవ్ బుర్రా
- సంగీతం: గోపి సుందర్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్.
- నిర్మాత: కె.ఎ. వల్లభ
- సమర్పణ: కె. ఎస్. రామారావు
- కథ, కథనం, దర్శకత్వం: కె. క్రాంతి మాధవ్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-08. Retrieved 2015-02-09.