వాసు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాసు
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కరుణాకరన్
నిర్మాణం కె.ఎస్.రామారావు
కథ ఎ.కరుణాకరన్
చిత్రానువాదం ఎ.కరుణాకరన్
తారాగణం వెంకటేశ్
భూమిక
సంగీతం హేరిస్ జయరాజ్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
కూర్పు మార్తాండ్ కె.వెంకటేష్
అవార్డులు నంది అవార్డు
భాష తెలుగు

వాసు 2002 లో విడుదలైన తెలుగు చిత్రం. నటుడు వెంకటేశ్, భూమిక ప్రధాన తారాగణంగా కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం. ఇందులోని పాటలన్నీ అత్యంత ప్రజాదరణ పొందాయి. గాయకుడు పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఇందులో పాడిన నీజ్ఞాపకాలే నన్ను తడిమేలే పాటకు గానూ 2002 సంవత్సరపు నంది పురస్కారాన్ని అందుకొన్నారు.

వాసు (వెంకటేష్) పోలీసు అధికారి రావు (విజయకుమార్) కొడుకు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కాలేజీ క్యాంటీన్ నడుపుతుంటాడు. దాంతోపాటు ఒక సంగీత పాఠశాలను కూడా నడుపుతూ చిన్నపిల్లలకు సంగీతం నేర్పిస్తూ జీవితం సాగిస్తుంటాడు. వాసు తండ్రి తనలాగే తన కొడుకును కూడా ఎప్పటికైనా ఒక ఐ. పి. ఎస్ అధికారిగా చూడాలనుకుంటూ ఉంటాడు. కానీ వాసుకు మాత్రం సంగీతంపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైనా అందులో మంచి పేరు సాధించాలనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఈ లోపు వాసు దివ్య (భూమిక) అనే అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె దృష్టిలో పడాలని నానా రకాలుగా ప్రయత్నించి నవ్వులపాలవుతుంటాడు.

ఒకసారి తన దగ్గర పనిచేసిన ఎస్సై కొడుకు (బ్రహ్మాజీ) ఐ. పి. ఎస్ కి ఎంపికై రావు ఆశీర్వాదం కోసం వస్తాడు. రావు గారే తన స్ఫూర్తి అని గర్వంగా చెబుతాడు. ఆయన మాత్రం కొడుకు తన మాట ఎందుకని వినడం లేదో అని బాధపడి అతన్ని కొడుక్కి నచ్చజెప్పమంటాడు. కానీ వాసు మాత్రం తనదగ్గరున్న సంగీత విద్యను ప్రదర్శించి అతని మెప్పును పొందుతాడు.

ఒకసారి రావు వాసు బయట కొంతమందితో గొడవపడ్డం చూసి అతని ప్రవర్తన నచ్చక ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడతాడు. కానీ అతను బయటకు వెళ్ళేటపుడే దివ్య తన లగేజీతో ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. దివ్య రావు చిన్నప్పటి స్నేహితుడి కూతురని వాసుకు తరువాత తెలుస్తుంది. ఆమెకు దగ్గరవడానికి తాను సంగీతం జోలికి వెళ్ళనని వాళ్ళ నాన్నను నమ్మించి మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. కానీ రహస్యంగా సంగీత సాధన కొనసాగిస్తూ ఉంటాడు. దివ్య కూడా సంగీతంలో అతని ప్రతిభను గుర్తించి అతన్ని ప్రోత్సహిస్తుంటుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]
  • సోనారే.. సోనారే
  • పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా... (గాయకులు: కె. కె., స్వర్ణలత) రచన: పోతుల రవికిరణ్.
  • ఓ ప్రేమా.. ఓ ప్రేమా.. (గాయకుడు: దేవన్) రచన: పోతుల రవికిరణ్
  • వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా (గాయకులు: బాలు, చిత్ర, కార్తిక్) రచన: పోతుల రవికిరణ్
  • నీ జ్ఞాపకాలే నన్ను తడిమేలే(బాలు)
  • నమ్మవే అమ్మాయి, హరీష్ రాఘవేంద్ర, కె ఎస్ చిత్ర, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
  • స్పోర్టివ్ బాయ్స్ , కె.కె., క్లింటన్ సిరిజో, టీప్పు, రచన: సాహితీ
  • పాడనా తియ్యగా, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: పోతుల రవికిరణ్.

బయటి లింకులు

[మార్చు]