అంటే సుందరానికి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంటే సుందరానికి!
దర్శకత్వంవివేక్ ఆత్రేయ
రచనవివేక్ ఆత్రేయ
నిర్మాత
  • నవీన్ ఎర్నేని
  • వై. రవిశంకర్
తారాగణం
ఛాయాగ్రహణంనికేత్ బొమ్మిరెడ్డి
కూర్పురవి తేజ గిరజాల
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
2022 జూన్ 10 (2022-06-10)(థియేటర్)
2022 జూలై 10 (2022-07-10)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

అంటే సుంద‌రానికీ 2022లో తెలుగులో విడుదలయిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. నాని, నజ్రియా నజీమ్,[1] సుహాస్, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ‘అడాడే సుందరా’, మలయాళంలో ‘అహా సుందరా’ పేరుతో జూన్ 10న విడుదలై,[2] నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

ఈ చిత్రం ప్రధానంగా హైదరాబాద్, యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించబడింది. బాక్సాఫీస్ వద్ద ₹38 కోట్లకు పైగా వసూలు చేసింది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

ప్రచారం[మార్చు]

నాని హీరోగా 28వ సినిమాగా 'అంటే సుంద‌రానికి' సినిమా టైటిల్ ను 2020 నవంబర్ 22న విడుదల చేశారు.[4] 2022 న్యూఇయర్‌ సందర్భంగా నాని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు వీడియోను జనవరి 2న విడుదల చేశారు.[5] ‘అంటే సుందరానికి’ నుంచి బర్త్‌డే హోమం పేరుతో స్పెషల్ వీడియోను ఫిబ్రవరి 23న విడుదల చేశారు.[6] ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేసి,[7] ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మే 30న విడుదల చేసి,[8] ట్రైలర్‌ను జూన్ 2న విడుదల చేశారు. అంటే సుంద‌రానికి సినిమాకు సంబంధించి ఏప్రిల్ 22, మే 6, మే 20 లేదా 27, జూన్ 3 లేదా 10 తేదీలు అంటూ ఏడు తేదీల‌ను విడుద‌ల చేసి[9] చివరిగా జూన్ 10న విడుదల ఖరారు చేశారు.[10]

పాటలు[మార్చు]

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ది పంచెకట్టు[11]"  అరుణా సాయిరాం 4:53
2. "ఎంత చిత్రం[12]"  అనురాగ్ కులకర్ణి
కీర్తన వైద్యనాథన్
5:14
3. "రంగో రంగా[13]"  ఎన్. సి. కారుణ్య 2:37

మూలాలు[మార్చు]

  1. "'First is always special': Nazriya on her debut Telugu film 'Ante Sundaraniki'". The News Minute. 19 April 2021. Retrieved 15 May 2021.
  2. "On the eve of Nani's birthday, his first glimpse in 'Ante Sundaraniki' unveiled - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-23.
  3. 10TV (4 July 2022). "'అంటే సుందరానికి' వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి." (in telugu). Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Eenadu (22 November 2020). "నాని28 సినిమా టైటిల్‌ తెలుసా..?". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  5. Namasthe Telangana (2 January 2022). "సుందర్‌ ప్రపంచం". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  6. 10TV (23 February 2022). "నాని 'అంటే సుందరానికి' నుంచి బర్త్‌డే హోమం పేరుతో స్పెషల్ వీడియో" (in telugu). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. A. B. P. Desam (20 April 2022). "అంటే నాని నవ్వించాడు, నజ్రియాతో పులిహోర కలిపాడు! 'అంటే సుందరానికి' టీజ‌ర్‌ చూశారా?". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  8. 10TV (28 May 2022). "'అంటే.. సుందరానికీ' ట్రైలర్ అప్‌డేట్ అప్పుడేనట!" (in telugu). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Sakshi (4 February 2022). "ఆవకాయ సీజన్‌ బ్లాక్‌.. 'అంటే సుందరానికీ' ఏడు రిలీజ్‌ డేట్స్‌!". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  10. Namasthe Telangana (3 February 2022). "నాని ప‌బ్లిసిటీ కేక‌..ఏకంగా 7 రిలీజ్‌ డేట్స్ ఫిక్స్ చేసిన 'సుంద‌రం'". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  11. Namasthe Telangana (5 April 2022). "నాని 'అంటే సుంద‌రానికి' నుంచి పంచ‌క‌ట్టు ప్రోమో విడుద‌ల‌". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  12. Namasthe Telangana (7 May 2022). "ఎంత చిత్రం ప్రేమ". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  13. Eenadu (23 May 2022). "'రంగో రంగా'.. సుందరం కష్టాలు చూశారా." Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.

బయటి లింకులు[మార్చు]