Jump to content

లాల్ సలాం

వికీపీడియా నుండి
లాల్ సలాం
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం నారాయణమూర్తి
తారాగణం నారాయణమూర్తి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర
భాష తెలుగు

లాల్ సలాం 1992 లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకం కింద ఈ చిత్రాన్ని ఆర్. నారాయణమూర్తి తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్. నారాయణ మూర్తి, గాయత్రి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఆర్. నారాయణమూర్తి
  • గాయత్రి
  • నర్రా
  • కోట శంకరరావు
  • గుంటూరు శాస్త్రి,
  • ముక్కురాజు
  • అత్తిలి లక్ష్మి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, నందిగామ గని, కంచర్ల మోహనరావు, ప్రజావాణి, భానూరి సత్యనారాయణ
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వరంగల్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, ఎస్పీ శైలజ
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాత, దర్శకుడు: R. నారాయణ మూర్తి
  • మాటలు: పి.ఎల్.నారాయణ
  • ఫోటోగ్రఫీ: ఎస్.వెంకట్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి

భూస్వాముల బూర్జువా మనస్తత్వాలు, తాడిత పీడిత పేద ప్రజానీకపు ఆర్తనాదాలు కేంద్రబిందువుగా నడిచే ఇలాంటి కథల్లో నిజంగా కథనం ఉండదు. ఉన్నదంతా మానసిక వ్యధే. ధనిక పేద వర్గాల వర్గ వైషమ్యం, పేదల తిరుగుబాటు, చివరకు ఈ తిరుగుబాటు దారులు తీవ్రవాదులుగా, నక్సలైట్లుగా, డైనమెట్లు పేల్చే స్థితికి ఎదిగి పోవడం, రక్తం ఏరులై పారడం ఇదే కథంతా.

పెదబాబు కొడుకు చినబాబు హరిజనవాడలో ఉన్న లక్ష్మీ అనే అమ్మాయిని మానభంగం చేస్తాడు. ఆమె అన్న సుందరం పట్నంలో చదువుకుని అదే రోజు వస్తాడు. జరిగిన అన్యాయానికి రెచ్చిపోతాడు. లక్ష్మి ఆత్మాహుతు చేసుకుంటుంది. దాంతో మరీ కదనసింహమైపోతాడు. విలయతాండవం చేస్తాడు. ఆ కుంటుంబంపై కక్ష సాధిస్తానని శపథం చేస్తాడు. పెదబాబు మనవరాలు శాంతి న్యాయవాది. ఆమె సుందరాన్ని ప్రేమించి అతని దగ్గరకు వెళ్ళిపోతుంది. ఈ కథకు ప్రేరణ చుండూరు దారుణ మారణ కాండ. కథను దర్శకుడైన ఆర్. నారాయణమూర్తి తయారుచేసుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Laal Salaam (1992)". Indiancine.ma. Retrieved 2022-12-25.
"https://te.wikipedia.org/w/index.php?title=లాల్_సలాం&oldid=3785823" నుండి వెలికితీశారు