ఆనంద చక్రపాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద చక్రపాణి
Ananda Chakrapani
ఆనంద చక్రపాణి
జననంఆగస్టు 18
గడ్డంవారి యడవల్లి, కంగల్ మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు
భార్య / భర్తటి.కె. శైలజ
పిల్లలునూతన ఆనంద, కీర్తన శ్రీ ఆనంద
తండ్రిఆనందపు పుల్లయ్య
తల్లిఆనందపు మల్లమ్మ

ఆనంద చక్రపాణి (Ananda Chakrapani) తెలుగు సినిమా నటుడు.[1] 2019లో వచ్చిన మల్లేశం సినిమాలోని హీరో తండ్రి నరసింహులు పాత్రతో గుర్తింపు పొందాడు.[2][3] దాదాపు 45పైగా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించాడు.[4]

జీవిత విషయాలు

[మార్చు]

ఆనంద చక్రపాణి, ఆగస్టు 18న ఆనందపు పుల్లయ్య, మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కనగల్ మండలం, గడ్డంవారి యడవల్లి గ్రామంలో చేనేత కుటుంబంలో జన్మించాడు. తరువాత ఇతని కుటుంబం మిర్యాలగూడ సమీపంలోని దామెరచర్ల మండలం, కొండ్రపోలు గ్రామానికి వలస వచ్చింది.[5] అక్కడ చక్రపాణి తండ్రి ఆర్ఎంపి డాక్టర్‌గా పనిచేశాడు. చక్రపాణి పాఠశాలలో చదువుకుంటూనే మిర్యాలగూడలోని తన మేనమామ ప్రింటింగ్ ప్రెస్‌లో నెలకు 30 రూపాయల జీతానికి పనిచేశాడు. పదవ తరగతి పూర్తిచేసి హైదరాబాదు వచ్చి శివంరోడ్డులోని ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో విజువలైజర్, కాపీ రైటర్‌గా పనిచేశాడు. తను కూడా అప్పుడప్పుడు కవిత్వం రాసేవాడు, జర్నలిస్టుగా కూడా పనిచేశాడు.[6]

ఆనంద చక్రపాణికి, టి.కె. శైలజతో పెళ్ళి జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (నూతన ఆనంద, కీర్తన శ్రీ ఆనంద)

సినిమారంగం

[మార్చు]

1988లో సినీ దర్శకుడు బి.నరసింగరావు తెలంగాణ నేపథ్యంలో దాసి సినిమాను రూపొందిస్తున్నాడు. సీనియర్ పాత్రికేయడుడు, కవి దేవిప్రియ ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. చక్రపాణికి నటనపై ఉన్న ఇష్టాన్ని గమనించిన దేవిప్రియ, దర్శకుడు నరసింగరావుకు పరిచయం చేశాడు. అలా దేవిప్రియ సిఫారసుతో చక్రపాణికి దాసి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.[7] ఆ తరువాత 1992లో చిటికెల పందిరి సినిమాలో హీరోగా నటించాడు.[8] కొంతకాలం దర్శకత్వశాఖలో, రచయితగా పనిచేశాడు.[9]

2013లో తన స్వస్థలమైన నల్గొండలో నివసించే ప్రజలపై ఫ్లోరోసిస్ ప్రభావం గురించి వెయిటింగ్ ఫర్ డెత్ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాడు.[10] మల్లేశం సినిమాలోని తండ్రిపాత్రకోసం నటుడిని వెతుకుతున్న సమయంలో ఆ సినిమా ప్రొడక్షన్ డిజైనర్, చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె, చక్రపాణి పేరును దర్శకుడు రాజ్ రాచకొండకు సూచించాడు. అలా ఆడిషన్‌లో ఎంపికైన చక్రపాణికి మల్లేశం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.[7] దాసి సినిమా విడుదలైన 25 సంవత్సరాల తరువాత మళ్ళీ మల్లేశం (2019) సినిమాలో చింతకింది మల్లేశం తండ్రి పాత్రలో నటించి,[11] మంచి గుర్తింపు ప్రశంసలతోపాటు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు అందుకున్నాడు.[12]

మల్లేశం సినిమా తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో హీరో తండ్రిగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి, వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వం, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి, సతీష్ పరమవేద దర్శకత్వంలోఊరికి ఉత్తరాన వంటి సినిమాలతోపాటు మరికొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలో నటించాడు.[13][14]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు
1988 దాసి బావమరిది
1993 చిటికెల పందిరి పాణి
2019 మల్లేశం నరసింహులు (హీరో తండ్రి)
2020 వరల్డ్ ఫేమస్ లవర్ శీనయ్య తండ్రి
2020 అన‌గ‌న‌గా ఓ అతిథి సుబ్బయ్య
2021 విరాట వర్వం కానిస్టేబుల్ యాకూబ్
2021 లవ్ స్టోరి మౌనిక తండ్రి
2021 5 డబ్ల్యూస్ హీరోయిన్ తండ్రి
2021 వి హోం మినిస్టర్
2021 ప్లే బ్యాక్ సుజాత తండ్రి
2021 నాంది మీనాక్షి తండ్రి
2021 ఊరికి ఉత్తరాన హీరో తండ్రి
2021 బ్లాక్ హీరో తండ్రి
2021 తెర వెనుక హీరోయిన్ తండ్రి
2021 గెలుపు హీరో తండ్రి
2021 వకీల్‌ సాబ్ దివ్యనాయక్ తండ్రి
2023 సింధూరం కామ్రేడ్ నరసింహులు
2023 టైగర్ నాగేశ్వరరావు హీరో మేనమామ
2023 డెవిల్ రమణ
2024 మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా వెంకన్న
2024 S-99 నవాబ్
2024 రాజు యాద‌వ్‌ హీరో తండ్రి
2024 మెర్సి కిల్లింగ్
2024 మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా
2024 రక్షణ
2024 ఉరుకు పటేల
2024 జ్యుయల్ థీఫ్

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle, Entertainment (3 July 2019). "Ananda Chakrapani's second innings". Suresh Kavirayani. Archived from the original on 24 July 2019. Retrieved 18 August 2020.
  2. డైలీహంట్, ఆంధ్రజ్యోతి. "'దాసి'... 'మల్లేశం'... నా అదృష్టం! -". www.dailyhunt.in. Archived from the original on 26 August 2020. Retrieved 26 August 2020.
  3. The Hindu, Metro Plus (10 July 2019). "Worth the long wait". Y. Sunita Chowdhary. Archived from the original on 26 August 2020. Retrieved 26 August 2020.
  4. ABN (2024-08-31). "మంచి బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్నా | Waiting for a good break actor Ananda Chakrapani is trying to show variety in the roles given to him". Chitrajyothy Telugu News. Archived from the original on 2024-08-31. Retrieved 2024-08-31.
  5. Telangana Today, Entertainment (1 July 2019). "Tasting success with second innings". Madhuri Dasagr. Archived from the original on 25 June 2020. Retrieved 18 August 2020.
  6. సినిమా పిచ్చోడని పిల్లనియ్యలే, వెలుగు లైఫ్, వి6 వెలుగు, నాగవర్ధన్ రాయల, 10 జూలై 2019, పుట. 7
  7. 7.0 7.1 Kavirayani, Suresh (July 3, 2019). "Ananda Chakrapani's second innings". Deccan Chronicle.
  8. Adla, Rambabu (2019-07-26). "'మల్లేశం' నా లైఫ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ ! - చక్రపాణి". Cinevinodam. Retrieved 2020-08-26.
  9. వెలుగు లైఫ్, వి6 వెలుగు, (2019-07-10). "సినిమా పిచ్చోడని పిల్లనియ్యలే". epaper.v6velugu.com. Retrieved 2020-08-26.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  10. "Man with a cause". The New Indian Express.
  11. Chowdhary, Y. Sunita (July 10, 2019). "'Mallesham' actor Ananda Chakrapani lauded after a 25-year-wait". The Hindu.
  12. Kaviraani, Suresh (February 11, 2020). "It's raining offers for Chakrapani!". Deccan Chronicle.
  13. తెలుగు ఫిల్మీబీట్, ఇంటర్వ్యూలు (4 January 2020). "అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.. లైఫ్‌లో ఊహించని ఆఫర్లు.. ఆనంద చక్రపాణి ఉద్వేగం". www.telugu.filmibeat.com. A Rajababu. Archived from the original on 18 August 2020. Retrieved 18 August 2020.
  14. సాక్షి, సినిమా (6 July 2019). "ఎంత బాగా చేసిండ్రు అన్నారు". Archived from the original on 5 July 2019. Retrieved 26 August 2020.