ఎలా చెప్పను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలా చెప్పను
దర్శకత్వంబి. వి. రమణ
రచన
  • బి. వి. రమణ (చిత్రానువాదం)
  • వర్మ (సంభాషణలు)
నిర్మాతస్రవంతి రవికిషోర్
తారాగణం
ఛాయాగ్రహణంహరి అనుమోలు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 2, 2003 (2003-10-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎలా చెప్పను... 2003 లో బి. వి. రమణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో శ్రీయ, తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్రవంతి మూవీస్ బ్యానరుపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు. ఈ సినిమా కథకు ఆధారం హిందీ చిత్రం తుం బిన్. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ ఒకరి మరణానికి కారణం కావడం. ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం స్థూలంగా ఈ చిత్ర కథ. నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, భలేవాడివి బాసు ఈ తరహా కథలే.

శేఖర్ (తరుణ్) ఐఐఎం లో చదువుకుని హైదరాబాదులో బిజినెస్ మేనేజరుగా పనిచేస్తుంటాడు. అతను ఒక పార్టీలో అమర్ వర్మ (శివ బాలాజీ) అనే ఒక యువ పారిశ్రామిక వేత్తను కలుస్తాడు. అమర్ కుటుంబానికి జర్మనీలో వర్మ ఇండస్ట్రీస్ పేరుతో ఓ సంస్థ ఉంటుంది. శేఖర్ పార్టీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా పొరపాటున కారు వేగం పెంచి అక్కడే నడుచుకుంటూ వెళుతున్న అమర్ ను గుద్దేస్తారు. ఆ ప్రమాదంలో అమర్ వెంటనే చనిపోతాడు. వెంటనే తేరుకున్న శేఖర్ స్నేహితుడు సునీల్ (సునీల్) ఆ నేరం వారి మీద పడకుండా ఎలోగోలా తప్పిస్తాడు.

ఆ ప్రమాదం జరిగి ఆరు నెలలు గడిచినా శేఖర్ తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకుండా ఉండలేకపోతాడు. సునీల్ తో కలిసి జర్మనీకి వెళ్ళి అమర్ కుటుంబంతో కలుస్తాడు. ఆ కుటుంబం అంతా అమర్ మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. వర్మ ఇండస్ట్రీస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అమర్ వర్మ బతికున్నప్పుడు అతనికి సంబంధం కుదుర్చుకున్న ప్రియ (శ్రీయ) కంపెనీని ఎలాగోలా నెట్టుకొస్తూ ఉంటుంది. శేఖర్ తాను ఆ కుటుంబానికి చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా వాళ్ళ పూర్వ వైభవాన్ని, సంతోషాన్ని తెచ్చివ్వడానికి ఆ కంపెనీ తరపున పనిచేయాలని నిర్ణయించుకుంటాడు. శేఖర్ ఆ వ్యాపారంలో సవాళ్ళను ఎదుర్కొని ఎలా విజయం సాధించాడు. ఆ క్రమంలోనే ప్రియ మనస్సును ఎలా గెలుచుకున్నాడన్నదే మిగతా కథ.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు కోటి సంగీతం సమకూర్చగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చాడు. ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్, చిత్ర, శ్రీరాం, సునీత ఉపద్రష్ట, కార్తీక్, మల్లికార్జున్ పాటలు పాడారు.

పాట పాడిన వారు రాసిన వారు
మాఘమాస వేళ ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఈ క్షణం ఒకే ఒక కోరిక కె. ఎస్. చిత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి
మన్నించు ఓ ప్రేమ కె. ఎస్. చిత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి
మేఘాల పల్లకిలోనా శ్రీరాం, సునీత ఉపద్రష్ట సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రతినిజం ప్రతి కలగా కె. ఎస్. చిత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఆ నవ్వుల్లో ఏమున్నదో కార్తీక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి
మంచు తాకిన మల్లికార్జున్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి
రంగుల తారక కార్తీక్, సునీత ఉపద్రష్ట సిరివెన్నెల సీతారామ శాస్త్రి

మూలాలు

[మార్చు]
  1. జీవి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో ఎలా చెప్పను సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 22 November 2016.

బయటి లింకులు

[మార్చు]