బొబ్బిలి సింహం
| బొబ్బిలి సింహం | |
|---|---|
| దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
| రచన | విజయేంద్ర ప్రసాద్ |
| నిర్మాత | టి. త్రివిక్రమరావు |
| తారాగణం | బాలకృష్ణ, రోజా, మీనా |
| ఛాయాగ్రహణం | ఎ. విన్సెంట్ |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1994 సెప్టెంబరు 23[1] |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
బొబ్బిలి సింహం ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, రోజా, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 1994 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రాన్ని టి. త్రివిక్రమరావు విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
తారాగణం
[మార్చు]- బాలకృష్ణ
- రోజా
- మీనా
- శారద
- శరత్ బాబు
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- జె. వి. సోమయాజులు
- తనికెళ్ళ భరణి
- కొంగర జగ్గయ్య
- రాళ్ళపల్లి
- సుధ
- సంగీత
- మోహన్ రాజ్
Plot
విజయ భూపతి రాజు (బాల కృష్ణ) బొబ్బిలి వంశం వారసుడు. తన చిన్నప్పుడేయ్ ఒక ప్రమాదం lo అందరిని పోగొట్టుకుంటాడు. తన మావయ్య (శరత్ బాబు) అండ్ నానమ్మ (శారదా) చి పెద్ద చేసి వాళ ఊరికి న్యాయాధిపతి అవుతాడు. కొన్ని కారణాల వాళ్ళ వెంకట లక్ష్మి (మీనా) ని రెండవ పెళ్లి చేసుకుంటాడు. వెంకట లక్ష్మి ని ఇంటికి తీసుకుని వోచిన తా మొదటి భార్య శ్రావణి (రోజా) గురించి అసలు విషయం తెలుస్తుండి (సత్యనారాయణ) ఎలాగైనా బొబ్బిలి పీఠం ఎక్కాలని చాల కాలం గ ఎడ్రసుచూస్తూ ఉంటాడు.అది ఎక్కడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. విజయ భూపతి రాజు కి తన తండ్రి కి రెండవ భార్య ఉందని తెలుసుకుని తన చెల్లెలి ని పశుపతి రెండవ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
విజయ భూపతి కి శ్రావణి వైనందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రావణి కి బ్లడ్ కాన్సర్ వాళ్ళ తాను చనిపోతాను అని తెలుసుకుని పట్టుపట్టి విజయ భూపతి కి రెండవ పెళ్లి చేసిందని గ్రహిస్తాడు. తాను చనిపోయే లోపల బొబ్బిలి వారసుడ్ని చూసి చచ్చిపోవాలని ఆశపడ్తుంది. చివరికి అలాగేయ్ జరిగి శ్రావణి చనిపోవడంత కథ ముగుస్తుంది
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]కథారచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథను ప్రేమాభిషేకం ఇతివృత్తం స్ఫూర్తితో తయారుచేశారు. ప్రేమాభిషేకం సినిమాలో కథానాయకునికి కేన్సర్ ఉండడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి కథానాయకికి వేరే వివాహం జరిగేలా ప్రవర్తిస్తాడు. దీన్నే తిరగేసి కథానాయకికి ప్రాణానికి ప్రమాదం కలగడంగా మార్చి ఈ కథను తయారుచేసినట్టు విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.[2]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా బాలు, చిత్ర, నాగూర్ బాబు, రాధిక పాటలు పాడారు. ఆకాష్ ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి. అన్ని పాటలు వేటూరి సుందరరామ్మూర్తి రాయగా, శ్రీరస్తు శుభమస్తు అనే పాటను జాలాది రాశాడు.[3]
- పాలకొల్లు పాపా (బాలు, చిత్ర)
- లకడి కా పూలట (బాలు, చిత్ర)
- శ్రీరస్తు శుభమస్తు (బాలు, చిత్ర)
- ఈడు ఈల వేసినా (బాలు, చిత్ర)
- కిట్టమ్మ లీల (బాలు, చిత్ర)
- మాయదారి పిల్లడా (నాగూర్ బాబు, రాధిక)
మూలాలు
[మార్చు]- ↑ "Bobbili Simham on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-05-13.
- ↑ సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.
- ↑ Prabhu (2019-09-23). "25 Years For Balakrishna Blockbuster Movie Bobbili Simham". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-13.