గూఢచారి నెం.1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూఢచారి నెం.1
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం టి. త్రివిక్రమరావు
తారాగణం చిరంజీవి,
రాధిక,
రావు గోపాలరావు,
గొల్లపూడి మారుతీరావు,
భానుచందర్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

గూఢచారి నెం. 1 కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో 1983 లో విడుదలైన డిటెక్టివ్ సినిమా.[1] నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంటు దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారిగా ఒక గూఢచారి పాత్రలో నటించాడు.[2]

విజయ్ (చిరంజీవి) ఢిల్లీలో ఒక ప్రభుత్వ ఏజెంటు. అతన్ని ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ కోసం ఒక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న చోటికి పంపిస్తారు. అక్కడ గోవిందరావు (రావు గోపాలరావు) రహస్యంగా ఓ స్థావరం నడుపుతూ ఉంటాడు. సుప్రీం అనే విదేశీ తీవ్రవాదితో చేతిలో కలిపి భారతదేశాన్ని నాశనం చేసి తన వశం చేసుకోవాలన్నది అతని పథకం. విజయ్ ని అంతం చేయమని గోవిందరావు తన అనుచరులకు పురమాయిస్తాడు కానీ వాళ్ళందరినీ అతను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు. ఈలోపు విజయ్ అమాయకుడైన గోవిందరావు కొడుకు చిట్టి (భానుచందర్) తో కలిసి అతని స్థావరంలోని ప్రవేశించి అక్కడ ఏదో జరుగుతోందని పసికడతాడు.

తరువాత సుప్రీం వచ్చి ఏజెంటె నంబర్ 1 ను ఎందుకు అడ్డుకోలేదని చీవాట్లు పెడతాడు. ఈలోపు విజయ్ సుప్రీంకి కావాలనే ఎదురుపడి అతని కాల్పులకు చనిపోయినట్లు నటించి వారిని నమ్మిస్తాడు. ఈలోపు విజయ్ తన పై అధికారి ఆనందమూర్తి (ప్రభాకర్ రెడ్డి) ద్వారా కుమార్ అనే చనిపోయిన వ్యక్తి ఫోటోలు సంపాదిస్తాడు. అందులో పక్షితీర్థం, అక్కడి పూజారి వైర్ లెస్ ఫోను పట్టుకున్నట్లు ఫోటోలు ఉంటాయి. విజయ్, వీరాస్వామితో కలిసి అక్కడికి వచ్చే ఒక పక్షి ద్వారా వారికి రహస్య సమాచారం అందుతున్నట్లు తెలుస్తుంది. అందులో సుప్రీం తన శిష్యుడు బర్కిలీ దొర ద్వారా ఒక ఫార్ములా ను పంపుతున్నట్లు సందేశం అందుతుంది. విజయ్ ఆ బర్కిలీ దొరలా మారు వేషం వేసి గోవిందరావు ఇంటిలో మకాం వేస్తాడు. తన నిజ స్వరూపం కనిపెట్టిన పూజారిని మట్టుపెట్టి అతని స్థానంలో వీరాస్వామిని ప్రవేశపెడతాడు. ఈలోపు అసలు బర్కిలో దొర అక్కడికి వస్తాడు. విజయ్ వాళ్ళందరినీ ఎదుర్కొని ఆ స్థావరాన్ని ధ్వంసం చేయడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • చిర్రు బుర్రు కీసు బాసు, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • పిస్తా బహార్, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • సచ్చి నాకడుపున, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • సిగ్గు ఓ అమ్మలాలో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • వంగతోట కాడ, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
  • జయరాం శుభదాం దేవి శ్రీచక్ర (పద్యం) గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. "గూఢచారి నెం. 1". filmibeat.com. Retrieved 5 October 2016.
  2. హరికృష్ణ, మామిడి. "ఏక్ థా గూఢచారి". namasthetelangaana.com. నమస్తే తెలంగాణా. Retrieved 6 October 2016.

బయటి లింకులు

[మార్చు]