శివ బాలాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ బాలాజీ
జననం
శివబాలాజీ మనోహరన్

(1980-10-14) 1980 అక్టోబరు 14 (వయసు 43)
వృత్తినటుడు, వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమధుమిత
తల్లిదండ్రులు
  • మనోహరన్ రామస్వామి (తండ్రి)
  • శివకుమారి (తల్లి)

శివ బాలాజీ (జ. అక్టోబరు 14, 1980) ఒక ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003 లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ సినీ రంగంపై ఆసక్తితో అందులో ప్రవేశించాడు. మాటీవీలో జరిగిన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు.[1]

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

శివ బాలాజీ చెన్నైలో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు మనోహరన్ రామస్వామి, శివకుమారి. తండ్రి వ్యాపారవేత్త. కార్తికేయన్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. అతని చెల్లెలు పేరు గాయత్రి. అతని తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీ, కృష్ణ సాయి. 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు. 2009లో తన స్నేహితురాలు, ఇంగ్లిష్ కారన్ అనే సినిమాలో తన సహనటి అయిన మధుమిత ను వివాహం చేసుకున్నాడు.[2] వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. [3][4]

కెరీర్

[మార్చు]

శివబాలాజీ 17 ఏళ్ళ వయసు నుంచే తనతండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. 20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడు. తరువాత వ్యాపారం లేదా సినిమాలలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోమని తండ్రి సలహా ఇచ్చినపుడు 22 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. అతని తొలి చిత్రం ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ. తరువాత ఎలా చెప్పను అనే సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. దోస్త్ అనే సినిమాలో కథానాయకుడి పాత్ర పోషించాడు. ఆర్య సినిమాలో పోషించిన అజయ్ పాత్ర అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. తెలుగులో స్టార్ హోదా వచ్చింది. తరువాత సంక్రాంతి అనే సినిమాలో వెంకటేష్, శ్రీకాంత్ లకు తమ్ముడిగా నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాషా ఇతర విషయాలు
2022 రెక్కీ తెలుగు జీ5 లో ప్రసారం

మూలాలు

[మార్చు]
  1. "'బిగ్‌బాస్‌' సీజన్‌-1 విజేత శివబాలాజీ". eenadu.net. ఈనాడు. Archived from the original on 24 September 2017. Retrieved 24 September 2017.
  2. "మధుమిత నిశ్చితార్థం". indiaglitz.com. Archived from the original on 26 ఆగస్టు 2008. Retrieved 19 July 2009.
  3. "శివబాలాజీ కుటుంబం".
  4. "శివబాలాజీకి సంబంధించిన వార్త". Archived from the original on 2015-04-03. Retrieved 2016-05-20.
  5. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.