కె. ఎస్. రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. ఎస్. రామారావు
జననంవిజయవాడ, ఆంధ్రప్రదేశ్,ఇండియాIndia
ప్రసిద్ధిసినిమాలు
మతంహిందూమతం
పిల్లలువల్లభ

కె.ఎస్. రామారావు ఒక తెలుగు సినీ నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి పెక్కు పురస్కారాలను కూడా పొందారు.

నేపధ్యము[మార్చు]

ఇతనిది విజయవాడ. అక్కడే పుట్టి పెరిగాడు. విద్యాభ్యాసం కూడా అక్కడే చేశాడు. ఇరవై ఒక్క ఏళ్లు వయస్సులో విజయవాడ నుండి చెన్నై వెళ్ళాడు. సినిమాల మీద ఇతని ఆసక్తి గమనించి కె. రాఘవేంద్రరావు వాళ్ల నాన్న కె.ఎస్. ప్రకాశరావు గారు అతడిని తన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆయన వద్ద 'బందిపోటు దొంగలు', 'విచిత్ర కుటుంబం', 'నా కుటుంబం' అనే మూడు సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత ఇతని నాన్నకి ఒంట్లో బాగా లేకపోవడంతో విజయవాడ తిరిగి వచ్చాడు. అప్పుడే వచ్చిన 'జై ఆంధ్ర' ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆంధ్రా పీపుల్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఉండేవాడు. కానీ వాటిలోనూ రాజకీయ నాయకులు రావడంతో వదిలేసి, మళ్లీ చెన్నైకి వెళ్లిపోయాడు.

నిర్మించిన చిత్రాలు[మార్చు]

ఇతను మొదట పుట్టనకనగళ్ అనే కన్నడ దర్శకుడి మీద అభిమానం ఉండటంతో ఆయన సినిమాని తెలుగులో అనువాదం చేశాడు. అది ఫ్లాపయింది. కమల్‌హాసన్ అబిమాని కావడంతో 'ఎర్ర గులాబీలు' కొన్నాడు. అది పెద్ద హిట్టయింది. అలాగే ఆయనదే 'టిక్ టిక్ టిక్' చేశాడు. అదీ బాగా ఆడింది. ఆ తర్వాత సుహాసిని మొదటి సినిమా 'మౌనగీతం' చేశాడు. అది కూడా ఆడింది. అలా డబ్బింగ్ సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రధాన సినిమాల్లోకి వచ్చాడు. చిన్నప్పట్నించీ సాహిత్యం ఎక్కువగా చదివేవాడు. ఆంధ్రజ్యోతిలో యండమూరి వీరేంద్రనాథ్ ధారావాహిక 'అభిలాష' చదువుతూ, బాగుందనిపించి, ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ సినిమా తీశాడు. ఇళయరాజాను నేరుగా తెలుగుకు పరిచయం చేసింది ఆ సినిమాతోనే. అదివరకు 'సీతాకోకచిలుక'కు ఆయన పనిచేసినా, అందులోని పాటలు తమిళ ట్రాకువే. ఆయన ప్రత్యేకంగా తెలుగు సినిమా కోసం ట్యూన్లు కట్టింది మొదటగా 'అభిలాష'కే. ఆ తర్వాత ఆయన ఇతని సినిమాలకు తెలుగు ట్యూన్లే చేస్తూ వచ్చారు.

చిత్రాల జాబితా[మార్చు]

  1. కౌసల్య కృష్ణమూర్తి (2019)[1]
  2. వరల్డ్ ఫేమస్ లవర్ (2020)[2]

మూలాలు[మార్చు]

  1. Telangana Today, Entertainment (22 June 2019). "Inspirational tale of Kausalya Krishnamurthy". Prakash Pecheti. Archived from the original on 1 July 2019. Retrieved 9 January 2020.
  2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.

బయటి లంకెలు[మార్చు]