టి. త్రివిక్రమరావు
స్వరూపం
టి. త్రివిక్రమ రావు | |
---|---|
జననం | |
మరణం | 2008 డిసెంబరు 03 హైదరాబాదు |
మరణ కారణం | గుండె పోటు |
వృత్తి | సినీ నిర్మాత |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు |
టి. త్రివిక్రమరావు ఒక సినీ నిర్మాత.[2] ఈయన ఎన్. టి. ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి మొదలైన ప్రముఖ హీరోలతో జస్టిస్ చౌదరి, దొంగ, గూఢచారి నెం.1, ఘరానా దొంగ, బొబ్బిలి సింహం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ఈయన స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ. హిందీలో కూడా జితేంద్ర హీరోగా పలు సినిమాలు నిర్మించాడు.[3]
జీవితం
[మార్చు]త్రివిక్రమ రావు శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో జన్మించాడు.[1] ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.
సినిమా
[మార్చు]ఆయన మొదటి సినిమా పొట్టేలు పున్నమ్మ.[1] దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఈయనే.[1]
మరణం
[మార్చు]త్రివిక్రమ రావు 2008 డిసెంబరు 3 న గుండెపోటుతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Film producer Trivikrama Rao passes away". timesofindia.indiatimes.com. Times News Network. 4 December 2008. Retrieved 26 March 2018.
- ↑ "Film producer Trivikrama Rao dead". thehindu.com. The Hindu. 4 December 2008. Retrieved 26 March 2018.
- ↑ "ప్రముఖ సినీ నిర్మాత త్రివిక్రమరావు మృతి". telugu.oneindia.com. One India News. 3 December 2008. Retrieved 26 March 2018.