పవన్ కళ్యాణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొణిదెల పవన్ కల్యాణ్
Pawan2.jpg

పవన్ కల్యాణ్ ముఖచిత్రం

జననం కొణిదెల కల్యాణ్ బాబు
(సెప్టెంబరు 2, 1971)
బాపట్ల , ఆంధ్రప్రదేశ్.
తల్లి_పేరు అంజనా దేవి
తండ్రి_పేరు కొణిదెల వెంకట రావు

ఉద్యోగం = పోలీస్ కానిస్టేబుల్

బిరుదు(లు) పవర్ స్టార్
వేరేపేరు(లు) కల్యాణ్ బాబు, జనసేనాని
వృత్తి సినిమా, రాజకీయ నాయకుడు
నివాసం హైదరాబాద్ తెలంగాణ
భార్య / భర్త(లు) నందిని (మొదటి భార్య, విడాకులు)
రేణుదేశాయ్(రెండవ భార్య, విడాకులు)
అన్నా లెజ్‌నేవా (మూడవ భార్య) ప్రస్తుత భార్య
నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్, తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడు.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1968 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య.సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.[1] ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

నట జీవితం[మార్చు]

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంద్వారా పవన్ కళ్యాణ్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015 లో గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించాడు. 2022లో పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా విడుదల కానుంది[2].

నటన ప్రత్యేకతలు[మార్చు]

తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది.

 • అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు.
 • తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని అతనే రూపొందించాడు.
 • తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించాడు. బద్రి చిత్రంలో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ, ఆంగ్లంల కలయికతో త్రిభాషా గీతంగా, ఖుషిలో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించాడు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే, జానీ చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు.
 • ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్లో దిట్ట కావటంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలలో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు.
 • పవన్ కళ్యాణ్ చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. నేపథ్యగాయకులతో, కొన్ని మార్లు పవన్ కల్యాణే ఈ గీతాలను ఆలపించటం విశేషం

నటించిన చిత్రాలు[మార్చు]

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు

సంవత్సరం చిత్రము పాత్ర పోరాటాలు గానం నృత్యాలు ఇతర విశేషాలు
1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కళ్యాణ్ - - -
1997 గోకులంలో సీత పవన్ - - -
1998 సుస్వాగతం గణేష్ - - -
1998 తొలిప్రేమ బాలు - - -
1999 తమ్ముడు సుభాష్ తాడీచెట్టెక్కలేవు మేడ్ ఇన్ ఆంధ్ర,
కలకలలు తప్ప మిగిలినవన్నీ
2000 బద్రి బద్రీనాథ్ - బంగాళాఖాతంలో,
ఐ ఆం ఎన్ ఇండియన్,
ఏ చికితా
2001 ఖుషి సిద్దార్థ్ రాయ్ బైబైయ్యే బంగారు రమణమ్మ గజ్జ గల్లు తప్ప మిగిలనవన్నీ
2003 జానీ జానీ నువ్వు సారా తాగుతా, రావోయి మా కంట్రీకీ అన్ని పాటలు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
2004 గుడుంబా శంకర్ గుడుంబా శంకర్ / కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ / శంకర్ దీక్షితులు కిళ్ళీ కిళ్ళీ అన్ని పాటలు
2005 బాలు బాలు, గని - - -
2006 బంగారం బంగారం - - -
2006 అన్నవరం అన్నవరం - - "నీవల్లే నీవల్లే" పాట
2007 శంకర్ దాదా జిందాబాద్ సురేశ్ - - - అతిథి పాత్ర
2008 జల్సా సంజయ్ సాహు - - -
2010 కొమరం పులి కొమరం పులి - -
2011 తీన్ మార్ అర్జున్ పాల్వాయ్,
మైఖెల్ వేలాయుధం
- - ద్విపాత్రాభినయం
2011 పంజా జైదేవ్ - పాపారాయుడు "పంజా" పాట
2012 గబ్బర్ సింగ్ వెంకటరత్నం నాయుడు ఊరాఫ్ గబ్బర్ సింగ్ - పిల్లా నువ్వులేని జీవితం దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు,
దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ - ఉత్తమ నటుడు,
సిని"మా" అవార్డ్ - ఉత్తమ నటుడు
2012 కెమెరామెన్ గంగతో రాంబాబు రాంబాబు - - -
2013 అత్తారింటికి దారేది గౌతం నందా ఊరాఫ్ సిద్ధు - కాటమ రాయుడా
2015 గోపాల గోపాల శ్రీకృష్ణపరమాత్మ -
2016 సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
2017 కాటమరాయుడు కటమరాయుడు -
2018 అజ్ఞాతవాసి - కొడకా కోటేశ్వరరావా కరుసై పోతవురో
2021 వకీల్‌ సాబ్ లాయర్‌ సత్యదేవ్ - - - హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రం రీమేక్[3]
2022 హరి హర వీరమల్లు

రాజకీయ జీవితం[మార్చు]

2014 మార్చి 14జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు[4].అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు.ఇతని ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది.[ఆధారం చూపాలి] కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న అతని నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు.

ఈ సమయంలో[ఎప్పుడు?] గూగుల్లో అత్యంత ఎక్కువ శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచాడు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు.కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణాలోనూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

పవన్ కళ్యాణ్ భార్య మరియు నటి అన్నా లెజ్‌నేవా

వ్యక్తిగత జీవితం[మార్చు]

మే 1997లో నందీనితో పవన్ కు వివాహం జరిగింది. రేణూ దేశాయ్ తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడనీ 2007 జూలైలో నందిని కోర్టులో కేసు వేసింది.[5] చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా, నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కొర్టు స్టే ఇచ్టింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా, ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకొన్నట్లుగా తెలుస్తుంది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది.

నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.[6] విడిపోయే సమయంలోఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకొంటున్నానని స్పష్టం చేసింది.

2013 సెప్టెంబరు 30న ఇతని వివాహం రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో జరిగింది. హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది[7]. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్[8].

అవార్డులు[మార్చు]

 • నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నాడు.[9]. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.[10]

మూలాలు[మార్చు]

 1. "రేపటి తరాల కోసమే...నా ఆరాటం". ఈనాడు.నెట్. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 22 March 2017. Retrieved 22 March 2017.
 2. "Pawan Kalyan Upcoming Movies List 2021-22". Tollywood Ace (in ఇంగ్లీష్). Retrieved 2021-07-24.
 3. Boy, Zupp (2020-11-02). "Pawan Kalyan joins the sets of Vakeel Saab finally". Moviezupp (in ఇంగ్లీష్). Retrieved 2021-01-01.
 4. "కాంగ్రెస్‌ హఠావో దేశ్ బచావో". సూర్య. 2014-03-15. Retrieved 2014-03-15.[permanent dead link]
 5. పవన్ కళ్యాణ్ నందినిల విడాకులు మంజూరు
 6. పవన్ వ్యక్తిగత స్వేచ్ఛను నేను ఆక్రమించదలచుకోలేదు - రేణు దేశాయ్
 7. గాద్గి హరీష్ నివాసం జహీరాబాద్ కల్యాన్ గారి ముఖ్య అనుచరుడు Pawan Kalyan is married to Russian Anna Lezhneva
 8. [1]
 9. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి ఎక్సెలెన్స్ అవార్డ్
 10. [2]

వెలుపలి లంకెలు[మార్చు]