ఆర్.ఎన్.సుదర్శన్
ఆర్.ఎన్.సుదర్శన్ | |
---|---|
జననం | రట్టిహల్లి నాగేంద్ర సుదర్శన్ 1939 మే 2 కర్నాటక బ్రిటిష్ ఇండియా. |
మరణం | 2017 సెప్టెంబరు 8 బెంగళూరు, కర్ణాటక | (వయసు 78)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, గాయకుడు, సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1961–2017 |
జీవిత భాగస్వామి | శైలశ్రీ |
పిల్లలు | ఆర్. అరుణ్ కుమార్ |
తల్లిదండ్రులు | ఆర్.నాగేంద్రరావు రత్నాబాయి |
కుటుంబం | ఆర్.ఎన్.కృష్ణప్రసాద్ (సోదరుడు) ఆర్.ఎన్.జయగోపాల్ (సోదరుడు) |
రట్టి నాగేంద్ర సుదర్శన్ (1939 మే 2 – 2017 సెప్టెంబరు 8) భారతీయ సినిమా నటుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా కన్నడ సినిమాలలో తన సేవలనందించాడు. తమిళం, హిందీ, తెలుగు, మలయాళ సినిమాలలో కూడా నటించాడు.[1] మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సినీ జీవితంలో 250 లకు పైగా చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుదర్శన్, ప్రముఖ సినిమా దర్శకుడైన ఆర్. నాగేంద్రరావు కుమారుడు. అతని సోదరులలో -ఆర్.ఎన్.జయగోపాల్ (మరణం.2005) ప్రముఖ సినీ గీత రచయిత, ఆర్.ఎన్.ప్రసాద్ (మరణం.2008) ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అతని భార్య "శైలశ్రీ".[3]
జీవితం
[మార్చు]1961లో ఆయన తన 21వ యేట కన్నడ చిత్రంలో నటునిగా రంగప్రవేశం చేసారు. ఆయన తొలి చిత్రం "విజయనగర వీరపుత్ర". ఆయన సినిమాలలో ప్రతినాయకుని పాత్రలలో నటించడానికి పూర్వమే 60 సినిమాలలో వివిధ పాత్రలలో నటించారు.[4]
ఆయన కన్నడం లోని "అగ్నిశశి" డైలీ సీరియల్ లో నటించాడు.
ఆయన కొన్ని చిత్రాలలో పాటలను కూడా పాడారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ఆర్.ఎన్.సుదర్శన్ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- విజయనగర వీరపుత్రుని కథ (1963)
- అడవి రాజా (1970)
- కోటలోపాగా (1975)
- చిన్నారి చిట్టిబాబు (1981)
- మరియా మై డార్లింగ్ (1981)
- గూఢచారి నెం.1 (1983) - సుప్రీం
- పులిదెబ్బ (1983) - జయరాం
- జేమ్స్ బాండ్ 999 (1984) - ఛటర్జీ
- ప్రళయ సింహం (1984)
- సాహస సింహం (1984)
- ప్రచండ భైరవి (1985)
- మంత్ర దండం (1985)
- పులి (1985) - జగ్గు
- రక్త సింధూరం (1985) - భీమరాజు
- కుట్ర - సుదర్శనరావు
- నాయకుడు (1987)
- స్త్రీ సాహసం (1987) - వజ్రముని
- మరో పోరాటం (1988)
- చారులత (2012) - వయోలిన్ టీచర్
మరణం
[మార్చు]ఆయన కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017, సెప్టెంబరు 8 శుక్రవారంనాడు మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ http://indiatoday.intoday.in/story/rn-sudarshan-dead-at-78-bengaluru/1/1043702.html
- ↑ "Veteran R. N. Sudarshan attacks present trend of Films". indiaglitz.com. 15 December 2005. Retrieved 29 December 2013.
- ↑ http://bangaloremirror.indiatimes.com/bangalore/others/veteran-sandalwood-actor-producer-rn-sudarshan-passes-away-at-78-in-bengaluru/articleshow/60423079.cms
- ↑ http://indianexpress.com/article/entertainment/regional/actor-and-producer-rn-sudarshan-dies-at-78-4834377/
- ↑ http://www.thehindu.com/news/cities/bangalore/veteran-actor-rn-sudarshan-no-more/article19644103.ece