నివిన్ పౌలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నివిన్ పౌలీ (జననం 1984 అక్టోబరు 11) [1] ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఆయన మలయాళ భాషా సినిమాల్లో ఎక్కువగా   నటించారు.[2]

2009లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మలర్వాడీ ఆర్ట్స్ క్లబ్ సినిమా ఆడిషన్స్ కు హాజరైన నివిన్ హీరోగా ఎంపికయ్యారు. నటుడు దిలీప్ ఈ సినిమాను నిర్మించారు. జూలై 2010లో విడులైంది ఈ చిత్రం. ఆ తరువాత కొన్ని చిన్న పాత్రలు, అతిథి పాత్రలు చేసిన నివిన్ మళ్ళీ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన తట్టతిన్ మరయాదు (2012) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు.[3][4] ఆ తరువాత ఆయన నటించిన సినిమాలు వరుసగా నేరం (2013), 1983 (2014), ఓం శాంతి ఓషానా (2014), బెంగళూర్ డేస్ (2014), ఒరు వడక్కన్ సెల్ఫీ (2015), ప్రేమం (2015), యాక్షన్ హీరో బిజు (2016) పెద్ద హిట్లు కావడం విశేషం.[5][6] యాక్షన్ హీరో బిజు సినిమాతో నిర్మాతగా కూడా మారారు ఆయన. తన స్వంత నిర్మాణ సంస్థ పౌలీ జూనియర్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించిగా, అందులో హీరోగా బిజు పాత్రలో నటించారు ఆయన.[7]

తమిళ్ లో నేరం (2013) సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాన్ని అందుకున్నారు నివిన్.[8] 2015లో బెంగళూర్ డేస్, 1983 చిత్రాలకుగానూ 45వ కేరళ రాష్ట్ర ఫిలిం పురస్కారాల్లో ఉత్తమ నటుడు పురస్కారం కూడా గెలుచుకున్నారాయన.[9][10]

తొలినాళ్ళ, వ్యక్తిగత జీవితం[మార్చు]

1984 అక్టోబరు 11న అలువా పట్టణంలో సిరో-మలబార్ కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు నివిన్. తండ్రి పౌలీ బొనవెంచర్ స్విట్జర్ ల్యాండ్ లని ఆరౌలో మెకానిక్ గా పనిచేసేవారు. తల్లి స్విస్ ఆసుపత్రిలో నర్స్. 25 ఏళ్ళ పాటు వారిద్దరూ ఆరౌలో ఉన్నారు. నివిన్ మాత్రం సెలవులు గడిపేందుకు మాత్రమే అక్కడికి వెళ్ళేవారు.[11] ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అంగామలేలోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బిటెక్ చదివారు నివిన్.[12]

2006 నుంచి 2008 వరకు బెంగళూరులో ఇన్ఫోసిస్ లో పనిచేశారు  ఆయన. కానీ ఆయన తండ్రి మరణం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళ తిరిగి వెళ్ళిపోయారు.[13][14]

2010 ఆగస్టు 28న ఎర్నాకులంలోని అలువాలో ఉన్న సెయింట్ డోమినిక్ సిరో-మలబార్ కాథలిక్ చర్చిలో తన స్నేహితురాలు రిన్నా జోయ్ ను వివాహం చేసుకున్నారు నివిన్.[15][16] వారిద్దరూ బిటెక్ లో క్లాస్ మేట్స్. వారికి 2012లో ఒక కొడుకు పుట్టాడు.[17]

మూలాలు[మార్చు]