Jump to content

సిందూరం (2023 సినిమా)

వికీపీడియా నుండి
సిందూరం
దర్శకత్వంశ్యామ్ తుమ్మలపల్లి
రచనశ్యామ్ తుమ్మలపల్లి
నిర్మాత
  • ప్రవీణ్ రెడ్డి జంగా
తారాగణం
ఛాయాగ్రహణంహరి గౌర
కూర్పుజస్విన్ ప్రభు
సంగీతంకేశవ్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
విడుదల తేదీs
26 జనవరి 2023 (2023-01-26)(థియేటర్)
21 ఏప్రిల్ 2023 (2023-04-21)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

సిందూరం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మించిన ఈ సినిమాకు శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహించాడు. శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 26న థియేటర్‌లో విడుదలకాగా[1][2], 2022 ఏప్రిల్ 21న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[3]

శిరీష రెడ్డి (బ్రిగిడ సాగా) చదువు పూర్తయ్యాక ఎమ్మార్వోగా ఉద్యోగం సాధించి ఉద్యోగరీత్యా శ్రీరామగిరికి వస్తుంది. అక్కడి సమస్యలను తన కాలేజ్ మిత్రుడు రవి (ధర్మ) తో కలిసి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో శ్రీరామగిరి ఊర్లో జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శిరీష అన్న ఈశ్వరయ్య చనిపోవడంతో ఎమ్మార్వోగా ఉన్న ఆమె పోటీ చేయాల్సి వస్తుంది. కానీ అది సింగన్న (శివ బాలాజీ) దళానికి నచ్చదు. శిరీషను సింగన్న దళం ఏం చేసింది? అసలు ఈశ్వరయ్యను చంపింది ఎవరు? చివరకు శిరీష ఎన్నికల్లో పోటీ చేసిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
  • నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్యామ్ తుమ్మలపల్లి,
  • సంగీతం: కేశవ్
  • సినిమాటోగ్రఫీ: హరి గౌర
  • సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం
  • మాటలు: కిషోర్ శ్రీ కృష్ణ
  • ఎడిటర్: జస్విన్ ప్రభు
  • ఆర్ట్: ఆరే మధుబాబు


మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (21 January 2023). "అడవిలో అన్నల పోరాటం". Archived from the original on 25 January 2023. Retrieved 25 January 2023.
  2. Eenadu (23 January 2023). "సంక్రాంతి తర్వాత సందడి.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 25 January 2023. Retrieved 25 January 2023.
  3. Eenadu (21 April 2023). "ఓటీటీలోకి 'సిందూరం'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?". EENADU. Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.
  4. NTV Telugu (26 January 2023). "సిందూరం". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
  5. Sakshi (26 January 2023). "'సిందూరం' మూవీ రివ్యూ". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
  6. Mana Telangana (26 December 2022). "'సిందూరం' హై ఇంటెన్స్ సినిమా." Archived from the original on 26 జనవరి 2023. Retrieved 26 January 2023.