బ్రిగిడా సాగ
బ్రిగిడా సాగ | |
---|---|
జననం | సగయ బ్రిగిడా చెన్నై, తమిళనాడు |
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | సగయ బ్రిగిడా, పవి టీచర్ |
విద్య | విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ డిగ్రీ |
విద్యాసంస్థ | లయోలా కళాశాల, చెన్నై |
వృత్తి | సినిమా నటి, టీవీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019 - ప్రస్తుతం |
బ్రిగిడా సాగ భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తమిళ చలనచిత్రాలలో నటిస్తుంది. 2023లో వచ్చిన సిందూరం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది.[1]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]తమిళనాడులోని చెన్నైలో బ్రిగిడా సాగ జన్మించింది. పాఠశాల విద్య పూర్తిచేసిన ఆమె చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ డిగ్రీ పట్టాపుచ్చుకుంది.
కెరీర్
[మార్చు]2019లో ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్‌తో బ్రిగిడా సాగ నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇందులో తన అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అవలోడు అవన్, కన్ పెసుమ్ వార్తైగల్, తోల్ కడు.. చిత్రాలలో ఆమె నటించింది. అయోగ్య (2019) తమిళ చలనచిత్రంలో ఆమె మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత వర్మ (2020), మాస్టర్ (2021), వేలన్ (2021), ఇరవిన్ నిజల్[2] (2022) వంటి సినిమాల్లో నటించింది.
శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Movies List | Note |
---|---|---|
2019 | అయోగ్య | తమిళ అరంగేట్రం |
2019 | వర్మ | |
2021 | వేలన్ | |
2021 | మాస్టర్ | |
2022 | ఇరవిన్ నిజాల్ | |
2023 | సింధూరం | తెలుగు అరంగేట్రం |
మూలాలు
[మార్చు]- ↑ "Siva Balaji, Dharma, Brigida Saga Starrer Sindhooram Teaser Out - Sakshi". web.archive.org. 2023-02-24. Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "నగ్నంగా ఎందుకు నటించానంటే ! : Brigida Saga" (in ఇంగ్లీష్). 17 July 2022. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.