ఆలీ (నటుడు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆలి
Ali actor.jpg
జన్మ నామం మహమ్మద్ ఆలి
జననం (1968-10-10) అక్టోబరు 10, 1968 (వయస్సు: 49  సంవత్సరాలు)[1]
భార్య/భర్త జుబేదా
ప్రముఖ పాత్రలు యమలీల
ఇడియట్
అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
పోకిరి
దేశముదురు
నమో వెంకటేశ
Filmfare Awards
ఫిల్మ్ ఫేర్ పురస్కారము
2005 సూపర్

ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. ఇతడు బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు.[2][3]. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు.

నేపధ్యము[మార్చు]

ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక నిరుపేద కుటంబంలో జన్మించాడు. తండ్రి అబ్దుల్ సుభాణ్ ('మహమ్మద్ భాష గా పిలవబడేవాడూ) దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. ఆలీ చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రిలో స్థిరపడ్డారు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మవీధిలో చిన్న పాకలో ఉండేవారు. ఆలీ పెద్దయ్యాక అక్కడినుండి వేరే ప్రాంతానికి మారారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రంద్వారా మొదటి అవకాశం కల్పించాడు. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు.తెలుగు దేశం పార్టీలోని ప్రచార విభాగంలో చేరాడు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఆలీ వివాహము జుబేదాతో జరిగింది. వీరిది పెద్దలు కుదిర్ఛిన వివాహము.వీరికి ముగ్గురు సంతానము. ఫాతిమా రమీజున్ కుమార్తె మరియు మహమ్మద్ అబ్దుల్ కుమారుడు. తమ్ముడు ఖయ్యూం అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాలలో నటించాడు.

నట ప్రస్థానము[మార్చు]

ఆలి బాల్యనటుడిగా చిత్ర సీమలో ప్రవేశించి, ఇప్పటి వరకు సుమారు 800[ఆధారం చూపాలి] చిత్రాలలో నటించడం జరిగింది. పవన్ కల్యాణ్, పూరీ జగన్నాధ్, వారి ప్రతి చిత్రంలో ఆలికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇతను చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదూ మలాము కు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈటీవీ తెలుగులో ఆలీ 369.. హూ ఈస్ దట్ కాట్రవల్లి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2016 సర్దార్ గబ్బర్ సింగ్
2015 శ్రీమంతుడు (2015 సినిమా)
2013 మిస్టర్ పెళ్ళికొడుకు
జెఫ్ఫా
2012 బాడీగార్డ్
2010 తిమ్మరాజు కథానాయకుడు
2010 ఝుమ్మందినాదం
బావ (సినిమా)
కొమరం పులి
డాన్ శీను
నమో వెంకటేశ
2009 ఏక్ నిరంజన్
బంపర్ ఆఫర్
ప్రవరాఖ్యుడు
ఓయ్
ఎవరైనా ఎప్పుడైనా
సలీం
కిక్ పిచ్చివాడు
మస్కా
2008 సోంబేరి కథా నాయకుడు విడుదలైంది
బుజ్జిగాడు
కంత్రి (సినిమా) లీ జ్యోతిష్యుడు
జల్సా
దొంగ సచ్చినోళ్ళు
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా
నీ సుఖమే నే కోరుకున్నా
జాన్ అప్పారావు 40+
నా మనసుకేమైంది
సవాల్
ఒంటరి
దోషి
2007 విశాఖ ఎక్స్‌ప్రెస్ (సినిమా)
నవ్వులే నవ్వులు నిర్మాణంలో వున్నది
రుద్ర నిర్మాణంలో వున్నది
మీ శ్రేయోభిలాషి
అశోకచక్రం
సీమ శాస్త్రి
తులసి
బజంత్రీలు
టక్కరి
చిరుత నచ్చిమి కొజ్జ పాత్ర, ఈ చిత్రము చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ తొలి చిత్రం.
పెళ్ళయిన కొతాలో T.V యాంకర్ ఆలి
యమదొంగ కథానాయకుని మిత్రుడు
టాస్
భానుమతి
గుండమ్మగారి మనవడు కథానాయకుడు
యోగి భాష
దేశముదురు హిమాలయ బాబ
ఖతర్నాక్ లెక్కల మాస్టారు
బాస్ - I Love You నాగార్జున సాగర్
2006 మాయాజాలం రోగి
టాటా బిర్లా మధ్యలో లైలా లైలా/మస్తాన్
పోకిరి బిచ్చగాడు తెలుగు చలనచిత్ర రంగములోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రం
భాగ్యలక్ష్మి బంపర్ డ్రా యేసుదాసు ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము.
2005 సూపర్ చిత్రకారుడు తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ హాస్య నటుడు పురస్కారము
ఎవడి గోల వాడిది పూర్తి హాస్య చిత్రం
2004 అమ్మాయి బాగుంది
నేనున్నాను కమలహాసన్
2003 అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
ఆయుధం
శివమణి
2002 వాసు
ఇడియట్
ఆది
2001 ఖుషి
ఇష్టం
1999 పవిత్ర ప్రేమ
1998 తొలిప్రేమ
1996 వినోదం
హలో బ్రదర్
1980 సీతాకోకచిలుక మొదటి చిత్రం, బాలనటుడుగా పరిచయం

మూలాలు[మార్చు]

  1. http://freetelugucomedyclips.blogspot.com/2010/02/ali-bio-telugu-comedian-ali-profile.html
  2. http://ibnlive.in.com/news/telugu-actor-ali-dedicates-doctorate-honour-to-his-father/393032-71-216.html
  3. http://eenadu.net/Homeinner.aspx?item=break77

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలీ_(నటుడు)&oldid=2211752" నుండి వెలికితీశారు