నజ్రియా నజీమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{Infobox person |birth_date = (1994-12-20) 1994 డిసెంబరు 20 (వయస్సు: 25  సంవత్సరాలు)[1][2] |birth_place = త్రివేండ్రం, కేరళ, భారతదేశం |caption = 2014 లో 61వ ఫిలిం ఫేర్ అవర్డుల ప్రధానోత్సవంలో నజ్రిమా నజీం. | image = Nazriya Nazim.jpg | name = నజ్రిమా నజీమ్(nazriya nazim) |occupation = సినిమా నటి, నాట్యకారిణి, వ్యాఖ్యాత, మోడల్, ప్లేబ్యాక్ సింగర్. |parents = నజీముద్దీన్
బేగం బీనా |relatives = పాజీ (దర్శకుడు), (father-in-law)
ఫాహన్ ఫాసిల్ (brother-in-law) |residence = అలెప్పుజా, కేరళ, భారతదేశం |website = nazriya4u.com |birthname = |years active = 2006, 2010–2014 |spouse = {{marriage|[[Fahadh Faasil]|2014}} }} నజ్రియా నజీమ్ (జననం 20 డిసెంబర్ 1994) ప్రముఖ భారతీయ నటి. తమిళ,  మలయాళ  సినిమాల్లో  ఎక్కువగా  సినిమాలు  చేశారు  ఆమె.  మలయాళం  టివి చానెల్ ఏషియా నెట్ లో  వ్యాఖ్యాతగా  కెరీర్ ప్రారంభించా రు నజ్రియా. 2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో బాలనటిగా తొలిసారి నటించిన ఆమె, మాడ్ డాడ్ (2013) సినిమాతో హీరోయిన్ గా మారారు.  నేరం (2013), రాజారాణి (2013), ఓం శాంతి ఓషానా (2014),  బెంగళూర్ డేస్ (2014) వంటి  పలు  విజయవంతమైన  సినిమాల్లో  కథానాయికగా  నటించారు  నజ్రియా.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఆమె తల్లిదండ్రులు నజీముద్దీన్, బేగం బీనా. ఆమె సోదరుడు నయీన్ నజీం.[3] తిరువనంతపురంకు మారే ముందు వారి కుటుంబం  దుబాయ్ లోని అల్ ఐన్ లో ఉండేది.[4][5] ఆల్ ఐన్ లోని అవర్ ఓన్ ఇంగ్లీష్ హై స్కూల్ లోనూ తిరువనంతపురంలోని క్రైస్ట్ నగర్ సీనియర్ సెకండరీ స్కూల్ లోనూ చదువుకున్నారు ఆమె. ఆమెకు వ్యాపార రంగంలో ఉన్న ఆసక్తితో బిబిఎ కోర్స్ గానీ, కామర్స్ గానీ చదవాలని అనుకునేవారట.[6] 2013లో తిరువనంతపురంలోని మార్ ఇవనియోస్ చేరిన ఆమె షూటింగ్ లో తీరిక లేకపోవడంతో మధ్యలోనే మానేశారు. 

కెరీర్[మార్చు]

ముస్లిం మత సంబంధిత టివి క్విజ్ షో పుణ్యమాసతిలోదేలో వ్యాఖ్యాతగా తన కెరీర్ ప్రారంభించారు నజ్రియా. ఆ తరువాత 2006లో మలయాళ చిత్రం పలంకుతో బాలనటిగా వెండితెర తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించగా, మమ్ముట్టి కుమార్తె పాత్రలో  నటించారు నజ్రియా.[4] మలయాళ చానెల్ ఏషియానెట్ లో మంచ్ స్టార్ సింగర్ అనే సంగీత ప్రధానమైన రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.[4] తిరిగి 2010లో మోహన్ లాల్ చిత్రం ఒరు నాల్ వేరుంలో నటించారు నజ్రియా.[7] ఆ తరువాత సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్ మెంట్ నిర్మించిన యువ్ అనే మ్యూజిక్ ఆల్బంలో నటుడు నివిన్ పౌలీ తో కలసి కథానాయిక పాత్రలో నటించారు ఆమె. ఈ అల్బం కేరళలోనే  కాక, భారతదేశం మొత్తం మీద ఎంతో ప్రాచుర్యం చెందింది.  ముఖ్యంగా యువత ఇప్పటికీ ఈ అల్బంను వీక్షిస్తూనే ఉంటారు.[4]

మలయాళ సినిమా మాడ్ డాడ్ (2013) తో హీరోయిన్ గా మారారు నజ్రియా. ఆ తరువాత యువ్ ఆల్బం టీం దర్శకుడు అల్ఫోన్స్ పుత్తరెన్, నటుడూ నివిన్ పౌలీలతో కలసి నేరం అనే సినిమాను చేశారు ఆమె.  ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేశారు. ఈ  చిత్రం భారీ హిట్ కావడమే కాక, నివిన్, నజ్రియాల నటనకు ప్రేక్షకుల,  విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.[8][9] ఆ తరువాత తమిళంలో రాజా రాణి సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమాను  తెలుగులోకి డబ్బింగ్ చేశారు కూడా. ఈ సినిమాలో కీర్తన పాత్రలో ఐటి ఉద్యోగిగా నటించారు నజ్రియా. ఆమె నటనకు తమిళ, తెలుగు భాషల్లో ఎంతో మంది అభిమానులు అయ్యారు. పలు పత్రికల విమర్శకులు  కూడా ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.[10] మళ్ళీ తమిళంలోనే నైయాందీ అనే హాస్యభరిత చిత్రంలో దంత వైద్యురాలి పాత్రలో నటించారు ఆమె. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.[11]

2014లో దుల్కర్ సల్మాన్ తో కలసి సలాలహ్ మొబైల్స్ అనే సినిమాలో  నటించారు నజ్రియా. ఈ సినిమా హిట్ కాలేదు.[12] ఆ తరువాత మలయాళ చిత్రం ఓం శాంతి ఓషానాలో నివిన్ పౌలీతో మళ్ళీ నటించారు  ఆమె. ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో భారీ హిట్ గా నిలిచింది. అన్ని థియేటర్లలోనూ 50 రోజులు ప్రదర్శింపబడిన సినిమాగా చరిత్ర  సృష్టించింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడమే కాక, వారిద్దరి  నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి.[13] ఈ సినిమా తరువాత మలయాళంలో ఆమె నటించిన బెంగళూరు డేస్, సంసారం ఆరోగ్యతిను హానికారకం, తమిళంలో తిరుమనం ఎన్నుం నిక్కా, వాయి మూడి పేసవుం వంటి పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.[14] అక్టోబరు 2013లో నీ నల్లా వరువాడా సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నారు నజ్రియా. కానీ మార్చి 2014లో ఆ స్థానం కాజల్ అగర్వాల్ కు దక్కింది.  2014లో నేరం (2013) సినిమాకు గాను విజయ్ అవార్డ్స్ ఆమెకు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం ఇచ్చారు. దీనితో పాటు ఆ సినిమాలోని నటనకు ఆమె ఎన్నో ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. 45వ కేరళ రాష్ట్ర ఫిలిం పురస్కారాలలో ఉత్తమ నటి పురస్కారం కూడా  అందుకున్నారు  నజ్రియా. [ఉల్లేఖన అవసరం]

వ్యక్తిగత జీవితం[మార్చు]

జనవరి 2014లో మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ తో వివాహం కుదిరినట్టు మీడియాకు వెల్లడించారు ఆమె. అంజలీ మీనన్ దర్శకత్వం వహించిన బెంగళూర్ డేస్ (2014) సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరికీ పరిచయమైంది. ఈ సినిమాలో భార్యా, భర్తలుగా నటించారు వారు. వీరిద్దరికీ ఫిబ్రవరి 2014లో నిశ్చితార్ధమైంది. వారి పెళ్ళి విషయంలో కీలకమైన పాత్ర తమ తల్లిదండ్రులదేనని వారిద్దరూ వెల్లడించారు.[15][16] తిరువనంతపురంలో 21 ఆగస్టు 2014న నజ్రియా, ఫహద్ లు వివాహం చేసుకున్నారు.[17][18]

సినిమాలు[మార్చు]

నటిగా[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష నోట్స్
2006 పలుంకు గీతు మలయాళం బాల నటి
2010 ప్రమణి సింధు మలయాళం బాల నటి
ఒరు నాళ్ వరుం ధన్య మలయాళం బాల నటి
2013 మ్యాడ్ డాడ్ మరియా మలయాళం
నేరం జినా మలయాళం ఏషియానెట్ ఉత్తమ జంట పురస్కారం
వినితా ఫిలిం పురస్కారాలు - ఉత్తమ జంట పురస్కారం
వేణి తమిళ్ ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ
ఎడిసన్ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారం
విజయ్ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారం
రాజా రాణి కీర్తన తమిళ్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి పురస్కారానికి నామినేషన్
నైయాంది వనరోజ తమిళ్
2014 సలాలహ్ మొబైల్స్ షహానా మలయాళం
ఓం శాంతి ఓషానా పూజ మెతెవ్ మలయాళం కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారం
ఏషియానెట్ పురస్కారాలు - అత్యంత ప్రాచుర్యం పొందిన నటి పురస్కారం
ఏషియానెట్ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్
ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్
వాయి మూడి పేసవుం అంజనా తమిళ్
సంసారం ఆరోగ్యతిను హానికారం మలయాళం
బెంగళూర్ డేస్ దివ్య కుంజు ప్రకాష్ మలయాళం కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారం
వనితా ఫిలిం పురస్కారాలు - అత్యంత ప్రాచుర్యం పొందిన నటి పురస్కారం
ఏషియావిజన్ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్
తిరుమనం ఎనుం నిక్కా విష్ణుప్రియ/అయేషా తమిళ్

నేపధ్య గాయినిగా[మార్చు]

సంవత్సరం పాట చిత్రం భాష నోట్స్
2014 "లాలా లసా" సలాలహ్ మొబైల్స్ మలయాళం మొదటిసారి నేపథ్యగానం
2014 ఎంద కణ్ణిల్ నినక్కై బెంగళూర్ డేస్ మలాయళం

అవార్డులు[మార్చు]

 • 2013 – టిటికె ప్రెస్టీజ్ - వనితా ఫిలిం పురస్కారాలు - ఉత్తమ జంట - నేరం సినిమాకు నివిన్ పౌలీతో కలసి అందుకున్నారు.[19]
 • 2013 – ఏషియా విజన్ పురస్కారాలు - న్యూ సెన్సేషన్ ఇన్ యాక్టింగ్[20]
 • 2014 – జైహింద్ టివి ఫిలిం పురస్కారాలు[21]
 • 2014 – ఏషియానెట్ ఫిలిం పురస్కారాలు - ఉత్తమ జంట - నేరం సినిమా
 • 2013 – ఎడిసన్ పురస్కారాలు - ఉత్తమ నటి  - నేరం
 • 2014 – వికటన్ ఉత్తమ నటి పురస్కారం - నేరం
 • 2014 – విజయ్ పురస్కారాలు - ఉత్తమ నటి డెబ్యూ - నేరం
 • 2014 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి పురస్కారానికి నామినేషన్ - రాజారాణి సినిమా
 • 2014 – ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం - నేరం
 • 2014 – 3వ దక్షిణ భారతదేశ అంతర్జాతీయ సినీ పురస్కారాలు -  ఉత్తమ నటి డెబ్యూ పురస్కారానికి నామినేషన్ - నేరం
 • 2014 – ఏషియావిజన్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ -ఓం శాంతి ఓషానా, బెంగళూర్ డేస్
 • 2014 – ఏషియా విజన్ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్
 • 2015 – ఏషియానెట్ అత్యంత ప్రాచుర్యం పొందిన నటి పురస్కారం - ఓం శాంతి ఓషానా
 • 2015 – ఏషియానెట్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ - ఓం శాంతి ఓషానా
 • 2015 – వనితా ఫిలిం అవార్డ్స్ - అత్యంత ప్రాచుర్యం పొందిన నటి పురస్కారం - ఓం శాంతి ఓషానా, బెంగళూర్ డేస్
 • 2015 - ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ - ఓం శాంతి ఓషానా
 • 2015 – కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు - ఉత్తమ నటి పురస్కారం - ఓం శాంతి ఓషానా, బెంగళూర్ డేస్[22]

మూలాలు[మార్చు]

 1. పిళ్ళై, రాధిక C (20 డిసెంబరు 2013). "Nazriya celebrates her 25th birthday!". The Times of India. Retrieved 23 February 2015.
 2. "Happy Birthday, Nazriya Nazim". Oneindia.in. 20 December 2013. Retrieved 3 March 2014.
 3. കൊച്ചുകൊച്ചു സന്തോഷങ്ങള്‍ – articles,infocus_interview – Mathrubhumi Eves Archived 2013-11-14 at the Wayback Machine.
 4. 4.0 4.1 4.2 4.3 Shilpa Nair Anand (11 January 2013).
 5. "Nazriya – I am the top on Facebook from Mollywood" Archived 2015-11-18 at the Wayback Machine.
 6. Gupta, Rinku.
 7. "Oru Naal Varum (2010) (Malayalam)". nowrunning.
 8. Nikhil Raghavan (2 March 2013).
 9. Asha Prakash (10 August 2012).
 10. "Gautaman Bhaskaran's review: Raja Rani".
 11. "No jitters acting with Dhanush".
 12. "Nazriya is Dulquer Salmaan's next heroine".
 13. "People accepted me so fast; it's a bit scary: Nazriya".
 14. "Nazriya & Dulquer in a bi-lingual" Archived 2015-10-08 at the Wayback Machine. sify.com. 21 October 2013.
 15. Fahadh Faasil and Nazriya profile, bangaloremirror.com; accessed 6 July 2015.
 16. Wedding bells for Fahadh Faasil and Nazriya Nazim, sify.com; accessed 6 July 2015.
 17. Fahadh Faasil and Nazriya Nazim engaged Archived 2014-10-29 at the Wayback Machine, sify.com; accessed 6 July 2015.
 18. Fahadh Faasil and Nazriya Nazim wed, thehindu.com; accessed 6 July 2015.
 19. TTK Prestige-Vanitha Film Awards: Shobhana, Prithviraj win best actor, actress awards, Kerala9.com, 20 January 2014; retrieved 3 March 2014.
 20. Mammotty, Kavya Madhavan bag Asiavision awards.
 21. Jaihind TV Film Awards list Archived 2016-03-04 at the Wayback Machine; accessed 6 July 2015.
 22. "State Awards: Nazriya, Nivin, Sudev bag top honours" Archived 2015-08-13 at the Wayback Machine.