నర్రా వెంకటేశ్వర రావు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నర్రా వెంకటేశ్వర రావు | |
---|---|
జననం | 1947 |
మరణం | 2009 డిసెంబరు 27 హైదరాబాద్ | (వయసు 62)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1974-2009 |
జీవిత భాగస్వామి | సుశీల |
పిల్లలు | మురళి, వసంతలక్ష్మి |
నర్రా వెంకటేశ్వర రావు తెలుగు నటుడు.[1] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, అగ్రహారం గ్రామం.
జీవిత విశేషాలు
[మార్చు]నర్రా వెంకటేశ్వర రావు 1947లో ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించిన అనుభం ఆయనకుంది. ఆయన భార్య పేరు సుశీల. వారికి ఒక కొడుకు మురళి, ఒక కూతురు వసంతలక్ష్మి.
కెరీర్
[మార్చు]ఆయన 1974లో చదువు సంస్కారం అనే సినిమా తో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆయన చివరి సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మేస్త్రి.
మరణం
[మార్చు]ఆయన డిసెంబరు 27, 2009న 62 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.
నటించిన సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]- ఆటాడిస్తా (2008)
- ఆయుధం
- చట్టంతో పోరాటం
- యువతరం కదిలింది
- ప్రతిఘటన
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
- విజయ్ (1989)
- రేపటి పౌరులు
- కర్తవ్యం
- తొలి ప్రేమ
- పెళ్ళి చేసుకుందాం (1997)[2]
- పవిత్ర ప్రేమ (1998)
- తెలుగోడు (1998)
- ఛలో అసెంబ్లీ (2000)
- అడవిచుక్క (2000)
- 9 నెలలు (2001)
- చిన్నా
- ఇంద్ర
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
- నేనుసైతం (2004)
- శంఖారావం (2004)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- వర్షం
- అమ్మా నాన్న లేకుంటే (2007)
- ఆపరేషన్ దుర్యోధన (2007)
- మేస్త్రి
- సాంబయ్య (1999)
- జయసింహ
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Movie Actor Narra Venkateswara Rao". nettv4u.com. Retrieved 13 September 2016.
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.