తొలిప్రేమ

వికీపీడియా నుండి
(తొలి ప్రేమ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తొలిప్రేమ
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.కరుణాకరన్
నిర్మాణం జి.వి.జి.రాజు
కథ ఎ.కరుణాకరన్
తారాగణం పవన్ కళ్యాణ్,
కీర్తి రెడ్డి,
వాసుకి
ఆలీ,
వేణుమాధవ్,
నగేష్,
సంగీత
సంగీతం దేవా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కె.ఎస్.చిత్ర
సంభాషణలు రమణ చింతపల్లి
ఛాయాగ్రహణం మహీధర్
నిర్మాణ సంస్థ ఎస్.ఎస్.సి. ఆర్ట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తొలిప్రేమ 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు.


1998: ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డు ఎంపిక

జీవితంలో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి యువకుడు బాలు (పవన్ కళ్యాణ్). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ధనిక కుటుంబానికి చెందిన అను (కీర్తి రెడ్డి) ఒక విమాన దుర్ఘటనలో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో హైదరాబాదులో తన తాత గారి ఇంటికి వస్తుంది. జీవితంలో యౌవ్వన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తూ ఉంటుంది అను. దీపావళి రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడౌతాడు బాలు. అనుని కలవాలని, తనతో మాటాడాలని పరితపించి పోతున్న బాలుకి ఒకసారి ఆలయంలో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది.

ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలని సైతం లెక్క చెయ్యక ఓ పసి పాపను భారీ దుర్ఘటన నుండి రక్షిస్తాడు బాలు. అది చూసిన అను తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కాని, విఫలం అవుతుంది. తన చెల్లెలు ప్రియ (వాసుకి) ద్వారా అనుని కలుస్తాడు బాలు. అను పైన ప్రేమని పెంచుకున్న బాలు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. కాని చెల్లెలి సలహా మేరకు అనుతో ముందు స్నేహాన్ని పెంచుకోవటానికి నిర్ణయించుకుంటాడు. ఊటీ వెళుతున్న అను కారు ప్రమాదానికి గురి అవుతుంది. ఆ ప్రమాదంలో లోయలో పడుతున్న అనుని రక్షించి తాను లోయలో పడతాడు బాలు. ఒక లారీ డ్రైవర్ బాలుని ఆస్పత్రి చేరుస్తాడు.

తనకి ఏ విధంగానూ సరిజోడు కాని తన సీనియర్‌తో వివాహానికి ఒప్పుకున్న ప్రియని నిలదీస్తాడు బాలు. అను కూడా అలాగే ఆలోచిస్తే, తన అన్న పడే బాధని తట్టుకోలేనని, ఆ బాధ తనని ప్రేమించేవాడు కూడా పడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆ పెళ్ళికి ఒప్పుకున్నానన్న ప్రియ జవాబుకి చలించిపోతాడు బాలు.

ఉన్నత విద్య కై విదేశాలకి వెడుతున్న అనుకి తన ప్రేమ గురించి చెప్పకూడదు అని అనుకుంటాడు బాలు. విమానం వైపుకి బయలుదేరిన అను హఠాత్తుగా వెనుదిరిగి వచ్చి రోదిస్తూ బాలుని హత్తుకొంటుంది. బాలుని తను ప్రేమిస్తోందని తనకి అప్పుడే అర్థమవుతోందని, తనని వదిలి వెళ్ళలేనని అంటూన్న అనుని సముదాయించి, అను చదువు పూర్తి అయిన వెంటనే మళ్ళీ కలుద్దామని బాలు తనని సాగనంపటంతో చిత్రం సుఖాంతమవుతుంది.

పాటలు

[మార్చు]
  • ఈ మనసే .. సే నా మనసే ... (రచన: సిరివెన్నెల; గానం: బాలు)
  • ఏమి సోదరా.. మనసుకు ఏమయిందిరా (రచన: భువనచంద్ర; గానం: కృష్ణరాజ్)
  • గగనానికి ఉదయం ఒకటే, కెరటానికి సంద్రం ఒకటే (రచన: సిరివెన్నెల; గానం: బాలు)
  • ఏమైందో ఏమో (రచన: సిరివెన్నెల; గానం- బాలు)
  • రొమాన్స్ లో రిథమ్ (రచన: భువనచంద్ర; గానం: సురేష్ పీటర్, ఉన్నికృష్ణన్)

చిత్రావళి

[మార్చు]

విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రం 21 సెంటర్లలో 100రోజులు, రెండు సెంటర్లలో 200రోజులు ఉత్సవాలు జరుపుకొంది. [1]