వందేమాతరం శ్రీనివాస్
వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు, ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు.[1]
టి. కృష్ణ వందేమాతరం సినిమాలో వందేమాతర గీతం వరసమారుతున్నది అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది.[2] ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. అమ్ములు అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఈయన అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, రామకృష్ణాపురం అనే గ్రామంలో ఓ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి ఉండేది.[3] నెల్లూరు లోని వి. ఆర్. కళాశాలలో న్యాయశాస్త్రం చదివాడు.[2]
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]
- ఆయుధం
- ఎర్రసైన్యం
- దండోరా
- లాల్ సలాం
- అడవి దివిటీలు
- ఎర్రోడు
- తెలుగోడు
- అరణ్యం
- ఒరేయ్ రిక్షా
- ఒసేయ్ రాములమ్మా
- దేవుళ్ళు
- రౌడీ దర్బార్
- ఎన్ కౌంటర్
- పెళ్లిపందిరి
- స్వయంవరం
- భారతరత్న
- తెలుగోడు (1998)
- అడవి చుక్క
- సాంబయ్య (1999)
- ముత్యం (2001)
- మిస్సమ్మ (2003)
- ఫూల్స్ (2003)
- నాగప్రతిష్ఠ (2003)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- శంఖారావం (2004)
- గుండమ్మగారి మనవడు (2007)
- ఎర్ర సముద్రం (2008)
- హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (2017)
- జయం మనదే రా
మూలాలు[మార్చు]
- ↑ "వివిఎస్ లక్ష్మణ్, వందేమాతరం శ్రీనివాస్, సత్యన్నారాయణలకు గీతం గౌరవ డాక్టరేట్‌లు". dailyhunt.in. ఆంధ్రప్రభ. Retrieved 9 December 2016.
- ↑ 2.0 2.1 ఎం. ఎల్, నరసింహం. "'Vandemataram', the song that became a surname for singer Srinivas". thehindu.com. ది హిందు. Retrieved 29 December 2017.
- ↑ "ఆ రెండు సినిమాలూ ఓ సవాల్!". www.eenadu.net. Retrieved 2020-09-09.