సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సప్తగిరి ఎక్స్‌ప్రెస్
దర్శకత్వంఅరుణ్ పవార్
రచనసప్తగిరి
నిర్మాతడా. కె. రవి కిరణ్
తారాగణంసప్తగిరి
రోషిణి ప్రకాష్
పోసాని కృష్ణ మురళి
సాయాజీ షిండే
ఛాయాగ్రహణంసి. రాజ్ ప్రసాద్
కూర్పుగౌతంరాజు
సంగీతంవిజయ్ బుల్గనిన్
నిర్మాణ
సంస్థ
సాయి సెల్యూలాయడ్ సినిమాటిక్ క్రియేషన్స్
విడుదల తేదీ
డిసెంబరు 23, 2016
దేశంభారతదేశం
భాషతెలుగు

సప్తగిరి ఎక్స్‌ప్రెస్ 2016లో విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. సాయి సెల్యూలాయడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై డా. కె. రవి కిరణ్ నిర్మాణ సారథ్యంలో అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతం అందించాడు.[1] సప్తగిరి, రోషిణి ప్రకాష్, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఈ చిత్రానికి సప్తగిరి కథను అందించాడు. ఈ చిత్రం తిరుడాన్ అనే తమిళ పోలీస్ చిత్రాన్ని ఆధారం చేసుకొని రూపొందించబడింది. ఇందులో కానిస్టేబుల్ పాత్ర ఉంటుంది.[2] ఈ చిత్రానికి మొదట కాటమరాయుడు అని పేరు పెట్టారు, పవన్ కళ్యాణ్ అదే పేరుతో సినిమా తీస్తున్నారని తెలుసుకున్న పవార్, సప్తగిరి సినిమా పేరును మార్చారు.[3] ఈ చిత్రం 2016 అక్టోబరులో చిత్రీకరణ పూర్తి చేసుకొని, నవంబరులో విడుదల తేతి ప్రకటించబడింది.[4][5] ఈ సినిమా విడుదలై మంచి సమీక్షలను అందుకుంది, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

రంగస్థల కళల్లో డిగ్రీ పూర్తిచేసిన సప్తగిరికి సినిమాలంటే ఇష్టంతో తన స్నేహితులో కలసి షార్ట్ ఫిల్మ్‌లు తీసుకుంటుంటాడు. నిజాయితీపరుడైన హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న సప్తగిరి తండ్రి శివప్రసాద్ తన కొడుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్‌ని చేయాలని కలలు కంటూ ఉంటాడు. సప్తగిరి ఏరియాలోని మాణిక్యం అనే ముఠా నాయకుడు తన గ్యాంగ్‌తో చైన్ స్నాచింగ్‌లు, అమ్మాయిలను వ్యభిచార కూపాల్లోకి నెట్టడం వంటి అరాచకాలు చేస్తుంటాడు. ఆ మాణిక్యానికి డీఎస్పీ పాపాయమ్మ (పోసాని కృష్ణమురళి) తోడుగా ఉంటాడు. అంతేకాకుండా అమ్మాయిలను వ్యభిచార కూపాల్లోకి నెట్టే గ్యాంగ్‌ను పాపాయమ్మ భార్య (హేమ) నడిపిస్తుంటుంది. మాణిక్యం అరాచకాలు అరికట్టాలని, అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని ఎస్పీ (షాయాజీ షిండే) డీఎస్పీ పాపాయమ్మను ఆదేశిస్తారు. అయితే మాణిక్యం, డీఎస్పీ, అతని భార్య అక్రమ దందాలపై హెడ్‌కానిస్టేబుల్ శివప్రసాద్ రహస్యంగా ఒక నివేదిక తయారుచేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ.. మాణిక్యంతో శివప్రసాద్‌ను చంపించేస్తాడు. తన తండ్రిని చంపిన దుర్మార్గులపై సప్తగిరి పగ తీర్చుకోవడం మిగతా కథ.[6]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అరుణ్ పవార్
  • నిర్మాత: డా. కె. రవి కిరణ్
  • రచన: సప్తగిరి
  • సంగీతం: విజయ్ బుల్గనిన్
  • ఛాయాగ్రహణం: సి. రాజ్ ప్రసాద్
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: సాయి సెల్యూలాయడ్ సినిమాటిక్ క్రియేషన్స్

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "బి పాజీటివ్"  యాజిన్ నిజర్  
2. "పాప నువ్వు"  రాహుల్ నంబియార్  
3. "వెలుగు చీకటి"  విజయ్, బుల్గేనిన్  
4. "కెకెక్కిందో లచ్చి"  రంజిత్, గీతా మాధురి  
5. "థీమ్ సాంగ్"  బుల్గేనిన్  

మూలాలు

[మార్చు]
  1. "Sapthagiri Express to launch first song". The Times of India. Archived from the original on 7 January 2019. Retrieved 27 December 2019.
  2. 2.0 2.1 Jonnalagedda, Pranita (4 October 2016). "Mana 'Mini Brahmanandam', Saptagiri, hero ayipoyadochh!". The Times of India. Archived from the original on 10 January 2019. Retrieved 27 December 2019.
  3. "Pawan Kalyan wants to see Saptagiri's film". Deccan Chronicle. 8 November 2016. Archived from the original on 27 December 2019. Retrieved 27 December 2019.
  4. "Comedian Saptagiri turns hero with 'Saptagiri Express'". India Live Today (in అమెరికన్ ఇంగ్లీష్). 3 October 2016. Archived from the original on 21 August 2017. Retrieved 27 December 2019.
  5. Joseph, Deepu. "Surprise guest for 'Saptagiri Express' audio launch". The Times of India. Archived from the original on 27 August 2017. Retrieved 27 December 2019.
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.

ఇతర లంకెలు

[మార్చు]