ఎర్రోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రోడు
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం ఆర్.నారాయణమూర్తి ,
ఇంద్రజ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఈతరం ఫిల్మ్స్
భాష తెలుగు

ఎర్రోడు 1995లో విడుదలైన తెలుగు సినిమా. ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఆర్ నారాయణమూర్తి, ఇంద్రజ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

ఈ సినిమా ప్లాష్ బ్యాక్ తొ ప్రారంభించాలి. శివశాస్త్రి (నారాయణమూర్తి) వేదాలు నేర్చుకున్న ఘనుడు. తండ్రి అప్పులపాలై, ఓ వ్యాపారస్తుడు నిలదీసిన దృశ్యాన్ని చూచి చలించి, సంపాదించడానికి పట్నానికి వస్తాడు. పట్నంలో తన చదువులు ప్రదర్శించినా ఉద్యోగం దొరక్కపోతే శవ వాహకునిగా మొదటి అనుభవం మాత్రం లభిస్తుంది. ఆ శవం ఎవరిదో కాదు.. తనని వెతుక్కుంటూ పట్నానికి వచ్చి ప్రమాదంలో మరణించి దిక్కులేని శవంగా పడున్న తన తండ్రిది. పది రూపాయలు పుచ్చుకొని శవాన్ని చాపచుట్టలో పెట్టుకొని స్మశానానికి చేఋచి చాప విప్పి చూస్తే కనపడ్డ తన తండ్రి శవాన్ని చూచి విలపింస్తాడు. ఆ తరువాత పాకీవాడుగా రోడ్లు ఊడ్చి, పాయిఖానాలు బాగుచేసేవాడిగా మున్సిపాలిటీ ఉద్యోగమే వచ్చిందనుకోవాలి. ఆ పని చేసే వారందరికీ అతను నాయకుడు.

ఇహ మరోపక్క మున్సిపల్ రాజకీయలు... రోడ్డు వేస్తామని డబ్బు మెక్కిన కాంట్రాక్టర్లు, వారు వేశామని చెప్పిన కంకర, తారు, సిమెంటు రోడ్డు మాయం. తాగడానికి నీళ్ళు కరువు. ఆ మున్సిపాలిటీ చైర్మన్ కథ, మెంబర్ల కథా అన్ని మునిసిపల్ చైర్మన్ల కథలాగానే నడుస్తుంది. అప్పటి మునిసిపల్ చైర్మన్ కి ఓ ఉంపుడు గత్తె సభారంజని (విజయలలిత) తో సహా ఆ తరహా దగుల్బాజీలంతా మెంబర్లు.

ఇప్పుడు కథంతా వారిని ఎర్రోడుగా రూపాంతరం చెందిన శివశాస్త్రి ఎదుర్కొనే తీరు. ఎన్నికల్లో నిలిచి, గెలిచి ఆ పట్టణానికి చైర్మన్ అవడంతో కథలో మరో అంశం ప్రారంభం.

ప్రజల మన్ననలు పొందడానికి ఎన్నో మంచి పనులు చేపడుతూ... చివరికి మాజీలందరికీ ఏవగింపవుతాడు. వారంగా ఒక పథకం పన్ని ఇతన్ని పిచ్చోడు కింద జమకడతారు. వాళ్లపై ఈ ఎర్రోడు చేసిన పిర్యాదులనించి బయటపడటానికి ఇదె మార్గమని వారి ఆలోచన. చివరికి రాష్ట్ర పురపాలక మంత్రి ఈ విలన్ల అండ ఉండి ఎర్రోడిని, ఎర్రోడిగా, పిచ్చోడిగా చూఫే అంతర్నాటకంలా ప్రధాన పాత్ర వహించి గతిలేని ఎర్రోడు "అన్నా" అంటూ నక్సలైట్లను సంబోధించే రీతికి పతాక సన్ని వేశం చేరుకుంటుంది. చివరికి ఎర్రోడుగా ఈ శివశాస్త్రి అందరికీ బుద్ది చెబుతాడు.[2]


తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Errodu (1995)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎర్రోడు&oldid=3850630" నుండి వెలికితీశారు