పులి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పులి
(1985 తెలుగు సినిమా)
Puli (1985 film).jpg
దర్శకత్వం రాజ్ భరత్
తారాగణం చిరంజీవి,
రాధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటకృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

పులి 1985 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం, శ్రీ వెంకట కృష్ణ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ [1] లో అనం గోపాల కృష్ణారెడ్డి నిర్మించాడు. రాజ్ భరత్ దర్శకత్వం వహించాడు.[2] చిరంజీవి, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు,[3] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.

కథ[మార్చు]

క్రాంతి (చిరంజీవి) నిజాయితీగల పోలీసు అధికారి. ఆయనను స్పెషల్ బ్రాంచిలో నియమిస్తారు. అతనికి లక్ష్మి అనే సోదరి ఉంది. ఇన్స్పెక్టర్ శ్యామ్ అవినీతి అధికారి. స్మగ్లర్ జెకె కోసం పనిచేస్తూంటాడు. ఒక రోజు, శ్యామ్ చేసిన ప్రమాదం కారణంగా లక్ష్మి కంటి చూపును కోల్పోతుంది, ఆమె కాబోయే భర్త మరణిస్తాడు. క్రాంతి దర్యాప్తు చేసి అవినీతి ఇన్స్పెక్టర్ శ్యామ్‌ను అతని సహచరుడు జేమ్స్ నూ పట్టుకుంటాడు. ఇంతలో జెకె, రాధ లక్ష్మిలను కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను విడిపించి దుష్టులను శిక్షించడమే మిగతా సినిమా కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

వేటూరి సుందరరామ మూర్తి రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. AVM కంపెనీ ఆడియోను విడుదల చేసింది.[5]

సం పాట గాయనీ గాయకులు నిడివి
1 "నున్నా నున్నని వళ్ళు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:22
2 "కండచూసి ప్రేమిస్తాలే" ఎస్పీ బాలు, పి.సుశీల 3:45
3 "ఎందుకింత కోపాలు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:24
4 "మా కంటి పాపకు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:40
5 "ఓ మావయ్య" ఎస్.జానకి 4:28

మూలాలు[మార్చు]

  1. Puli (Banner). Chitr.com.
  2. Puli (Direction). Filmibeat.
  3. Puli (Cast & Crew). gomolo.com.
  4. Puli (Review). The Cine Bay.
  5. Puli (Songs). Cineradham.