Jump to content

వరల్డ్ ఫేమస్ లవర్

వికీపీడియా నుండి
వరల్డ్ ఫేమస్ లవర్
వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకత్వంక్రాంతి మాధవ్
స్క్రీన్ ప్లేక్రాంతి మాధవ్
కథక్రాంతి మాధవ్
నిర్మాతకె.ఎ. వల్లభ
కె. ఎస్. రామారావు
తారాగణంవిజయ్ దేవరకొండ
రాశీ ఖన్నా
ఐశ్వర్య రాజేష్
కేథరీన్ థెరీసా
ఛాయాగ్రహణంజయకృష్ణ గుమ్మడి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
14 ఫిబ్రవరి 2020 (2020-02-14)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹35 కోట్లు
బాక్సాఫీసు₹12.55 కోట్లు[3]

వరల్డ్ ఫేమస్ లవర్ 2020, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ థెరీసా తదితరులు నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించాడు.[4]

కథా నేపథ్యం

[మార్చు]

ప్రేమికులైన గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) సహజీవనం చేస్తుంటారు. పేరొందిన రచయిత కావాలన్న లక్ష్యంతో గౌతమ్ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ప్రతిరోజు ఇంట్లో ఏదో రాయాలని ప్రయత్నిస్తున్న గౌతమ్ కు ఏం రాయోలో అర్థంకాదు. గౌతమ్ ప్రవర్తనపై విసుగుచెందిన యామిని బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో గౌతమ్ ఒక ప్రేమకథను రాస్తాడు. ఆ కథ ఎవరిది, గౌతమ్ ఆ కథను ఎందుకు రాశాడు అనేది, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[5][6][7]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణంలో చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు క్రాంతి మాధవ్, నటుడు విజయ్ దేవరకొండను సంప్రదించాడు.[8] అక్టోబరు నెలలో కథపరమైన చర్చలు ముగిసి, 2018, అక్టోబరు 18న దసరా పండుగ సందర్భంగా సినిమా అధికారికంగా ప్రారంభించబడింది.[9] ఈ ప్రారంభోత్సవానికి టి. సుబ్బరామి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా చిత్ర నటవర్గం, సాంకేతికవర్గం పాల్గొన్నారు.[10]

నటీనటుల ఎంపిక

[మార్చు]

ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లె లైట్ హీరోయిన్ పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు.[10] 2019 జనవరి లో, కేథరీన్ థెరిసా కూడా నటిస్తుందని 2019, జనవరిలో తెలిపారు.[11]

చిత్రీకరణ

[మార్చు]

2019, ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమైంది.[12] 2019, జూన్ నెలలో ఫ్రాన్సులో విజయ్ దేవరకొండతో ఒక షెడ్యూల్ చిత్రీకరించబడింది.[13]

పాటలు

[మార్చు]
వరల్డ్ ఫేమస్ లవర్
పాటలు by
Released6 ఫిబ్రవరి, 2020
Recorded2019
Genreసినిమా పాటలు
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerగోపి సుందర్
గోపి సుందర్ chronology
చూసి చూడంగానే
(2020)
వరల్డ్ ఫేమస్ లవర్
(2020)
మోస్ట్ ఎలిజముల్ బ్యాచిలర్
(2020)
మూస:Singles
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మై లవ్ (రచన: రెహ్మన్)"  శ్రీకృష్ణ, రమ్య బెహరా 3:37
2. "బొగ్గు గనిలో (రచన: రామజోగయ్య శాస్త్రి)"  నిరంజ్ సురేష్ 3:00
3. "రాలెత్తి (రచన: శ్రేష్ఠ)"  దివ్య ఎస్. మీనన్ 4:30
4. "కొమోసవా పారీస్ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  బెన్నీ దయాల్ 2:30
5. "మన కథ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  ఎల్.వి. రేవంత్ 3:00
17:07

విడుదల

[మార్చు]

2020, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ఈ చిత్రం విడుదలయింది.[1] తెలుగుతోపాటు, ఈ చిత్రం హిందీ, మలయాళం, తమిళంలో కూడా విడుదలయింది.[14]

మార్కెటింగ్

[మార్చు]

2019, సెప్టెంబరు 17న ఈ చిత్రం టైటిల్ ప్రకటించబడింది.[15] 2019, సెప్టెంబరు 17న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది.[16] 2020, జనవరి 3న చిత్ర మొదటి టీజర్ విడుదలయింది.[17] 2020, ఫిబ్రవరి 6న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.[18]

స్పందన

[మార్చు]

బాక్సాఫీస్

[మార్చు]

నాలుగు రోజులకు 12.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.[3]

విమర్శకుల స్పందన

[మార్చు]

కథాంశం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంశాలలో ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది. సీనయ్య, సువర్ణ, యామిని పాత్రలలో విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ నటనకు అనుకూల సమీక్షలు వచ్చాయి.[19]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Vijay Deverakonda's World Famous Lover to release on Valentine's Day". The Indian Express. 25 November 2019. Retrieved 24 February 2020.
  2. "ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు". Sakshi. 18 September 2019. Retrieved 24 February 2020.
  3. 3.0 3.1 Menezes, Gladwin (19 February 2020). "Vijay Deverakonda starrer 'World Famous Lover' sees a decline in its Box-Office collection". Republic World. Retrieved 24 February 2020.
  4. 4.0 4.1 "Vijay Devarakonda's new film titled World Famous Lover". TelanganaToday. Retrieved 24 February 2020.
  5. ఈనాడు, సినిమా (14 February 2020). "రివ్యూ: వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌". Archived from the original on 14 ఫిబ్రవరి 2020. Retrieved 24 February 2020.
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
  7. సాక్షి, సినిమా (14 February 2020). "'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 15 February 2020. Retrieved 24 February 2020.
  8. "Vijay Devarakonda And Kranthi Madav Film To Start Soon". Thupaki. 7 July 2018. Retrieved 24 February 2020.
  9. "Vijay Devarakonda's next to be helmed by Kranthi Madhav". The New Indian Express. 19 October 2018. Retrieved 24 February 2020.
  10. 10.0 10.1 "Vijay Devarakonda, Raashi Khanna Film Launch". Sakshi. Retrieved 24 February 2020.[permanent dead link]
  11. "NewsCatherine to romance Vijay Devarakonda". Andhra Jyothi. 3 February 2019. Retrieved 24 February 2020.[permanent dead link]
  12. "Vijay Devarakonda's next with Kranthi Madhav goes on floors". Times of India. Retrieved 24 February 2020.
  13. "France Dairies! Vijay Deverakonda takes a break from foreign shoot; spends time with family". Times of India. Retrieved 24 February 2020.
  14. "Vijay Deverakonda's World Famous Lover to release in multiple languages? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 30 January 2020. Retrieved 24 February 2020.
  15. "Vijay Deverakonda's next film with Kranthi titled World Famous Lover; Here's everything you need to know". Pinkvilla. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 February 2020.
  16. "World Famous Lover' First Look: Vijay Deverakonda in a bloody avatar". Times of India. 20 September 2019. Retrieved 24 February 2020.
  17. "Watch: Vijay Deverakonda is AGAIN the angry young man in 'World Famous Lover' teaser". the news minute. 3 January 2020. Retrieved 24 February 2020.
  18. "'World Famous Lover' trailer: Vijay Deverakonda's last love story?". The Hindu (in Indian English). 6 February 2020. Retrieved 24 February 2020.
  19. Iyer, Siddharth (17 February 2020). "Vijay Deverakonda's 'World Famous Lover' fails to impress at Box Office?". Republic World. Retrieved 24 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]