మల్లికార్జున్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లికార్జున్
జననం
వృత్తిగాయకుడు, సంగీత దర్శకుడు
జీవిత భాగస్వామిగోపిక పూర్ణిమ

మల్లికార్జున్ ఒక తెలుగు సినీ గాయకుడు, సంగీత దర్శకుడు. ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పరిచయమై తరువాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నాడు.[1] 150 కి పైగా పాటలు పాడాడు. కత్తి కాంతారావు సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు.[2] ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఇతర గాయకులతో కలిసి అనేక సార్లు విదేశే పర్యటనలు కూడా చేశాడు. పలు పాడుతా తీయగాలో తన సహగాయని యైన గోపిక పూర్ణిమ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.[3] వారికి ఓ పాప ఉంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మల్లికార్జున్ స్వస్థలం విశాఖపట్నం. తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తుండంతో శ్రీశైలం కి బదిలీ అయింది.[2] మల్లికార్జున్ ఇక్కడే జన్మించడం వల్ల అక్కడి దేవుడి పేరును పెట్టారు. అతనికి ఓ సోదరి ఉంది. ఆమె విజయవాడలో జన్మించింది. ఆమె పేరు కనకదుర్గ. పాడుతా తీయగా లో పరిచయమైన గోపిక పూర్ణిమతో చెన్నైలో తరచు కలుస్తుండటంతో పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకున్నారు.[1] పాడుతా తీయగా ద్వారా వీరిరువురికీ బాగా పరిచయం, అభిమానం ఉన్న ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అమెరికా పర్యటనలో ఉండటం వలన ఈ వివాహానికి హాజరు కాలేకపోయాడు. బాలు సోదరి, గాయని ఎస్. పి. శైలజ, గీత రచయిత భువనచంద్ర, నటుడు చంద్రమోహన్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.[3] వీరు చెన్నైలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఉండటం వల్ల వీరికి తెలుగులోనే కాక తమిళం, కన్నడ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇవే కాకుండా కచేరీలు, ఆధ్యాత్మిక ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు.

కెరీర్

[మార్చు]

గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ ఇద్దరూ సింగన్న అనే సినిమాలో అన్న వెనకే నేను ఉంటా పాటతో పరిచయం అయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కూడా ఇదే స్టూడియో లో మొదటి పాట పాడటం విశేషం.[1]

పాటలు

[మార్చు]

మల్లికార్జున్ కు పేరు తెచ్చిన పాటలు కొన్ని కింద జాబితాలో ఇవ్వబడ్డాయి.

పాట సినిమా సంగీత దర్శకుడు
ఘల్లు ఘల్లుమని ఇంద్ర మణిశర్మ
కనులు తెరిచినా కనులు మూసినా ఆనందం
నీ నవ్వుల తెల్లదనాన్ని ఆది మణిశర్మ
సాహసం శ్వాసగా సాగిపో ఒక్కడు మణిశర్మ
చిట్టి నడుమునే చూస్తున్నా గుడుంబా శంకర్ మణిశర్మ
మన్మథా మన్మథా మామ పుత్రుడా ఠాగూర్ మణిశర్మ

పురస్కారాలు, సన్మానాలు

[మార్చు]

జనవరి 31, 2016 న ఆత్రేయ స్మారక కళాపీఠం వారు గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ దంపతులకు వేటూరి స్మారక పురస్కారాన్ని అందజేశారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 వేమూరి, రాధాకృష్ణ. "ఓపెన్‌ హార్ట్‌లో గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్‌". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 5 నవంబరు 2016. Retrieved 18 November 2016.
  2. 2.0 2.1 గొరుసు, జగదీశ్వర్ రెడ్డి. "తాన్ సేన్ అనే వాళ్ళు". telugucinemacharitra.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 19 November 2016.
  3. 3.0 3.1 "Singers get married in the month of lovers". indiaglitz.com. indiaglitz.com. Retrieved 19 November 2016.
  4. "Veturi Memorial award to Mallikarjun, Gopika Poornima". thehansindia.com. The Hans India. Retrieved 19 November 2016.